Krishna mukunda murari march 15th: ఎవరూ ఊహించని ప్లాన్ వేసిన ముకుంద.. కృష్ణని నోటికొచ్చినట్టు తిట్టిన ఆదర్శ్
Krishna mukunda murari serial march 15th episode: మురారిని దక్కించుకోవడం కోసం ముకుంద ఎవరూ ఊహించని ప్లాన్ వేస్తుంది. అటు ముకుంద చనిపోవడానికి కృష్ణ కారణమని ఆదర్శ్ నోటికొచ్చినట్టు తనని తిడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 15th episode: శ్రీనివాస్ ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ముకుంద ఉండటం చూసి షాక్ అవుతాడు. తండ్రి కన్నీళ్ళు తుడిచి చనిపోయింది ఎలా వచ్చిందని భయపడుతున్నావా? లేదా దరిద్రం వదిలిందని అనుకుంటే మళ్ళీ ఎలా వచ్చిందని బాధపడుతున్నావా? అని అడుగుతుంది. నువ్వు లేవు అనేసరికి ఈ బతుకు ఎందుకని అనిపించింది, నిన్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. నువ్వు బతికే ఉన్నావ్ నాకు అది చాలని ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. నేను పోయానని అందరూ నమ్మాలని ఇదంతా నేనే కావాలని చేశాను. ఈ రూపంతో వాళ్ళ ముందుకు వచ్చి నేను సాధించేది ఏముంది? ఏదైనా సాధించాలంటే నేను లేనని నమ్మించి సాధించాలి అందుకే ఇలా చేశానని అంటాడు.

తండ్రికి తన ప్లాన్ చెప్పిన ముకుంద
ఇన్నాళ్ళూ ఆ ఇంట్లో న్యాయంగా పోరాటం చేశావ్. ఇప్పుడు వాళ్ళు నిన్ను అన్యాయంగా బయటకి గెంటేశారు ఇక ఈ మనుషులు మనకి వద్దు అందరికీ దూరంగా ఎక్కడికి అయినా వెళ్లిపోదామని అంటాడు. ఇంత చేసింది మురారిని వదిలేసి దూరంగా వెళ్లాడానికా, ఆ ఆలోచన ఉంటే ఈ నాటకం ఎందుకు, మురారి నిన్ను వదిలేస్తున్నానని ఒక్క మాట చెప్పి ఉండేదాన్ని. ఇదంతా చేసింది దూరంగా వెళ్ళడానికి కాదు నాన్న. మురారికి ఇంకా దగ్గర కావడానికని చెప్తుంది. నువ్వు చనిపోయావని అనుకుంటుంటే వాళ్ళకి ఎలా దగ్గర అవుతావని శ్రీనివాస్ అయోమయంగా అడుగుతాడు.
మురారి రూపం మారిపోయాక నేనే మురారి అని చెప్పేవరకు ఎవరైనా గుర్తు పట్టారా? రెండు మూడు రోజుల తర్వాత నన్ను ఎవరూ గుర్తు పట్టలేరు నీతో సహా అంటుంది. అంటే నువ్వు రూపం మార్చుకుంటున్నావా అని అడుగుతాడు. కోరుకున్నది దక్కించుకోవడానికి పేరు, ఊరు కాదు రూపం కూడా మార్చుకోవాలి తప్పదు. నువ్వు నాకిచ్చిన రూపం తనివితీరా చూసుకో నాన్న అంటుంది. బాధపడకు నాన్న అనుకున్నది సాధించడం కోసం నీ కూతురు ఎంతకైనా తెగిస్తుంది. ఇది నాకు పునర్జన్మ అనుకో అంటుంది. వేరే రూపంలో అయినా తను అనుకున్నది సాధిస్తుందని అంటే అంతకంటే సంతోషం ఏముంది. పైగా నిన్ను అవమానించిన వాళ్ళకి ఇదే కరెక్ట్ సమాధానం నీకు నేను అండగా ఉంటానని మాట ఇస్తాడు.
కృష్ణ వల్లే ఇలా జరిగింది
ఆదర్శ్ తన ఫ్రెండ్ దగ్గర తన బాధ పంచుకుంటాడు. ముకుందకి నామీద ఇష్టం లేదని నాకు అనిపించింది. నేను చెప్తానే ఉన్నాను కానీ మురారి వాళ్ళు వినలేదు. అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు. కలిసి ఉండకపోయినా ముకుంద ప్రాణాలతో అయినా ఉండేది కదా అంటాడు. నేను అనవసరంగా వాళ్ళని తిట్టేశాను. వాళ్ళు మా ఇద్దరిని కలపాలని చూశారు. నేను ఆవేశంలో నోటికి వచ్చినట్టు మాట్లాడానని బాధపడతాడు. నీ ఆవేశంలో అర్థం ఉంది. నువ్వు చెప్పింది మొత్తం విన్నాక నాకు ఒకటి అర్థం అయ్యింది. ఇందులో మురారి తప్పు లేదు తప్పు అంతా కృష్ణదే అని ధరావత్ అంటాడు. లేదని ఆదర్శ్ చెప్తాడు.
ముకుందని హ్యాండిల్ చేయడంతో కృష్ణ తప్పు చేసింది. ఏ భార్య అయినా పరాయి స్త్రీతో పరిచయం ఉన్నా కూడా సహించలేదు. అలాంటిది ముకుంద గతంలో తన భర్తని ప్రేమించిందని, ఇంకా తన మీద ఆశలు పెట్టుకుందని తెలిసినా సహించింది. అంత పెద్ద మనసు ఉండటం కూడా తప్పే. ఆ విషయంలో కృష్ణ చాలా పెద్ద తప్పు చేసిందని ధరావత్ అంటాడు. మామూలుగా అయితే ముకుంద మనసు మార్చడానికి ప్రయత్నించాలి బుద్ధి చెప్పాలి. అప్పటికీ మారకపోతే తనకి దూరంగా ఉండాలి. కానీ కృష్ణ అలా చేయలేదు నిన్ను తీసుకొచ్చి మీ ఇద్దరూ కలిసి ఉంటే ముకుంద తన భర్తని మర్చిపోతుందని, మీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా దూరంగా పంపించి తన భర్తతో కలిసి సంతోషంగా ఉండవచ్చని ప్లాన్ చేసింది. కృష్ణ ముకుందని అవమానించిన మాటలు ఆదర్శ్ గుర్తు చేసుకుంటాడు.
కృష్ణని జన్మలో క్షమించను
తన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది ముకుంద తన ప్రేమని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందని అంటే ఆదర్శ్ ఆవేశంగా అర్థమయింది. కృష్ణ ఇదంతా చేసింది మేము సంతోషంగా ఉండటం కోసం కాదు తన స్వార్థం కోసం మమ్మల్ని పాములుగా వాడుకుని ముకుందని బలితీసుకుందని అంటాడు. నో కృష్ణ స్వార్థంతో ఇదంతా చేసిందని నేను చెప్పడం లేదు ఇదొక పరిష్కారం అనుకుంది కానీ దురదృష్టవశాత్తూ వర్కౌట్ కాలేదని ధరావత్ అంటాడు. లేదు తన స్వార్థం కోసమే చేసింది ప్రశాంతంగా ఉన్న నా జీవితంతో ఆడుకుంది కృష్ణని నేను ఈ జన్మలో క్షమించలేనని తనని అపార్థం చేసుకుంటాడు.
కృష్ణ ఒంటరిగా ఉంది జరిగింది తలుచుకుని బాధపడుతుంటే రేవతి వచ్చి పలకరిస్తుంది. రెండు జంటలు కలిసి సంతోషంగా ఉంటారని ఎంతో ఆశపడ్డాం కానీ అంతా అల్లకల్లోలం చేసి పోయిందని రేవతి తిడుతుంది. అప్పటికీ మధు చెప్తూనే ఉన్నాడు కానీ మనమే నమ్మలేదు ముకుంద మారిందని అనుకున్నామని నందిని అంటుంది. ఎక్కడ మారింది ఆదర్శ్ ని దూరంగా ఉంచాలి మురారిని ఎలా సొంతం చేసుకోవాలా అని ఆలోచించింది అది మనం తెలుసుకోలేకపోయామని సుమలత కూడా నిందిస్తుంది. ఆదర్శ్ వాళ్ళ మాటలు విని వస్తాడు. ఏదైనా ఆలోచించనివ్వు తను ఉండి ఉంటే తన ఆలోచనలు మార్చి ఉండే దాన్ని తన మనసు మార్చి ఉండేవాళ్లం. కానీ ఇంత పిచ్చి పని చేస్తుందని ఊహించలేదని కృష్ణ బాధపడుతుంది.
కృష్ణని అపార్థం చేసుకున్న ఆదర్శ్
అదంతా తమరి పుణ్యమే కదాని ఆదర్శ్ అంటాడు. ముకుంద శవంలా మారిందన్నా, నేను జీవశ్చవంలా మారిందన్నా దానికి కారణం నువ్వే. మొత్తం కృష్ణ చేసింది మీకేవారికి అర్థం కావడం లేదా అంటాడు. ఏం చేసింది నువ్వు ముకుంద సంతోషంగా ఉండాలని కోరుకుంది అది తను చేసిన తప్పా అని రేవతి అడుగుతుంది. ఏది ఆ సంతోషం ఇదేనా? తను ఎప్పుడు మా సంతోషం గురించి ఆలోచించింది. తన సంతోషానికి ఉన్న అడ్డు తొలగించుకోవాలని చూసింది. తప్పు ఆదర్శ్ మిమ్మల్ని కలపడానికి కృష్ణ చాలా చేసిందని సుమలత వెనకేసుకొస్తుంది. ముకుంద చేసింది తప్పేనని మురారి కృష్ణని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను మురారి గురించి ఆలోచించింది. కానీ ఎంత ఆలోచించినా మురారి దక్కడని తెలిసి ఈ పిచ్చి పని చేసింది అందులో కృష్ణ చేసిన తప్పు ఏంటి? ముకుంద కోరుకుందని మురారిని వదులుకోవాలా? అని రేవతి అడుగుతుంది.
ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందేమోనని భయంతో ఇదంతా చేసింది. మా మీద ప్రేమతో మేము సంతోషంగా ఉంటే చూడాలనే ఉద్దేశంతో కాదు. ముకుంద నీ భర్తని ప్రేమించింది తనని మర్చిపోలేకపోతుంది, ఒకప్పుడు మురారి కూడా ప్రేమించాడు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ మళ్ళీ మురారి ముకుంద ప్రేమలో పడి నీకు దూరమవుతాడోననే భయంతో ముకుంద మారిందని నన్ను నమ్మించి తీసుకొచ్చి ఎలాగోలా మా ఇద్దరిని బయటకి పంపించి నువ్వు సంతోషంగా ఉండాలని అనుకున్నావ్. అంతేకానీ మేమిద్దరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో కాదని అరుస్తాడు లేదు ఆదర్శ్ నిజంగా ముకుంద మారిందని అనుకున్నాను నేను ఎందుకు అబద్ధం చెప్తానని అంటుంది. అబద్ధం చెప్పావ్ ముకుంద అడ్డు తొలగించుకోవడం కోసం అబద్ధం చెప్పావ్ దానితో ఆగకుండా తనని ఈ లోకంలోనే లేకుండా చేశావని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు.
తరువాయి భాగంలో..
మురారి ఇంటిని చూసుకుంటూ ఈ ఇంటి కోడలిగా లోపల ఉండాల్సిన నేను కాంపౌండ్ బయట ఉండాల్సి వచ్చిందని అనుకుటనుంది. మురారి ఇంటి బయట ఉన్న ముకుందని చూసి పరుగున వెళతాడు. అప్పుడే మురారిణి తప్పించుకుని పక్కగా వెళ్ళి నిలబడితే రేవతి నీళ్ళు పోస్తుంది. తన నుంచి తప్పించుకుని చీరల వెనక్కి వెళ్తే అక్కడికి కృష్ణ వచ్చి వాటిని తీస్తూ ఉంటుంది. ముకుంద ఎక్కడ కనపడుతుందోనని కంగారుగా ఉంటుంది. మురారి మాత్రం ముకుంద కోసం వెతుకుతూ ఉంటాడు.