Godfather Response: గాడ్‌ఫాదర్ చిత్రానికి అదనపు స్క్రీన్లు.. హిందీలో సూపర్ రెస్పాన్స్-extra screens added to chiranjeevi godfather movie in hindi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather Response: గాడ్‌ఫాదర్ చిత్రానికి అదనపు స్క్రీన్లు.. హిందీలో సూపర్ రెస్పాన్స్

Godfather Response: గాడ్‌ఫాదర్ చిత్రానికి అదనపు స్క్రీన్లు.. హిందీలో సూపర్ రెస్పాన్స్

Maragani Govardhan HT Telugu
Oct 08, 2022 04:57 PM IST

Godfather Screens Added: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రానికి హిందీలో అదనపు స్క్రీన్లు జోడించారు. ఈ విషయాన్ని మన మెగాస్టారే ట్విటర్ వేదికగా తెలియజేశారు. అక్టోబరు 5న విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

<p>గాడ్ ఫాదర్ విజయోత్సవ సభ</p>
గాడ్ ఫాదర్ విజయోత్సవ సభ (Twitter)

Extra Screens Added to Godfather: దసరా కానుకంగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రానికి ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఉత్తరాదిన ఈ చిత్రానికి వస్తోన్న సూపర్ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం మరో అడుగు ముందుకేసింది. గాడ్‌ఫాదర్ హిందీ వెర్షన్‌కు శనివారం నుంచి మరో 600 స్క్రీన్లను పెంచేశారు. ఈ విషయాన్ని మన మెగాస్టార్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఈ మేరకు వీడియోను షేర్ చేశారు.

"గాడ్‌ఫాదర్‌పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. రిలీజైన రెండు రోజుల్లోనే మా చిత్రం రూ.69 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినందుకు ఆనందిస్తున్నా. హిందీ బెల్టులో మరో 600 స్క్రీన్లు పెంచుతున్నాం. మా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా చేసినందుకు ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు." అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ మెగాస్టార్ మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం 6 గంటలకు గాడ్ ఫాదర్ చిత్ర విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.

గాడ్‌ఫాదర్ చిత్రం రెండు రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మార్కును దాటింది. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 38 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. 31 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ సాధించింది. మొత్తంగా ఈ సినిమా రూ.69 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా కు 35 కోట్ల గ్రాస్‌, 21 కోట్ల షేర్‌ను వ‌చ్చిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) గాడ్‌ఫాద‌ర్ లో కీల‌క పాత్ర పోషించ‌డంతో హిందీలో ఓపెనింగ్స్ బాగున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.

Whats_app_banner

సంబంధిత కథనం