తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mission Impossible Dead Reckoning: అంతటి టామ్ క్రూజ్ కూడా షారుక్ ఖాన్‌ను కాపీ కొట్టాడా?

Mission Impossible Dead Reckoning: అంతటి టామ్ క్రూజ్ కూడా షారుక్ ఖాన్‌ను కాపీ కొట్టాడా?

Hari Prasad S HT Telugu

18 May 2023, 15:29 IST

google News
    • Mission Impossible Dead Reckoning: అంతటి టామ్ క్రూజ్ కూడా షారుక్ ఖాన్‌ను కాపీ కొట్టాడా? సోషల్ మీడియాలో అభిమానులు అదే అంటున్నారు. ఓ హాలీవుడ్ సినిమా ఎవరిని కాపీ కొట్టినా ఎవరూ ఏమీ అనరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పఠాన్, మిషన్ ఇంపాజిబుల్ సీన్లను పోలుస్తూ చేసిన పోస్టులు
పఠాన్, మిషన్ ఇంపాజిబుల్ సీన్లను పోలుస్తూ చేసిన పోస్టులు

పఠాన్, మిషన్ ఇంపాజిబుల్ సీన్లను పోలుస్తూ చేసిన పోస్టులు

Mission Impossible Dead Reckoning: అంతటి హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా మన షారుక్ ఖాన్ ను కాపీ కొట్టాడా? అతని లేటెస్ట్ మూవీ పఠాన్ లోని సీన్లను అలాగే అచ్చుగుద్దినట్లు దించేశాడా? తాజాగా గురువారం (మే 18) రిలీజైన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ వన్ ట్రైలర్ చూసిన అభిమానులు.. సోషల్ మీడియాలో రెండు సీన్లనూ పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు.

అంతేకాదు హాలీవుడ్ వాళ్లు ఇలా కాపీ కొట్టినా ఎవరూ ఏమీ అనరని కూడా ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం. ఈ మూవీ ట్రైలర్ నిజంగా అద్భుతంగా ఉంది. మొత్తం యాక్షన్ సీన్లు, టామ్ క్రూజ్ స్టంట్లతో అదిరిపోయింది. అయితే ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఓ సీన్ దగ్గర మాత్రం ఫ్యాన్స్ కు ఇదెక్కడో చూసినట్లుందే అన్న అనుమానం వచ్చింది.

అంతే షారుక్ నటించిన పఠాన్ మూవీలోని సీన్లను, ఈ డెడ్ రెకనింగ్ పార్ట్ వన్ సీన్లను పక్కపక్కనే పెట్టి.. చూశారా అంతటి మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ కూడా పఠాన్ ను కాపీ కొట్టింది అంటూ పోస్టులు చేశారు. ఈ ట్రైలర్ లో టామ్ క్రూజ్ ఓ కొండ అంచున వేలాడటం, రైలు బోగీ పేలిపోయి కిందపడిపోవడం, బ్రిడ్జ్ కూలిపోయే సీన్లు పఠాన్ మూవీ నుంచి కాపీ కొట్టారన్నది అభిమానులు వాదన.

పఠాన్ లోనూ సల్మాన్ తో కలిసి షారుక్ చాలా ఎత్తులో వేలాడుతూ కనిపిస్తాడు. బ్రిడ్జి పేలిపోవడం, రైలు బోగీ కిందట పడటంలాంటి సీన్లు ఉన్నాయి. ఓ యూజర్ వీటిని పోలుస్తూ పోస్టులు చేయగా.. ఇక అక్కడి నుంచి మిషన్ ఇంపాజిబుల్ పై ట్రోలింగ్ మొదలైంది. నిజానికి పఠాన్ మూవీలో ఆ సీన్లు చూసినప్పుడే జాకీ చాన్ యానిమేషన్ నుంచి కాపీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడవే సీన్లను పఠాన్ నుంచి మిషన్ ఇంపాజిబుల్ కాపీ చేయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చూసి పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గర్వపడుతూ ఉండొచ్చని ఒకరంటే.. పఠాన్ సీన్లన్నీ మిషన్ ఇంపాజిబుల్ నుంచే కాపీ చేశారని అనుకుంటుంటే.. ఇది రివర్స్ లో ఉందేంటి అని మరో యూజర్ అన్నాడు.

తదుపరి వ్యాసం