తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 30th Episode Krishna Mukunda Murari Today Episode Krishna Gets Emotional

Krishna Mukunda Murari May 30th Episode: మురారి ప్రియురాలి గురించి కృష్ణ‌కు తెలిసిపోయిందా ? - ఏసీపీ డైరీలో ఏముంది?

HT Telugu Desk HT Telugu

30 May 2023, 9:28 IST

  • Krishna Mukunda Murari May 30th Episode: త‌న‌తో పెళ్లికి ముందు మ‌రో అమ్మాయితో మురారి ప్రేమ‌లో ఉన్నాడ‌నే నిజం అత‌డి డైరీ ద్వారా కృష్ణ‌కు తెలిసిపోతుంది. తొంద‌ర‌ప‌డి కృష్ణ‌ను ప్రేమించాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 30th Episode:మురారి డైరీ చ‌దివిన కృష్ణకు అత‌డి మ‌న‌సులో మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజం తెలిసిపోతుంది. జీవితాంతం మురారితోనే ఉండిపోవాల‌ని అనుకున్న త‌న‌ క‌ల‌లు తీర‌వ‌ని బాధ‌లో మునిగిపోతుంది. డైరీ చ‌దివిన త‌ర్వాత చాలా ముభావంగా క‌నిపిస్తుంది. ఏమైంద‌ని రేవ‌తి అడుగుతుంది. మురారి ఏమైనా అన్నాడా అని అంటుంది. కృష్ణ‌ను తానేమి అన‌లేద‌ని మురారి స‌మాధాన‌మిస్తాడు. నువ్వు డ‌ల్‌కు ఉంటే మాకు ఎవ‌రికీ న‌చ్చ‌దు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

నువ్వు ఎప్పుడూ లొడ‌లొడ మాట్లాడుతుంటేనే బాగుంటావ‌ని కృష్ణ‌తో రేవ‌తి అంటుంది. కానీ కృష్ణ మాత్రం స‌మాధాన‌మివ్వ‌దు. డైరీ గురించే ఆలోచిస్తుంటుంది.ఇంత‌లోనే గ‌దిలో ఉన్న నాప్‌కిన్స్ తెమ్మ‌ని కృష్ణ‌కు ప‌నిచేబుతుంది రేవ‌తి. కానీ ఆ ప‌ని తాను చేస్తాన‌ని అంటాడు మురారి. నీ పెళ్లానికి ఒక్క ప‌నికూడా చెప్ప‌కుడ‌దా అంటూ మురారిపై కోపాన్ని న‌టిస్తుంది రేవ‌తి. కావాల‌నే రేవ‌తి, మురారి గొడ‌వ‌ప‌డ‌తారు. వారి గొడ‌వ‌ను మ‌ధుక‌ర్ రీల్ చేస్తాన‌ని చెప్పి అంద‌రినీ న‌వ్విస్తాడు.

డైరీ చ‌దివిన కృష్ణ‌...

నాప్‌కిన్స్ తేవ‌డానికి తానే రూమ్‌కు వెళుతుంది కృష్ణ‌. మ‌రోసారి డైరీ చ‌ద‌వాల‌ని అనుకుంటుంది. మురారి ప్రేమించిన అమ్మాయి ఎవ‌రో తెలుసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. డైరీ చ‌ద‌వాలా? వ‌ద్దా? అనే సందిగ్ధంలో ఆమె మ‌న‌సు ఊగిస‌లాడుతుంది. చివ‌ర‌కు డైరీని చేతుల్లోకి తీసుకుంటుంది. జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటూ త‌న ప్రియురాలి గురించి మురారి డైరీలో రాసిన అక్ష‌రాల్ని చ‌దివి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. అందులో మురారి ప్రియురాలి పేరు మాత్రం ఉండ‌దు.

మురారిని అపార్థం చేసుకున్న కృష్ణ‌...

త‌మ పెళ్లి రోజు నుంచి మురారి డైరీ రాయ‌డం మానేశాడ‌నే నిజం ఆమెకు తెలుస్తుంది. ఇన్నాళ్లు నాన్న‌కు ఇచ్చిన మాట కోసం మురారి త‌న‌ను బాగా చూసుకున్నాడ‌ని అత‌డిని అపార్థం చేసుకుంటుంది. ఆమె మ‌న‌సులో ఇంకో అమ్మాయి తెలియ‌క తాను తొంద‌ర‌ప‌డి మ‌న‌సు ఇచ్చాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నాప్‌కిన్స్ తేవ‌డానికి రూమ్‌లోకి వెళ్లిన కృష్ణ చాలా స‌మయ‌మైనా తిరిగి రాక‌పోవ‌డంతో మురారి కంగారు ప‌డుతుంటాడు.

కృష్ణ ఆ డైరీ చ‌దివితే ముకుంద గురించి తెలిసిపోతుంద‌ని భ‌య‌ప‌డుతుంటాడు. క‌న్నీళ్ల‌కు దిగ‌మింగుకుంటూ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది కృష్ణ‌. ఆమెలోని డ‌ల్‌నెస్ చూసి డైరీ చ‌దివింద‌ని మురారి అనుకుంటాడు. తొంద‌ర‌గా చేతులు క‌డిగేసి త‌న రూమ్‌లోప‌లికి వెళ‌తాడు. కృష్ణ‌ను భోజ‌యం చేయ‌మ‌ని రేవ‌తి పిలుస్తుంది. కానీ త‌న‌కు ఆక‌లి లేద‌ని కృష్ణ అబ‌ద్దం చెబుతుంది.

వెలితిని పూడ్చ‌డానికే

త‌న రూమ్‌లోకి వెళ్లిన మురారి బెడ్ కింద దాచిపెట్టిన డైరీని చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ డైరీ చివ‌ర‌లో కృష్ణ గురించి రాసిన అక్ష‌రాలు చ‌దువుతుంటాడు. పూర్తిగా శూన్య‌మైపోయిన నా జీవితంలోని వెలితిని పూడ్చ‌డానికి కృష్ణ వ‌చ్చింద‌ని మ‌న‌సులోనే అనుకుంటాడు.

అగ్రిమెంట్ పూర్త‌యి కృష్ణ వెళ్లిపోతుంద‌ని తెలిసినా...ఆమె లేని జీవితం మ‌ళ్లీ ఈ ఖాళీ పేజీల్లాగే శూన్యంగా మారిపోతుంద‌నిరాసిన అక్ష‌రాలు చ‌దివి భ‌య‌ప‌డుతుంటాడు. రోజురోజుకు కృష్ణ మీద ఇష్టం పెరిగిపోతుంద‌ని తాను రాసిన అక్ష‌రాల్ని చూసి ఆలోచ‌న‌లో మునిగిపోతాడు. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.