Rajinikanth Jailer - Dil Raju: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న దిల్‌రాజు-rajinikanth jailer telugu dubbing rights bagged by dil raju a whopping price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth Jailer - Dil Raju: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న దిల్‌రాజు

Rajinikanth Jailer - Dil Raju: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న దిల్‌రాజు

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2023 01:30 PM IST

Rajinikanth Jailer - Dil Raju: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమా తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ర‌జ‌నీకాంత్
ర‌జ‌నీకాంత్

Rajinikanth Jailer - Dil Raju: విజ‌య్ వారిసు సినిమాతో నిర్మాత‌గా త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు దిల్‌రాజు. ఈ సినిమాతో కోలీవుడ్‌లో పెద్ద హిట్‌ను అందుకున్నాడు. స్ట్రెయిట్ సినిమాల్ని నిర్మిస్తూనే మ‌రోవైపు ఇత‌ర భాష‌ల‌కు చెందిన స్టార్స్‌ సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు దిల్‌రాజు.

తాజాగా ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాను దిల్‌రాజు తెలుగులో విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల‌ను భారీ పోటీ మ‌ధ్య దిల్‌రాజు ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న జైల‌ర్ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌తో పాటు శివ‌రాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ర‌జ‌నీకాంత్‌, త‌మ‌న్నా, జాకీష్రాఫ్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. జైల‌ర్ సినిమాను త‌మిళంతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ఈ సినిమా ఒకే రోజు రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల‌ని భావించారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమా రిలీజ్ డేట్‌ను ఆగ‌స్ట్ 11కు వాయిదా వేసిన‌ట్లు తెలిసింది. అదే రోజు త్రివిక్ర‌మ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. సంక్రాంతికి వారిసు విడుద‌ల స‌మ‌యంలో దిల్‌రాజు అనేక విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నారు.

స్ట్రెయిట్ సినిమాల‌కు పోటీగా డ‌బ్బింగ్ సినిమాల్ని విడుద‌ల చేయ‌డం క‌రెక్ట్ కాదంటూ టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు నిర్మాత‌లు దిల్ రాజుపై విమ‌ర్శ‌ల్ని గుప్పించారు. తాజాగా మ‌హేష్‌బాబు సినిమాకు పోటీగా జైల‌ర్‌ రిలీజ్ కానున్న నేప‌థ్యంలో దిల్‌రాజును మ‌రోసారి టాలీవుడ్ వ‌ర్గాలు టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Whats_app_banner