Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం-four killed in road accident in vizianagaram accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోల్తా పడిన కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద చోటుచేసుకుంది.

ప్రాథమిక వివరాల ప్రకారం… ఓ కారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తోంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన కారు… డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడకిక్కడే చనిపోయారు. మరోవైపు లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… సహాయక చర్యలు చేపట్టారు.