Shah Rukh Khan Fan : షారూఖ్ అన్నా.. కావాలంటే ఓ వంద రూపాయలు ఎక్కువ తీసుకో-jawan release date shah rukh khan fan offers 200 rupees extra to release the movie as soon as possible ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Jawan Release Date Shah Rukh Khan Fan Offers 200 Rupees Extra To Release The Movie As Soon As Possible

Shah Rukh Khan Fan : షారూఖ్ అన్నా.. కావాలంటే ఓ వంద రూపాయలు ఎక్కువ తీసుకో

షారూఖ్ ఖాన్
షారూఖ్ ఖాన్

Jawan Release Date : జవాన్ రిలీజ్ డేట్ వాయిదా పడిందని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ట్విటర్‌లో షారూఖ్‌కు వెరైటీగా అభ్యర్థన చేశాడు.

'పఠాన్' సినిమా విజయం తర్వాత నటుడు షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షారూక్‌ 'జవాన్‌' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 7న 'జవాన్' థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

జవాన్‌ చిత్రానికి అట్లీ కుమార్‌(Atlee Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి(Vijay Sethupathi), దీపికా పదుకొణె నటిస్తున్నారు. సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 2న 'జవాన్' విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. ఇది కొంతమంది అభిమానులను కలవరపరిచింది. విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ట్విట్టర్లో అభిమానులతో షారూక్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని విచిత్రమైన అభ్యర్థనను పెట్టాడు.

‘జవాన్‌’ విడుదల తేదీ వాయిదా పడిందని ఆవేదన చెందిన ఓ అభిమాని ట్విట్టర్‌లో షారూక్‌ ఖాన్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించాడు. అన్నా.. కావాలంటే 100, 200 రూపాయలు ఎక్కువ తీసుకో.. కానీ జవాన్ సినిమాను త్వరగా విడుదల చేయాలని కోరాడు. దానికి షారూక్ ఖాన్ బదులిస్తూ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇంత తక్కువకు లేదు. మొత్తం పిక్చర్ కావాలా? అంటూ బదులిచ్చాడు.

జవాన్ చిత్రాన్ని(Jawan Movie) షారూక్ ఖాన్ హోమ్ బ్యానర్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' నిర్మిస్తోంది. ఈ సినిమాలో షారూక్ భార్య గౌరీ ఖాన్ పెట్టుబడి పెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన అట్లీ కుమార్ తో షారూఖ్ ఖాన్ తొలిసారి చేతులు కలపడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. ఈ సినిమా షూటింగ్ దేశంలోని వివిధ నగరాల్లో జరిగింది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.