Naga Chaitanya Parasuram Movie: నాగచైతన్య - పరశురామ్ సినిమా ఆగిపోయిందా?
Naga Chaitanya Parasuram Movie: అక్కినేని హీరో నాగచైతన్య, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఆగిపోయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
Naga Chaitanya Parasuram Movie: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతా గోవిందం సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు పరశురామ్. గీతా గోవిందం సక్సెస్ తర్వాత నాగచైతన్యతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. కానీ మహేష్‌బాబు సర్కారువారి పాట సినిమా ముందుకు రావడంతో నాగచైతన్య సినిమాను హోల్డ్‌లో పెట్టాడు పరశురామ్.
సర్కారువారి పాట సక్సెస్ తర్వాత నాగచైతన్య సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు పరశురామ్. ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. కానీ సర్కారువారి పాట విడుదలై దాదాపు ఏడు నెలలు గడుస్తోన్న నాగచైతన్య, పరశురామ్ సినిమా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.
తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. పరశురామ్ సిద్ధం చేసిన కథ నాగచైతన్యకు నచ్చలేదని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి కలగపోవడంతో నాగచైతన్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. సమిష్టి నిర్ణయంతోనే నాగచైతన్య, పరశురామ్ ఈ సినిమాను పక్కనపెట్టినట్లు చెబుతున్నారు.
నాగచైతన్య ఈ సినిమా నుంచి వైదొలగడంతో విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ సంప్రదింపులు జరుపుతోన్నట్లు తెలిసింది. గీతగోవిందం సక్సెస్ దృష్ట్యా పరశురామ్‌తో విజయ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే విక్రమ్ కె కుమార్‌తో దూత అనే వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు.