Krishna mukunda murari december 15th: కృష్ణకి ముద్దు పెట్టిన మురారి.. ముకుంద అన్నయ్య చేసిన కుట్ర బయటపడుతుందా?-krishna mukunda murari december 15th murari kisses his wife krishna and she feels happy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari December 15th: కృష్ణకి ముద్దు పెట్టిన మురారి.. ముకుంద అన్నయ్య చేసిన కుట్ర బయటపడుతుందా?

Krishna mukunda murari december 15th: కృష్ణకి ముద్దు పెట్టిన మురారి.. ముకుంద అన్నయ్య చేసిన కుట్ర బయటపడుతుందా?

Gunti Soundarya HT Telugu

Krishna mukunda murari december 15th: మురారికి గతం గుర్తుకు వచ్చినా కూడా ముకుందతోనే తన పెళ్లి జరుగుతుందని భవానీ చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

కృష్ణకి ముద్దుపెట్టిన మురారి (disney plus hotstar)

Krishna mukunda murari december 15th: మురారికి గతం గుర్తుకు రావడంతో ముఖంగా ఆత్మహత్యాయత్నం చేస్తుంది. కృష్ణ తనకి ట్రీట్మెంట్ ఇస్తుంది. గౌతమ్ ప్రమాదం ఏమీ లేదని కాసేపటికి స్పృహ వస్తుందని చెప్తాడు. మురారి ముకుంద దగ్గరికి రాకుండా కింద హాల్లో ఉండగా నందిని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అంటుంది.

మీరందరూ ఉండి కూడ కృష్ణ అవుట్ హౌస్ లో ఉంటే ఏం చేస్తున్నారు? నేను వేణి గారు అని తన దగ్గరకి తిరుగుతుంటే నాకు నిజం చెప్పకుండా పిచ్చోడిని చూసినట్టు చూశారా అని సీరియస్ అవుతాడు. అమ్మ గురించి తెలిసిందే కదా తను తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడైనా ఎదురు చెప్పలేక చాలా బాధపడ్డాం కానీ మేమందరం కృష్ణకి ఎంత అండగా ఉన్నామో నీకు తెలియదని చెప్తుంది.

ముకుందని చూసి రేవతి కోపంగా ఉంటుంది. భవాని తనని గమనించి ఏంటని అడుగుతుంది. నా కొడుకు గతం గుర్తొచ్చిందని సంతోషించేలోపే ఈ పిల్ల ఇలా చేసింది అంటే ఈ పిల్లకి మురారికి గతం గుర్తుకు రావడం ఇష్టం లేదనే ఉద్దేశంతోనే ఇలా చేసిందని రేవతి తిడుతుంది. ఆ మాటకి భవానీ సీరియస్ అవుతూ తన జీవితం ఏమైపోతుందో అనే భయంతో తనువు చాలించాలనుకుందే తప్ప మురారికి గతం గుర్తుకు రాకూడదనే ఉద్దేశంతో కాదని ముకుందని వెనకేసుకొస్తుంది.

ముకుందతోనే పెళ్లి

ట్రీట్మెంట్ ఇవ్వడం అయిపోయింది కదా ఇంక వెళ్లిపొమ్మని కృష్ణకి చెప్తుంది. అసలు ఎందుకు ముకుంద ప్రాణాలు కాపాడావు? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని నీ జీవితాన్ని కాపాడుకోమని రేవతి కృష్ణకి సలహా ఇస్తుంది. తను ఒక డాక్టర్ గా స్పందించి ట్రీట్మెంట్ ఇచ్చానని చెప్తుంది. తనకి తన భర్త అండగా ఉన్నప్పుడు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదని ధీమగా చెప్తుంది.

భవానీ మురారి దగ్గరకి వచ్చి పెళ్లి శుభలేక ఇచ్చి శుక్రవారం నీకు ముకుందకి పెళ్లని చెప్తుంది. చూసావు కదా ఆ పిచ్చిది నీకోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఒకరి దురదృష్టంలో అదృష్టం వెతుక్కునే మనస్తత్వం కాదు నాదని ఉంటుంది. మురారి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఏంటి మాట్లాడవని అడుగుతుంది.

అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఎందుకు చెప్పలేదు?

ముకుంద నువ్వు ప్రేమించుకున్న విషయం వాస్తవమా కాదా ? మీ ప్రేమ నిజమైనదా కాదా అని నిలదీస్తుంది. ఆ ప్రేమని మన కుటుంబ గౌరవం కోసం వదిలేసుకున్నాను. తనకి నచ్చజెప్పి ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేశానని చెప్తాడు. నీ మాట విని పెళ్లి చేసుకుంది కానీ తన మనసులో నువ్వే ఉన్నావు అంటుంది. పెద్దమ్మ మీరు నాకు కృష్ణకి పెళ్లి అయ్యిందనే విషయం మర్చిపోయారా అని అడుగుతాడు.

అంత విచక్షణ లేకుండా ఏమి లేను. నాకు ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసుకుని వచ్చారు. అప్పుడే నువ్వు నాకు ముకుందతో ప్రేమ విషయం గురించి చెప్పి ఉండాల్సింది. మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా తర్వాత ఈ కృష్ణ మంచిగా ఉన్నట్టు నటించడం చూసి నిజమని నమ్మాను. కృష్ణ కోసం హాస్పిటల్ కూడా కట్టించాలని అనుకున్నాను. మీరు నన్ను మోసం చేసిన విషయం తర్వాత తెలిసింది. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది.

ప్రశ్నల వర్షం కురిపించిన భవానీ

అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్న విషయం నిజమే కానీ తర్వాత కృష్ణలో మంచితనం, చెప్పలేనంత ప్రేమ కనిపించింది. అది నన్ను కదిలించిందని అంటాడు. అంత కదిలిస్తే నాకు ఎందుకు చెప్పలేదు నేను కరిగిపోయి ఉండేదాన్ని కదా అంటుంది. మా అగ్రిమెంట్ మ్యారేజ్ ని నిజమైన పెళ్లి చేయాలని అనుకున్నాం ఈలోపే ఇలా జరిగిపోయిందని మురారి చెప్తాడు. భవానీ మాత్రం వాళ్ళ మాటలు నమ్మదు.

అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నేను అడిగినప్పుడు ఎందుకు మాట్లాడకుండా బయటకి వెళ్లిపోయావని కృష్ణని నిలదీస్తుంది. కానీ తను ఏం మాట్లాడకుండా ఉంటుంది. బయటకి వెళ్ళిన కృష్ణ విషయం తన చిన్నాన్నకి చెప్పింది మీ యాక్సిడెంట్ కి కారణం అయ్యిందని నిందిస్తుంది. తన బాబాయ్ అలా చేయలేదని ఒకవేళ చేయాలనుకుంటే నేను కూడా కారులోనే ఉన్నాను కదాని కృష్ణ సమర్థిస్తుంది. నైపుణ్యం ఉన్న లారీ డ్రైవర్ కదా నీకు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలేలా చేసి మురారికి మాత్రం రూపం మారిపోయేంత దెబ్బలు ఎలా తగిలాయని అడుగుతుంది.

భవానీతో ఛాలెంజ్ చేసిన మురారి

ఇది మాత్రమే కాదు ఎవరో అనాథ శవం తీసుకొచ్చి నీదని చెప్పారు. మాకు తెలియకుండా నిన్ను హాస్పిటల్ లో చేర్చి లక్షలు ఖర్చు పెట్టి రూపం మార్పించేశారని భవానీ చెప్తుంది. మురారి మాత్రం తనకి ట్రీట్మెంట్ చేయించింది వీళ్ళు కాదని తన మొహం కొద్దిగా చూశానని చెప్తాడు.

భవానీ మాత్రం మురారి చెప్పే మాటలు నమ్మదు. వచ్చే శుక్రవారం నీకు, ముకుందకి పెళ్లి జరిగితీరుతుందని అంటుంది. కృష్ణ చిన్నాన్న నిర్దోషి అని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అవునా సరే అయితే శుక్రవారం లోపు నిరూపించు అప్పుడు నేనే మీ ఇద్దరి పెళ్ళిని అంగీకరించి ఈ పెళ్ళిని ఆపేస్తానని చెప్తుంది.

కృష్ణకి ముద్దు పెట్టిన మురారి

అప్పటి వరకు కృష్ణ ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. కానీ మేమిద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉండమని మురారి కోరతాడు. దానికి సరేనని చెప్పడంతో కృష్ణ వెంటనే పెద్దత్తయ్య అని పిలిచేస్తుంది. తన బాబాయ్ తప్పకుండా నిర్దోషిగా బయటకి తీసుకొస్తాడని కృష్ణ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక కృష్ణ, మురారీ అవుట్ హౌస్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళూ దూరంగా ఉండి ఇప్పుడు కూడ దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదని మురారి అంటాడు. ఇచ్చిన మాట ప్రకారం భార్యాభర్తలుగా దూరంగానే ఉందామని కృష్ణ అంటుంది. అయితే ఒక ముద్దు పెట్టమని అడుగుతాడు. కృష్ణ సిగ్గుపడుతుంటే అటు ఇటూ ఎవరూ లేరని గమనించి మురారీనే తనకి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. దీంతో కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది.