Chiranjeevi Comments on Fans War: టాలీవుడ్ ఫ్యాన్స్ వార్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Chiranjeevi Comments on Fans War: టాలీవుడ్‌లోని ఫ్యాన్ వార్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అతిథిగా చిరంజీవి హాజరయ్యాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి చిరంజీవి ఏమన్నారంటే...
Chiranjeevi Comments on Fans War: 1990 దశకంలో ఓ సినిమా హిట్టయినా, ముహూర్తం జరుపుకున్నా నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబుతో పాటు హీరోలు, డైరెక్లర్ల అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లమని అన్నాడు చిరంజీవి. అందరి మధ్య చక్కటి స్నేహసంబంధాలు ఉండేవని అన్నాడు. బుధవారం నాడు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వార్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండటం చూశానని చిరంజీవి అన్నారు. కానీ వారి అభిమానులు మాత్రం ఒకరిపై మరొకరు ద్వేషం, పగను పెంచుకుంటూ గొడవలు పడేవారని తెలిపాడు. అవన్నీ చూసి బాధ కలిగిందని అన్నాడు.
ఇండస్ట్రీలో ఎవరైనా సినిమాల్లో నటించవచ్చు, ఎవరి సినిమానైనా ఆదరించవచ్చు ఎవరిపైనైనా అభిమానాన్ని ప్రేమను చూపించవచ్చని అనిపించిందని పేర్కొన్నారు. తాను హీరోనైతే ఈ నెగెటివిటీని పోగొట్టాలని అనుకున్నట్లు, హీరోల మధ్య సహృధ్భావ వాతావరణాన్ని కలుగచేసి అభిమానుల్లో మార్పు తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.
అభిమానుల్లోని ద్వేషభావాన్ని పూర్తిగా తొలగించాలని గట్టిగా నిర్ణయించుకున్నానని అన్నారు. . ఆ ఆలోచనతోనే పార్టీ కల్చర్ మొదలుపెట్టానని చెప్పారు. ఓ సినిమా హిట్టయినా, ముహూర్తం జరుపుకున్నా నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబుతో పాటు తెలుగు, తమిళ హీరోలు, డైరెక్లర్లను పిలిచి ప్రత్యేకంగా పార్టీలు ఇచ్చేవాడినని చెప్పాడు. ఆ పార్టీల్లో అరమరికలు లేకుండా అందరం కలిసి మాట్లాడుకునేవాళ్లమని అన్నాడు.
చాలా రోజుల పాటు ఆ పార్టీ కల్చర్ కొనసాగిందని అన్నాడు. అంతేకాకుండా బ్లడ్‌బ్యాంక్ ద్వారా తాను సేవ చేస్తే రక్తం అమ్ముకుంటున్నానని విమర్శలు చేశారని, వాటిపై తాను ఏ రోజు స్పందించలేదని చిరంజీవి పేర్కొన్నాడు. వాస్తవం ఏమిటన్నది వారే నెమ్మదిగా తెలుసుకున్నారని పేర్కొన్నాడు.