తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mm Keeravaani: పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి

MM Keeravaani: పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి

Hari Prasad S HT Telugu

05 April 2023, 22:33 IST

    • MM Keeravaani: పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు మరకత మణి కీరవాణి. అతనితోపాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్నారు.
పద్మ శ్రీ అవార్డు అందుకుంటున్న రవీనా టాండన్, కీరవాణి
పద్మ శ్రీ అవార్డు అందుకుంటున్న రవీనా టాండన్, కీరవాణి (ANI)

పద్మ శ్రీ అవార్డు అందుకుంటున్న రవీనా టాండన్, కీరవాణి

MM Keeravaani: ఆస్కార్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. అతనితోపాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఈ అవార్డు అందుకుంది. ఈ ఇద్దరూ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ అవార్డు అందుకోవడానికి కీరవాణి పూర్తి నలుపు రంగు డ్రెస్సులో వచ్చాడు. అటు రవీనా టాండన్ మాత్రం గోల్డెన్ శారీలో స్టన్నింగా కనిపించింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను రవీనా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ గౌరవం దక్కినందుకు థ్యాంక్స్ చెప్పింది.

ఈ ఏడాది మొదట్లో వివిధ రంగాలకు చెందిన మొత్తం 106 మందికి కేంద్ర పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఈ ఇద్దరికీ పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకుగాను గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అందుకున్న కీరవాణి.. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన కీరవాణి.. తన గురువులను స్మరించుకున్నాడు.

మార్చి 12న ఆస్కార్స్ వేడుకలో నాటు నాటు పాటకుగాను పాటల రచయిత చంద్రబోస్ తో కలిసి కీరవాణి ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ పాటకు అంతకుముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇండియాకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.