Pathaan in 1000 crores club: పఠాన్@1000 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు-pathaan in 1000 crores club as the movie becomes fifth indian cinema to do so
Telugu News  /  Entertainment  /  Pathaan In 1000 Crores Club As The Movie Becomes Fifth Indian Cinema To Do So
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్ (HT_PRINT)

Pathaan in 1000 crores club: పఠాన్@1000 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు

21 February 2023, 16:34 ISTHari Prasad S
21 February 2023, 16:34 IST

Pathaan in 1000 crores club: పఠాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

Pathaan in 1000 crores club: సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ కుదేలవుతున్న సమయంలో దేశంలోనే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీని రక్షించింది పఠాన్ మూవీ. బాలీవుడ్ పనైపోలేదని ఈ సినిమా నిరూపించింది. ఆ ఇండస్ట్రీ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నాలుగేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో పఠాన్ పై ముందు నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి సినిమా రిలీజైన తర్వాత కూడా రికార్డుల పరంపర కొనసాగింది. జనవరి 25న రిలీజైన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఓ స్టార్ హీరోకు బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. తాజాగా రూ.1000 కోట్ల అరుదైన క్లబ్ లో చేరింది. షారుక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిన పఠాన్.. తాజాగా ఈ 1000 కోట్ల మైలురాయిని అందుకుంది.

ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. పఠాన్ కంటే ముందు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు రూ.1000 కోట్లకుపైగా వసూలు చేశాయి. దంగల్ ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కొనసాగుతుండగా.. బాహుబలి 2 రెండోస్థానంలో ఉంది.

పఠాన్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకోన్ నటించింది. షారుక్ రా ఏజెంట్ గా కనిపించాడు. జాన్ అబ్రహం విలన్ లా నటించాడు. ఈ స్పై థ్రిల్లర్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించింది.

సంబంధిత కథనం