Allu Arjun : అర్హ తెలంగాణ యాస చూసి.. బన్నీ ఏమన్నారంటే-see how allu arjun react on her daughter allu arha telangana slang ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun : అర్హ తెలంగాణ యాస చూసి.. బన్నీ ఏమన్నారంటే

Allu Arjun : అర్హ తెలంగాణ యాస చూసి.. బన్నీ ఏమన్నారంటే

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 05:02 PM IST

Allu Arha Video : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తన కుమార్తె అర్హ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.

అల్లు అర్జున్, అల్లు అర్హ
అల్లు అర్జున్, అల్లు అర్హ (twitter)

అల్లు అర్జున్(Allu Arjun) ఎంత ప్రొఫెషనల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. కుటుంబానికి సైతం.. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్(Shooting) నుంచి బ్రేక్ దొరికితే.. తన పిల్లలతో గడుపుతారు. అర్హ, అయాన్ తో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక అర్హకి సంబంధించిన క్యూట్ క్యూట్ వీడియోలు(Video), ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. వాటిని చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతుంటారు.

నవంబర్ 21 అల్లు అర్హ పుట్టినరోజు. ఆమె ఆరో ఏడాదిలో అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అల్లు అర్జున్(Allu Arjun) షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే టూ మై క్యూటెస్ట్ బేబి అంటూ పోస్ట్ పెట్టారు. అయితే దీనికి ఓ వీడియోను కూడా జతచేశారు. అందులో అర్హతో బన్నీ మాట్లాడుతున్నారు.

కందిరీగ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. జుట్టులోకి కందిరీగలు వెళ్తున్నాయంటూ అర్హ ముద్దు ముద్దుగా చెబుతుంటే.. బన్నీ మురిసిపోతున్నారు. పొగబెట్టి తేనెపుట్ట తీసినారు అని అర్హ చెప్పడంతో తెలంగాణ యాస మాట్లాడుతుందని బన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తెలంగాణ(Telangana) యాస అంటూ.. అర్హతో అల్లు అర్జున్ అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్, సెలబ్రిటీలు అర్హ(Arha)కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అర్హకి సంబంధించిన క్యూట్ వీడియోలు అప్పుడప్పుడు బన్నీ షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే.. అర్హతో నైట్ రైడ్‌కి వెళ్లి.. రోడ్ పక్కన బండి మీద వేడి వేడి దోశె తినిపించిన పిక్స్ వైరల్ గా మరాయి.

IPL_Entry_Point