Krishna mukunda murari marchi 19th: కృష్ణకి తప్పిన ప్రమాదం.. ముకుంద మాటలకు భయపడుతున్న మురారి, ఆదర్శ్ కి మధు వార్నింగ్
19 March 2024, 7:39 IST
- Krishna mukunda murari serial marchi 19th episode: హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తున్న కృష్ణ, మురారి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోతారు. కొద్దిలో కృష్ణకి పెద్ద ప్రమాదం తప్పుతుంది. కృష్ణతో ప్రేమగా ఉంటే తన ఆయుష్హు తగ్గిపోతుందని ముకుంద ఇచ్చిన వార్నింగ్ కి మురారి భయపడటం మొదలు పెడతాడు.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 19వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial marchi 19th episode: కృష్ణ బాధపడుతుంటే నందిని వచ్చి పలకరిస్తుంది. ఆదర్శ్ అన్నయ్య మాటల గురించి ఆలోచిస్తున్నావా? తను అలా మాట్లాడతాడని అసలు అనుకోలేదు అంటుంది. అన్నయ్య తప్ప నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోవడం లేదు ఏదో బాధలో అంటున్నాడు. నాలుగు రోజుల తర్వాత తనే వచ్చి నీకు సారి చెప్తాడని నందిని ఓదార్చడానికి చూస్తుంది. నా బాధ పెద్దత్తయ్య నాకు బాధ్యత అప్పగించారు కానీ నిర్వర్తించలేకపోతున్నాను. ముకుంద, ఆదర్శ్ ని ఒక్కటి చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ముకుంద ప్రాణాలతో లేదు దానికి కారణం నేనేనని ఆదర్శ్ అంటున్నాడు. ఎందుకు ఇలా చేశావని అడిగితే ఏం సమాధానం చెప్పాలని బాధపడుతుంది. అమ్మకి నీ గురించి తెలుసు ఎవరు ఎన్ని చెప్పినా నమ్మదని అంటుంది.
ఆదర్శ్ మాటలకు బాధపడిన కృష్ణ
ఆదర్శ్ ఇలా మాట్లాడతాడని ఊహించామా టైమ్ బాగోలేనప్పుడు మనం చేసిన మంచి పని కూడా చెడుగా అనిపిస్తుంది. రేపు పెద్దత్తయ్య కూడా నాగురించి చెడుగా ఆలోచించరని గ్యారెంటీ ఏంటని కృష్ణ అంటుంది. మేము ఉన్నాం అమ్మ వచ్చేలోపు ఆదర్శ్ అన్నయ్య మారితే ఈ గొడవలు ఏమి ఉండవని సర్ది చెప్పి వెళ్ళిపోతుంది. మధు మళ్ళీ ముకుంద దెయ్యంలాగా వచ్చిందని భయపడుతూ ఉంటాడు. మురారి వచ్చి ఏం కాదు భయపడొద్దని అంటాడు. ముకుంద విషయంలో భయపడాల్సిన పని లేదు అది నిజం కావచ్చు భ్రమ కావచ్చు. చివరికి నీ నీడ కావచ్చు మనం భయపడేకొద్ది భయపడుతూనే ఉంటాం. ధైర్యంగా ఉంటే దెయ్యం కూడా పారిపోతుందని చెప్తాడు.
ఎంతచెప్పినా కూడా మధు భయపడుతుంటే ఒకవేళ ముకుంద కనిపించినా ధైర్యంగా ఉండమని అంటాడు. మురారి గదిలో ఆలోచిస్తూ కూర్చుంటే కృష్ణ వస్తుంది. మన జీవితం గురించి ఆలోచిస్తున్నాను. వేరే ఆలోచనలు ఏమి లేవు. ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదని అంటాడు. ఇప్పుడు మనం ఎవరికి భయపడుతున్నామని కృష్ణ అంటే ముకుంద ఆత్మ కనిపించిందని చెప్తే టెన్షన్ పడుతుందని అనుకుంటాడు. రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తున్నామని అంటే కృష్ణ వద్దని అంటుంది. కాసేపు తన మూడ్ మార్చడానికి సరదాగా మాట్లాడతాడు. ఆదర్శ్ తాగుతూ ఉంటే సుమలత వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఇలా మందు తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందని అంటుంది.
ఆదర్శ్ కి నచ్చజెప్పడానికి చూసిన సుమలత
మీరందరూ కలిసి నా మనసుని నాశనం చేశారని అంటాడు. నిన్ను ఇలా చూస్తే అమ్మ ఏమైపోతుందని భయంగా ఉందని సుమలత కంగారుపడుతుంది. నాకు జరిగిన అన్యాయం చూసి నాకు అన్యాయం చేసిన వాళ్ళ అంతు చూస్తుందని ఆదర్శ్ కోపంగా చెప్తాడు. నువ్వు అనుకున్నట్టు కృష్ణ అని సుమలత చెప్పబోతుంటే తన పేరు కూడా నా దగ్గర తీసుకురావద్దు. ముకుంద చావుకు కారణమై నా జీవితాన్ని నాశనం చేసిన తనని ఇంకా వెనకేసుకొస్తున్నావ్. తనని ఇంట్లో ఉండనిస్తే బాబాయ్ ని నిన్ను కూడా విడగొడుతుంది. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేదని నోటికొచ్చినట్టు వాగుతాడు.
ఆపరా ఈ ఇంట్లో ఏ స్వార్థం చూసుకోకుండా అందరి సంతోషం గురించి ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ మాత్రమే. తనకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా అందరూ సంతోషంగా ఉంటారంటే ఆ పని చేసేందుకు వెనుకాడదు. మనసులో ఇంత విషాన్ని పెట్టుకున్న నీకు కృష్ణ గురించి ఎంత చెప్పినా అర్థం కాదని అంటుంది. అన్ని తెలుసుకున్న రోజున అంత మంచి మనిషిని అపార్థం చేసుకున్నానా అని పశ్చాత్తాపపడతావని చెప్తుంది. తను మేకవన్నె పులి తన గురించి మీకే త్వరలో అర్థం అవుతుందని ఆదర్శ్ సుమలత మాటలు కొట్టి పరేస్తాడు.
కృష్ణ మీద ప్రేమ కురిపించిన మురారి
మురారి పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి కృష్ణని నిద్రలేపుతాడు. కృష్ణతో నేను సంతోషంగా ఉంటాను నువ్వేం చేస్తావో చూద్దామని అనుకుంటాడు. కావాలని తనతో ప్రేమగా ఉంటాడు. తనకి తల తుడుస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా చూడు ముకుంద. రోజురోజుకీ కృష్ణ మీద నా ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వు నాకు కనిపించడం భ్రమ కాదు నిజమైతే వెళ్లిపో. బతికున్నప్పుడు ఎటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావ్ ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా వెళ్లిపో అనుకుంటాడు. ఆదర్శ్ కిందకి వస్తుంటే రేవతి తనని చూసి మౌనంగా ఉంటుంది. ఏంటి నన్ను చూస్తే భయంగా ఉందా అంటాడు.
అవును నీ ప్రవర్తన చూస్తే భయంగా ఉందని రేవతి చెప్తుంది. పైకి కనిపించే గాయం చూస్తారు కానీ నా మనసులోని గాయాన్ని చూడరని అంటాడు. అందరూ వస్తే ఆదర్శ దంపతులు ఎక్కడని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడే మురారి, కృష్ణ కిందకి వస్తారు. వాళ్ళని చూడగానే కావాలని ఆదర్శ్ ఎక్కువ చేస్తాడు. తను ఏమన్నా రియాక్ట్ కావొద్దని కృష్ణ చెప్తుంది. బయటకి వెళ్లొస్తామని కృష్ణ రేవతికి చెప్తే ఎక్కడికో.. ఎవరి కాపురాలు కూల్చడానికి బయల్దేరుతున్నారని అడుగుతున్నాను.
ఆదర్శ్ ని చంపేస్తానన్న మధు
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని మధు కోపంగా చెప్తాడు. అనవసరంగా వీళ్ళని ఏమైనా అంటే అని ఊరుకొనని మధు వార్నింగ్ ఇస్తాడు. అంటే ఏం చేస్తావ్ చంపేస్తావా అంటాడు. ఏమో చేస్తానేమో తెలియదు కృష్ణ వాళ్ళని మాత్రం ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదని మధు కోపంగా చెప్తాడు. కృష్ణ తనని వారిస్తుంది. రెచ్చగొట్టేది నువ్వే మళ్ళీ సర్ది చెప్పేది నువ్వేనా నువ్వు నీ నాటకాలని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది నీకేదో అయిందని అనిపిస్తుందని నందిని అంటుంది.
ఇంకేం అవుతుంది పిచ్చి పట్టింది మొదట్లో ఇలా మాట్లాడితే బాధలో మాట్లాడాడు అనుకున్నాం కానీ శృతి మించి మాట్లాడుతుంటే పిచ్చి పట్టినట్టేనని సుమలత కోపంగా చెప్తుంది. వీళ్ళ నిజస్వరూపం తెలిసిన రోజు నాకు కాదు మీ అందరికీ పిచ్చి పడుతుందని ఆదర్శ్ వాళ్ళని అవమానిస్తాడు. ఇద్దరూ బాధగా వెళ్లిపోతారు. మనం ఏమి అనకపోతే ఆదర్శ్ తన తప్పు తాను తెలుసుకుంటాడని కృష్ణ అంటుంది.
ఆదర్శ్ ని తీసుకొచ్చి తప్పు చేశారన్న రేవతి
కృష్ణని హాస్పిటల్ ఓపెనింగ్ కి తీసుకెళ్తే ఏదో చేస్తానని అన్నది కదా అడ్రస్ లేదు ఏంటని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ ఆదర్శ్ ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. కృష్ణని శత్రువు చూసినట్టు చూస్తున్నాడని సుమలత అంటుంది. ఇంకోసారి కృష్ణని ఏమైనా అంటే అప్పుడు చెప్తానని మధు ఆవేశంగా రెచ్చిపోతాడు. మనం ఇప్పుడు ఏం చెప్పినా వినడు తనని ఆపేది అక్క మాత్రమేనని అప్పటి వరకు ఓపికగా ఉండాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా బిడ్డ వీడిని తీసుకొచ్చి తప్పు చేశారని రేవతి బాధగా అంటుంది. కృష్ణ వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వాళ్ళు ఏం చేసిన ఈ కుటుంబం మేలు కోసం చేశారు. ఆ విషయం ఈ పిచ్చోడికి అర్థం కాక ఏదేదో ఆలోచిస్తున్నాడు. వెంటనే పెద్ద పెద్దమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పడం మంచిదని మధు సలహా ఇస్తాడు.
కృష్ణకి తప్పిన ప్రమాదం
ఆదర్శ్ ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అమ్మ రావడమే మంచిదని నందిని కూడా సపోర్ట్ గా మాట్లాడుతుంది. కానీ వద్దని తను వచ్చేవరకు ఆదర్శ్ ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించమని రేవతి చెప్తుంది. మురారి కృష్ణని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ముకుంద మాటల గురించి ఆలోచిస్తాడు. కృష్ణని హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏదో చేస్తానని అన్నావ్ కదా మేము వెళ్తున్నాం ఇప్పుడు నువ్వేం చేయలేవు అనుకుంటాడు. అప్పుడే కృష్ణ చీర బండిలో పడి ఇద్దరూ కిందపడిపోతారు. కృష్ణ పడిన పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. అప్పుడే అటుగా ముకుంద కారులో వెళ్తూ మురారిని చూస్తూ ఉంటుంది. తనని చూసి మురారి షాక్ అవుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో మురారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ముకుంద ఆత్మహత్యకి కారణం అయ్యారని చెప్పి అరెస్ట్ చేస్తున్నామని మురారిని తీసుకెళ్తారు.
టాపిక్