Krishna mukunda murari serial march 16th episode: ఆదర్శ్ కృష్ణని నోటికొచ్చినట్టు తిడతాడు. తన జీవితాన్ని సర్వనాశనం చేశావని, స్వార్థం కోసం ఇలా చేశావని నిందిస్తాడు. కృష్ణ ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు. ముకుంద అడ్డు తొలగించుకోవడం కోసం అబద్ధం చెప్పావని అంటాడు. కానీ ఆ అబద్ధంతో ఆగకుండా తనని లోకంలోనే లేకుండా చేశావని నానామాటలు అంటాడు. శభాష్ కృష్ణ నిఈ ప్లానింగ్ కి హ్యాట్సాఫ్. ఇంతచేసి అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా నటిస్తున్నావ్. నువ్వు సమాజంలో తిరుగుతున్న క్రూర జంతువువి. మేక వన్నె పులివి నువ్వు అనేసరికి కృష్ణ బాధగా వెళ్ళిపోతుంది.
ఒక మంచి మనిషిని నీ సూటిపోటి మాటలతో బాధపెడుతున్నావని నందిని అరుస్తుంది. బలి అయిపోయింది నేను బాధ అనుభవిస్తుంది నేను నా ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే అర్థం అవుతుంది నేను చేస్తుంది కరెక్ట్ కాదోనని ఆవేశంగా అనేసి వెళ్ళిపోతాడు. ముకుంద తన తండ్రిని తీసుకుని కొత్త ఇంటికి వస్తుంది. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతాడు. ఇన్నాళ్ళూ మనుషుల మధ్య ఉండి ఆడాను ఇప్పుడు బయటకి వచ్చి ఆడటం మొదలుపెట్టాను దూరంగా ఉండి ఆడాలి. ఇప్పుడు మనం అదే ఇంట్లో ఉంటే నిన్ను ఓదార్చడానికి వస్తే నేను అదే టైమ్ కి అక్కడ ఉంటే అడ్డంగా దొరికిపోతాం. అన్నింటికీ ముఖ్యంగా నువ్వు వాళ్ళ కంట పడకూడదు. ఆవేశంలో నా కూతురు బతికే ఉందని నోరు జారితే అప్పుడు నేను నిజంగానే చావాల్సి వస్తుందని బెదిరిస్తుంది.
నేను ఎందుకు చెప్తానని అంటే నా కన్న తండ్రి గురించి నాకు తెలుసు నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసని కౌంటర్ ఇస్తుంది. అసలు ఏం చేయాలని అనుకుంటున్నావ్ అంటే ఏం చేయాలో చెప్పాను కదాని ఏదో చెప్తుంది. అది వినిపించకుండా మ్యూజిక్ వేస్తారు. ఎందుకు ఇంత రిస్క్ అవసరమా అంటే అవసరమే నాన్న ఇన్నాళ్ళూ నా ప్రేమ మురారి అర్థం చేసుకుంటాడు నా ప్రేమ గెలవకపోతుందా అని ఓపికగా ఎదురుచూశాను. ఏమైంది లైఫ్ లో రిస్క్ చేయకపోతే ఏది సాధించలేనని అంటుంది. ఎందుకు ఈ పంతం ఇప్పటికే నువ్వు బతికి ఉండి కూడా చనిపోయావని పరిస్థితి తీసుకొచ్చావ్ మళ్ళీ ఏదేదో అంటున్నావ్ అంటాడు.
నా ప్లాన్ అది కాదు బతికున్నా చనిపోయినట్టు ఉండాలి, చనిపోయి వాళ్ళ మధ్య బతికి ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుని భవానీ అత్తయ్య వచ్చేలోగా ఆ ఇంట్లో సెటిల్ అవాలని చెప్తుంది. ఇంకొకసారి ఆలోచించు నువ్వు చేస్తుంది కరెక్ట్గా అని అంటే ఆ కుటుంబానికి ఇది జరగాల్సిందే, నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధించమని మాట ఇచ్చావ్ కదా మళ్ళీ ఇలా మాట్లాడతావ్ ఏంటని అంటుంది. నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని ఆవేశంలో మాట ఇచ్చాను కానీ పరిస్థితి ఇంత దిగజారిపోతుందని ఆలోచిస్తుంటే భయంగా ఉందని చెప్తాడు. నాకేం కాదు నాకు మురారి మీద ఎంత ప్రేమ ఉందో కృష్ణ మీద అంత పగ ఉందని అంటుంది. మధ్యలో కృష్ణ ఏం చేసింది, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం మురారి ఏదైనా పగ ఉంటే మురారి మీద ఉండాలి అంటాడు.
మురారిని నేను ప్రేమించాను తన మీద ప్రేమ తప్ప పగ ఉండదు. మురారి మనసు మారడానికి కారణం కృష్ణ, తనే అడ్డు లేకపోతే మురారి ఎప్పుడో నా సొంతం అవుతాడు. కానీ కృష్ణ అడ్డం తిరిగి ఏ ఆడపిల్ల చెప్పని మాట నా నోట చెప్పించి నన్ను ఘోరంగా అవమానించి ఈరోజు నా పరిస్థితికి కారణం అయ్యింది. మురారి మీద ప్రేమ ఎంత ఉందో, అంతకంటే ఎక్కువ పగ కృష్ణ మీద ఉంది. ఒకరిని ప్రేమతో మరొకరిని పగతో ఇద్దరినీ వదలనని అంటుంది. నువ్వు నాకు అడ్డు రాకుండా సపోర్ట్ చెయ్యి చాలని చెప్తుంది.
ముకుంద మురారి ఇంటి బయట నిలబడి ఉంటుంది. మురారికి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా ఉండాల్సిన నేను కాంపౌండ్ బయట ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం నువ్వే కృష్ణ నిన్ను వదలను నేను తిరిగి లోపలికి నువ్వు బయటకి పోయే రోజు దగ్గర్లోనే ఉందని మనసులో అనుకుంటుంది. మురారి అప్పుడే మెట్లు దిగుతూ గుమ్మం బయటకి చూస్తాడు. అక్కడ ముకుంద ఉండటం చూసి షాక్ అవుతాడు. బయటకి పరుగు తీస్తాడు. అంతలోనే ముకుంద మాయం అవుతుంది. ఇంటి చుట్టూ పక్కల మొత్తం వెతుకుతాడు కానీ కనిపించదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
నేను చనిపోయానని నమ్ముతున్నావ్. మళ్ళీ నేను కనిపించేసరికి వెతికి నీ భ్రమ అనుకుని వెళ్లిపోయావ్ నాకు కావలసింది ఇదే. నేను పక్కన ఉన్నప్పుడు నాతో కలిసి బతకాలి. నేను లేనప్పుడు నా భ్రమలో బతకాలి. మొత్తంగా నేనే నీ బతుకు కావాలి అందుకే ఈ చిన్న ప్రయత్నం అనుకుంటుంది. మళ్ళీ మధు వస్తుంటే తనకి కనిపించకుండా తప్పించుకుంటుంది. తన నుంచి తప్పించుకుని వెళ్తుంటే రేవతి కిటికీలో నుంచి వాటర్ పారబోస్తుంది అవి ముకుంద మీద పడబోతాయి. ఎవరో ఉన్నారని అనిపించి వెనక్కి చూసేసరికి ముకుంద చెట్ల వెనక్కి వెళ్ళిపోతుంది.
నేను పోయిన బాధలో అందరూ ఏడుస్తూ ఉంటారు. మురారికి చిన్న ఝలక్ ఇద్దామని వస్తే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక్కరికీ నేను పోయిన బాధలేదని అనుకుంటుంది. ఎవరికీ కనిపించకుండా వెళ్లాలని అనుకుంటుండగా కృష్ణ బయటకి వస్తుంది. తనని చూసి ముకుంద టెన్షన్ పడుతుంది. చీరలు ఆరేసి ఉంటే వాటిని తీసుకుంటుంది కృష్ణ వాటి వెనుక ముకుంద కనిపించకుండా నిలబడుతుంది.
మురారి గదిలోకి వచ్చి ముకుంద గురించి ఆలోచిస్తాడు. నేను చూసింది ముకుందనా? తను చనిపోయింది కదా ఎలా వస్తుంది? నేను భ్రమ పడుతున్నానా?కానీ అచ్చం బతికి ఉన్నట్టుగా ఉంది. నేను ఏదో తనకి అన్యాయం చేసినట్టుగా తప్పు చేసినట్టుగా ఆ చూపులు చెప్తున్నాయి. నేను నిజంగా తప్పు చేశానా? తనకి ఎంతగా నచ్చజెప్పి బతిమలాడానో ఆ దేవుడికి తెలుసు. అయినా ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తించింది. ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని అనుకుంటాడు.
ఆదర్శ్ బయటకి వెళ్తుంటే ఎక్కడని రేవతి అడుగుతుంది. ఈ ఇంట్లో మనుషుల మధ్య ఉంటుంటే నరకంగా ఉందని ఆదర్శ్ కోపంగా అనేసి వెళ్లబోతుంటే మురారి ఆపుతాడు. అసలు ఎవరి మీద కోపంగా ఎవరి మీద చూపిస్తున్నావని అడుగుతాడు. నువ్వు నాకేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మాయలాడి పెళ్ళాం ఉంది కదా తనకి ఇచ్చుకో నీ సలహాలు అనేసరికి మురారి ఆదర్శ్ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు నీ భార్య కలిసి నా ముకుంద చావుకి కారణం అయ్యారని ఆవేశంగా మాట్లాడతాడు. నన్ను ఏమైనా అను పరవాలేదు కృష్ణని ఏమైనా అంటే ఊరుకోనని ఇద్దరూ కలబడతారు.