Valari OTT: ఓటీటీలోకి సరికొత్త దెయ్యం మూవీ.. చాలా పాత ఆయుధాలతో మేకింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ritika singh sriram valari trailer released and valari ott streaming on etv win from march 6 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ritika Singh Sriram Valari Trailer Released And Valari Ott Streaming On Etv Win From March 6

Valari OTT: ఓటీటీలోకి సరికొత్త దెయ్యం మూవీ.. చాలా పాత ఆయుధాలతో మేకింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 01, 2024 02:05 PM IST

OTT Movie Valari Trailer Launch: హారర్ మూవీస్‌పై తెలుగు ప్రేక్షకులు ఎనలేని క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే వారికోసం అన్నట్లుగా సరికొత్త తెలుగు హారర్ మూవీ వళరి ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా వళరి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఓటీటీలోకి సరికొత్త దెయ్యం మూవీ వళరి.. చాలా పాత ఆయుధాలతో మేకింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త దెయ్యం మూవీ వళరి.. చాలా పాత ఆయుధాలతో మేకింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Valari OTT Streaming Date: హీరో శ్రీరామ్, గురు హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూనిక్ హారర్‌ మూవీ వ‌ళ‌రి. ఈ సినిమాకు ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించారు. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా వళరి మూవీ ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలతో వళరి ఆకట్టుకుంది. చేసిన హత్యలను కిల్లర్ మర్చిపోతే.. ఆ మరణించివారు కిల్లర్‌ను మర్చిపోతారా అంటూ సినిమాపై ఆసక్తి పెంచారు.

"వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి".. "ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?" "అది దెయ్యాల కొంప" అంటూ ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్‌తో మొదలైన వళరి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్‌లో హారర్ ఎలిమెంట్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. రితికా సింగ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేసింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా ఉంది. దర్శకురాలు మృతిక సంతోషిణి చాలా గ్రిప్పింగ్ నేరేషన్‌తో ఈ సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

కెమరాపనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. మొత్తానికి వళరి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ వళరి సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే వళరి ట్రైలర్ విడుదల చేశారు. ఈ వళరి ట్రైలర్ లాంచ్‌ వేడుకలో సినిమా గురించి హీరో శ్రీరామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

"దర్శకురాలు సంతోషిణి చాలా క్లారిటీగా ఈ సినిమా తీశారు. ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. రితికా సింగ్ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కోసం తను ఫైట్స్‌ని చాలా సహజసిద్ధంగా చేశారు. చాలా అంకిత భావంతో పని చేశారు. వ‌ళ‌రి మూవీలో చాలా పాత ఆయుధాలని వాడటం జరిగింది. ఈ కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మా ట్రైలర్‌ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మార్చి 6నఈటీవీ విన్‌లో అందరూ వళరి సినిమా చూడాలి" అని హీరో శ్రీరామ్ కోరారు.

"రితికా సింగ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో సినిమాకి బలం తీసుకొచ్చారు. శ్రీరామ్ గారితో పని చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. తమ్మిరాజు గారు నా సినిమాకి ఎడిటర్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయిబాబు గారికి ధన్యవాదాలు. 'వ‌ళ‌రి’ అనేది ఒక ఆయుధం. ఒక బూమరంగ్‌లా పని చేస్తుంది. మనం ఏం చేసిన కర్మ తిరిగి మన వద్దకే వస్తుంది. ఇందులో రితికా పాత్రకు 'వ‌ళ‌రి’అనేది యాప్ట్ టైటిల్" అని డైరెక్టర్ మృతిక సంతోషిణి పేర్కొన్నారు.

"చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వండర్ ఫుల్ జర్నీ. ఇది నా ఫేవరేట్ కథ. దర్శకురాలు సంతోషిణి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో తనకి చాలా మంచి పేరు వస్తుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. శ్రీరామ్ గారు, సుబ్బరాజు గారు, ఉత్తేజ్ గారు లాంటి నటులతో పని చేయడం గొప్ప అనుభవం. నిర్మాతలకు ధన్యవాదాలు. మా ట్రైలర్‌ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు" అని హీరోయిన్ రితికా సింగ్ తెలిపారు.

IPL_Entry_Point