Krishna mukunda murari march 14th: తన కూతురు చావుకి మీరే కారణమన్న శ్రీనివాస్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ముకుంద
Krishna mukunda murari serial march 14th episode: ముకుంద ఆత్మహత్య చేసుకుందని అందరూ నమ్మేస్తారు. శ్రీనివాస్ తన కూతురు చావుకు మురారి వాళ్ళే కారణమని నిందిస్తాడు. కానీ చివర్లో ముకుంద ట్విస్ట్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna mukunda murari serial march 14th episode: ముకుంద, మురారి ఫోటోస్ ని ఆదర్శ్ కాల్చేస్తాడు. రేవతి, మధు వచ్చి మంటలు చూసి కంగారుపడతారు. మంటలు ఆపమని రేవతి అంటే వద్దు అవి కాలిపోతేనే నా గుండెల్లో మంట చల్లారుతుందని అంటాడు. కాలిపోతున్న మంటల్లో మురారి నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. నన్ను ఏడిపించి వీళ్ళు నవ్వుతున్నారు, నన్ను చూస్ ఎగతాళి చేస్తున్నారణిం బాధపడతాడు. అక్కడ ఎవరూ లేరు అదంతా నీ భ్రమ అని రేవతి ఓదారుస్తుంది. అయిపోయింది నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎన్నో ఊహించుకుని ఎన్నో ఆశలు పెంచుకున్నా. మీ అందరూ కలిసి నా జీవితంతో ఆడుకున్నారని బాధపడతాడు.
కుప్పకూలిన రేవతి
ముకుంద ఇంటికి వచ్చిందేమోనని కృష్ణ వాళ్ళు అడుగుతారు. అయితే ముకుంద కనిపించలేదా? ఇక్కడ వీడు చూస్తే ఇలా ఉన్నాడని రేవతి ఏడుస్తుంది. బాధలో తాగుతున్నాడని మురారి అంటే తాగడం కాదు తగలబెట్టేస్తున్నాడు మేము వెళ్లకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని రేవతి ఏడుస్తూ చెప్తుంది. మధు కంగారుగా వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. అందులో 30 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుందని టీవీలో వార్త వస్తుంది. అది చూసి అందరూ కంగారుపడతారు. అది ముకుంద అని కంగారుపడి టీవీ పెట్టావా? ఇందాక మేము టీ తాగేటప్పుడు పక్కనే ఈ ప్రమాదం జరిగింది. తను ముకుంద అయ్యే ఛాన్స్ లేదని మురారి అంటాడు.
సుమారు 30 ఏళ్లు అంటే ముకుంద వయసు ఒకటే. అది చూసి అది మన ముకుందే జరిగిన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. మురారి అది ముకుంద కాదని ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. ఇంట్లో జరిగిన గొడవకు ఇలా అఘాయిత్యం చేసుకుందని రేవతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ముకుంద అని కన్ఫామ్ కాదు కదా అంతవరకు ఆదర్శ్ కి తెలియకుండా ఉంచడం మంచిదని కృష్ణ చెప్తుంటే మొత్తం ఆదర్శ్ వినేస్తాడు. నిజాలు దాచడం అలవాటు అయిపోయింది కదా నీకు, మనుషులని అబద్దాలలో ఉంచడం అలవాటు అయిపోయింది కదా అంటే మురారి అడ్డు పడతాడు. నువ్వు మాట్లాడకు మురారి నేనంటే నా భార్యకి ఇష్టం లేదని తెలిసి నా దగ్గర దాచి నన్ను ఒక వెర్రి బాగులోడిని చేశారు. ఇప్పుడు నా భార్య చనిపోయిందనే విషయం కూడా దాచాలని చూస్తున్నారా? అని నిలదీస్తాడు.
ముకుంద చనిపోయిందన్న శ్రీనివాస్
అది ముకుంద కాదేమో ఎందుకు కంగారుపడటమని కృష్ణ అంటుంది. ముకుంద అయితే ఏంటి పరిస్థితి? తన చావుకి కారణం నువ్వే అని ఒప్పుకుంటావా?నువ్వు చేసిన దారుణం గురించి మాట్లాడుతున్నా నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే. తను రాత్రే చెప్పింది జరిగిన దానికి కూడా కారణం నువ్వేనని చెప్పింది. ప్రాణాలు పోయే ముందు మొత్తం చెప్పి తను పోయింది. ప్రాణాలు పోయే ముందు ఎవరూ అబద్ధాలు చెప్పరు. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే. ఇది గొడవలు పడే సమయం కాదని హాస్పిటల్ కి వెళ్ళి ముకుంద కాదో కాన్ఫమ్ చేసుకోమని మధు అనేసరికి అందరూ వెళతారు. హాస్పిటల్ లో శ్రీనివాస్ దేవ్ కి ఫోన్ చేసి ముకుంద చనిపోయిందని చెప్తాడు.
రేవతి వాళ్ళు వచ్చి శ్రీనివాస్ ని ముకుంద గురించి అడుగుతారు. తను చనిపోయింది నా కూతురు ఇక లేదని అనేసరికి అందరూ షాక్ అవుతారు. మీరందరూ ఎందుకు వచ్చారు? నా కూతురు చనిపోయిందో లేదో కన్ఫామ్ చేసుకోవడానికి వచ్చారా? అని తిడతాడు. మొహం గుర్తు పట్టలేనంతగా అయిపోయింది అన్నారు కదా తను నిజంగా ముకుందేనా అంటుంది. తను నా కూతురే చనిపోయింది. మీరందరూ కలిసి తను ఆత్మహత్య చేసుకునేలా చేశారని అంటాడు. మీరు అలా అనొద్దు ముకుంద చనిపోయిందని మీరెంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నామని కృష్ణ అంటుంది. చేయాల్సింది అంతా చేసి మొసలి కన్నీళ్ళు కార్చవద్దు. నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే ఆ ఇంట్లో నీకు విలువ లేదు మా ఇంటికి వచ్చేయమని బతిమలాడాను వినలేదు.
ముకుంద చావుకి మీరే కారణమన్న శ్రీనివాస్
కన్నతండ్రిని పట్టించుకోకుండా మీ దగ్గరే ఉన్నందుకు మంచి బహుమతి ఇచ్చారని బాధగా అంటాడు. మేము ముకుందని ఎంత బాగా చూసుకున్నామో ఆ భగవంతుడికి తెలుసని కృష్ణ అంటుంది. అంత బాగా చూసుకుంటే నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. ఆదర్శ్ ని చూసి నువ్వు ఎందుకు వచ్చావ్ పెళ్ళిలో మూడు ముళ్ళు వేసిన తర్వాత వెళ్లిపోయావ్ కదా. నువ్వు రాకపోయి ఉంటే తను కోరుకున్న జీవితం దక్కలేదని ప్రాణాలతో ఉండేది. నువ్వు వచ్చి నీతో బతకలేక ప్రాణాలు వదిలేసుకుందని ఆదర్శ్ ని నిందిస్తాడు. ఆదర్శ్ ని ఏమి అనొద్దని మురారి అడుగుతాడు.
మరి నీదా తప్పు. ఖచ్చితంగా నీదే నువ్వు నా కూతురిని అర్థం చేసుకున్నా, నీ జీవితంలోకి ఈ కృష్ణ రాకపోయినా నా కూతురు సంతోషంగా ఉండేది. మీరందరూ కలిసి బలవంతంగా నా కూతుర్ని చంపేశారు. నా కూతురిది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్య ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపొండని అరుస్తాడు. ముకుందని చూడనివ్వమని అంటే ఏం చూస్తారు నా కూతురిని నేనే చూడలేని పరిస్థితిలో ఉంది. ముకుంద అంటే అందమైన మొహం గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు ఆ మోహమే గుర్తు పట్టలేనంతగా అయిపోయింది. అందరినీ వెళ్లిపొమ్మని గొడవ చేస్తాడు. దీంతో అందరూ వెళ్లిపోతారు. ఆదర్శ్ ముకుంద మాటలు తలుచుకుంటూ ఉంటాడు.
తన వల్లే ముకుంద చనిపోయిందని కృష్ణ కుమిలి కుమిలి ఏడుస్తుంది. అందరూ శోకసంద్రంలో మునిగిపోతారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చి లైట్ వేస్తాడు. ఎదురుగా ముకుందని చూసి షాక్ అవుతాడు.
తరువాయి భాగంలో..
ముకుంద ఉండి ఉంటే తన ఆలోచనలు మార్చి ఉండే వాళ్ళమని కృష్ణ అంటుండగా ఆదర్శ్ వస్తాడు. ముకుంద నీ భర్తని ప్రేమించింది, తనని మర్చిపోలేకపోయింది, ఒకప్పుడు మురారి కూడా ముకుందని ప్రేమించాడు, ముకుంద మారిందని నన్ను నమ్మించి ఎలాగోలా మా ఇద్దరిని బయటకి పంపించి నువ్వు మురారితో సంతోషంగా ఉండాలని అనుకున్నావని నోటికొచ్చినట్టు తిడతాడు నిజంగా ముకుంద మారిపోయిందని అనుకున్నాను నేను ఎందుకు అబద్ధం చెప్తానని కృష్ణ అంటుంది. ఆ అబద్ధంతో ఆగకుండా తను ఈ లోకంలో లేకుండా చేశావని ఆదర్శ్ నిందిస్తాడు.