తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh And Allu Arjun At Reception: ఒకే వేదికపై సూపర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌.. మహేష్‌, అల్లు అర్జున్‌ కలిసిన వేళ

Mahesh and Allu Arjun at reception: ఒకే వేదికపై సూపర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌.. మహేష్‌, అల్లు అర్జున్‌ కలిసిన వేళ

HT Telugu Desk HT Telugu

12 December 2022, 16:27 IST

    • Mahesh and Allu Arjun at reception: ఒకే వేదికపై సూపర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌ కనిపిస్తే ఎలా ఉంటుంది? మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ కలిసి ఫొటోలకు పోజులిస్తే ఫ్యాన్స్‌కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?
వధూవరులతో అల్లు అర్జున్, మహేష్ బాబు.. పక్కన గుణశేఖర్
వధూవరులతో అల్లు అర్జున్, మహేష్ బాబు.. పక్కన గుణశేఖర్

వధూవరులతో అల్లు అర్జున్, మహేష్ బాబు.. పక్కన గుణశేఖర్

Mahesh and Allu Arjun at reception: ఒకరు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు.. మరొకరు పాన్‌ ఇండియాకు ఎదిగిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కలిశారు. కెమెరాలకు పోజులిచ్చారు. ఈ అరుదైన దృశ్యం ఓ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో కనిపించింది. ఆ రిసెప్షన్‌ ఎవరిదో కాదు.. టాలీవుడ్‌ మేటి డైరెక్టర్లలో ఒకడైన గుణశేఖర్ పెద్ద కూతురిది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కి ఈ ఇద్దరు స్టార్లు వచ్చారు. అప్పటికే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వధూవరులతో కలిసి కెమెరాకు పోజులిచ్చాడు. అదే సమయంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ కూడా తన ఎంట్రీ ఇచ్చాడు. దీంతో గుణశేఖర్‌ ఆ ఇద్దరినీ ఒకేసారి స్టేజ్‌పై ఉండాల్సిందిగా కోరాడు. ఈ ఫొటో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

బన్నీ, మహేష్‌ ఇద్దరూ కొత్తగా పెళ్లయిన జంటతో కలిసి కెమెరాకు పోజులిచ్చారు. ఓ డార్క్‌ బ్లూ సూట్‌లో స్టైలిష్‌ స్టార్‌ కనిపించగా.. మహేష్‌ మాత్రం సింపుల్‌గా తనదైన స్టైల్‌ జీన్స్‌, వైట్‌షర్ట్‌తో వచ్చాడు. ఈ ఇద్దరినీ ఇలా ఒకే వేదికపై చూసి అక్కడున్న వాళ్లంతా తెగ ఆనందపడిపోయారు. ఈ పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన ఇతర హైప్రొఫైల్‌ గెస్ట్‌లు కూడా తమ మొబైల్‌ కెమెరాల్లో ఈ ఫొటోను క్యాప్చర్‌ చేశారు.

ఈ ఇద్దరికీ గతంలో సూపర్‌ హిట్‌ మూవీస్‌ అందించాడు డైరెక్టర్‌ గుణశేఖర్‌. మహేష్‌ బాబుకు ఒక్కడు లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చిన ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌.. అల్లు అర్జున్‌తో వరుడు, రుద్రమదేవిలాంటి సినిమాలు తీశాడు. గుణశేఖర్‌ కుటుంబంతో ఈ ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. దీంతో అతడు పిలిచిన వెంటనే వీళ్లు పెళ్లికి హాజరయ్యారు.

ఇక టాలీవుడ్‌ స్టార్లు ఒకే వేదికపై కనిపించిన వాళ్ల ఫ్యాన్స్‌కు కూడా ఓ మెసేజ్‌ను పంపించారు. సాధారణంగా ఇద్దరు స్టార్‌ హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు సహజం. అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు ఒకేసారి రిలీజైనప్పుడు కూడా బన్నీ, మహేష్‌ ఫ్యాన్స్‌ మధ్య ఇలాంటి వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఫొటోలు దిగి తమ మధ్య మాత్రం అలాంటి విభేదాలు లేవని చాటి చెప్పారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.