Samantha Shaakuntalam: శాకుంత‌లం సినిమాలో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ఖ‌రీదు ఎన్ని కోట్లు అంటే-shaakuntalam update samantha wearing 3 crore gold jewellery for shakunthala role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Shaakuntalam: శాకుంత‌లం సినిమాలో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ఖ‌రీదు ఎన్ని కోట్లు అంటే

Samantha Shaakuntalam: శాకుంత‌లం సినిమాలో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ఖ‌రీదు ఎన్ని కోట్లు అంటే

Nelki Naresh Kumar HT Telugu
Published Jan 29, 2023 03:16 PM IST

Samantha Shaakuntalam: శాకుంత‌లం సినిమాలో స‌మంత నిజ‌మైన బంగారు న‌గ‌ల‌ను ధ‌రించి షూటింగ్ చేసింద‌ట‌. ఆమె ధ‌రించిన ఈ బంగారు ఆభ‌ర‌ణాల ఖ‌రీదు ఎంతంటే...

స‌మంత
స‌మంత

Samantha Shaakuntalam: కెరీర్‌లో తొలిసారి పౌరాణిక క‌థాంశంతో స‌మంత న‌టిస్తోన్నభారీ బ‌డ్జెట్ సినిమా శాకుంత‌లం. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రేమ‌క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఫిబ్ర‌వ‌రి 17న పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు బాలీవుడ్‌లో శాకుంత‌లం సినిమా రిలీజ్ కానుంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో అశ్ర‌మ‌వాసంలో పెరిగిన యువ‌తిగా, యువ‌రాణిగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో స‌మంత క‌నిపించింది.

శ‌కుంత‌ల రోల్ కోసం స‌మంత క్యాస్టూమ్స్‌, న‌గ‌ల‌ను ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించాడు. ఈ సినిమాకు స్టైలిస్ట్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నీతూ లుల్లా వ్య‌వ‌హ‌రించింది. అలాగే సినిమాలో స‌మంత ధ‌రించిన నగ‌ల‌ను నేహా అనుమోలు డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

ప్రిన్సెస్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన సీన్స్‌లో స‌మంత నిజ‌మైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించి న‌టించిన‌ట్లు స‌మాచారం. డైమండ్స్ పొదిగిన ఈ ఆభ‌ర‌ణాల ఖ‌రీదు దాదాపు మూడు కోట్లు పైనే ఉంటుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొన్న‌ది. యువ‌రాణిగా శకుంత‌ల క్యారెక్ట‌ర్ తెర‌పై నాచుర‌ల్‌గా క‌నిపించాల‌నే ఆలోచ‌న‌తోనే నిజ‌మైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను సినిమాలో ఉప‌యోగించిన‌ట్లు స‌మాచారం.

అంతేకాకుండా ఈ ప్రిన్సెస్ లుక్‌లో స‌మంత ధ‌రించిన చీర బ‌రువు దాదాపు 30 కేజీల పైనే ఉంటుంద‌ని నీతూ లుల్లా తెలిపింది. హ్యాండ్ ఎంబ్రాయిడ‌రీ చీర‌ను ఒరిజిన‌ల్ ముత్యాలు, క్రిస్ట‌ల్స్‌తో స్పెష‌ల్‌గా డిజైన్ చేసిన‌ట్లు చెప్పింది. ఏడు రోజుల పాటు ప్ర‌తి రోజు 12 గంట‌ల పాటు ఈ చీర‌ను ధ‌రించి స‌మంత షూటింగ్‌లో పాల్గొన్న‌ద‌ని నీతూ లుల్లా తెలిపింది.

స‌మంత అంకిత‌భావానికి అదొక నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్న‌ది. శాకుంత‌లం సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ హీరో దేవ్‌మోహ‌న్ క‌నిపిస్తున్నారు. మోహ‌న్‌బాబు, గౌత‌మి కీల‌క పాత్ర‌లు పోషించారు. దిల్‌రాజుతో క‌లిసి గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించింది.

Whats_app_banner