Mahesh Babu in Gym: జిమ్‌లో చెమటోడుస్తున్న మహేష్‌ బాబు-mahesh babu in gym with his physical trainer for his next ssmb28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu In Gym: జిమ్‌లో చెమటోడుస్తున్న మహేష్‌ బాబు

Mahesh Babu in Gym: జిమ్‌లో చెమటోడుస్తున్న మహేష్‌ బాబు

Hari Prasad S HT Telugu
Dec 09, 2022 01:28 PM IST

Mahesh Babu in Gym: జిమ్‌లో చెమటోడుస్తున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. ఈ ఫొటోను అతడే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాడు.

జిమ్ లో ఫిజికల్ ట్రైనర్ తో మహేష్ బాబు
జిమ్ లో ఫిజికల్ ట్రైనర్ తో మహేష్ బాబు

Mahesh Babu in Gym: టాలీవుడ్‌లోని హ్యాండ్సమ్‌ హీరోల్లో ఒకడు మహేష్‌ బాబు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. ఇప్పటికీ చెరగని అందం అతని సొంతం. ఈ వయసులోనూ ఇలాంటి అందం, ఫిట్‌నెస్‌ మెయింటేన్ చేయడం అంత సులువు కాదు. దీనికోసం బాగానే శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మహేష్‌ ఎప్పుడూ ముందే ఉంటాడు.

తన ఆరడుగులకుపైగా ఉన్న హైట్‌కు సరిపడే ఫిజిక్‌ను ఎప్పుడూ మెయింటేన్‌ చేస్తాడు. తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం ఓ కొత్త లుక్‌లో కనిపించనున్న మహేష్‌ బాబు.. దీనికోసం జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తున్నాడు. తాజాగా తాను జిమ్‌లో ఉన్న ఫొటోను మహేషే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. ఇందులో అతని ఫిజికల్‌ ట్రైనర్‌ మినాష్‌ గాబ్రియెల్‌ కూడా ఉన్నాడు.

నిజానికి మినాషే ఓ సెల్ఫీ తీయగా.. వెనుకాల ఎంతో స్టైల్‌గా కనిపిస్తున్న మహేష్‌ చేతిలో ఓ వాటర్‌ బాటిల్‌తో కనిపించాడు. లెట్స్‌ గో అంటూ ఓ ఫైర్‌ ఎమోజీతో ఈ ఫొటోను మహేష్‌ పోస్ట్ చేశాడు. ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం ఈ టాలీవుడ్‌ ప్రిన్స్‌ కొత్త హెయిర్‌స్టైల్‌తోనూ కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి తరచూ అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఈ మధ్యే సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంతో మరోసారి ఎస్‌ఎస్‌ఎంబీ28 షూటింగ్‌ ఆగిపోయింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యమవుతుండటంతో వాయిదా పడుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఈ మూవీని త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తుండగా.. పూజా హెగ్డే ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌ కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకొని యూరప్‌ ట్రిప్‌కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఎస్‌ఎస్‌ఎంబీ28 షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ మూవీ తర్వాత మహేష్, రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో మూవీ రాబోతోంది. వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point