తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather 100 Crore Club: వంద కోట్ల క్లబ్‌లో గాడ్‌ఫాదర్.. మెగాస్టార్ వసూళ్ల సునామీ..!

Godfather 100 Crore Club: వంద కోట్ల క్లబ్‌లో గాడ్‌ఫాదర్.. మెగాస్టార్ వసూళ్ల సునామీ..!

08 October 2022, 18:50 IST

    • Godfather Day 3 collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల మైలురాయిని తాకింది. ఫలితంగా ఆచార్య, లైగర్ సినిమాల జీవితకాలపు కలెక్షన్లను అధిగమించినట్లయింది.
గాడ్ ఫాదర్ వసూళ్లు
గాడ్ ఫాదర్ వసూళ్లు (Twitter)

గాడ్ ఫాదర్ వసూళ్లు

Godfather 100 Crore Collections: మెగాస్టార్ చిరంజీవీకి చాలా రోజుల తర్వాత ఓ సాలిడ్ హిట్ లభించింది. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తనదైన శైలి మాస్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ఈ సినిమా దూసుకెళ్తోంది. రెండు రోజులకే రూ.69 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ చిత్రం.. మూడో రోజుకు కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే గాడ్‌ఫాదర్ ఈ ఘనత సాధించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

లైగర్, ఆచార్య రెండూ సినిమాల జీవిత కాలపు వసూళ్లను గాడ్‌ఫాదర్ అధిగమించింది. చిరంజీవి నటించిన ఆచార్య ఏప్రిల్‌లో విడుదలై పరాజయాన్ని మూటగట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రూ.140 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం రూ,76 కోట్లను మాత్రమే వసూలు చేసింది. మరోపక్క లైగర్ కూడా యాక్షన్ జోనర్‌లో తెరకెక్కి పరాజయం పాలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా అనన్యా పాండే హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం రూ.88 కోట్లను వసూలు చేసింది.

వంద కోట్ల క్లబ్‌లో చేరిన గాడ్‌ఫాదర్.. చిరంజీవి కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించే చిత్రంగా నిలిచే అవకాశముంది. ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150 రూ.164 కోట్లతో మెగాస్టార్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాదించిన చిత్రంగా నిలిచింది. గాడ్‌ఫాదర్ ఆ రికార్డును అతి త్వరలోనే బ్రేక్ చేయనుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, హిందీ బెల్టులో అదనపు స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లాంటి కారణాల వల్ల ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించనుంది.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేసింది. తమన్ సంగీత సారథ్యం వహించగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.