తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari May 29th Episode: మురారి డైరీ సీక్రెట్స్‌ తెలుసుకున్న కృష్ణ - ఏసీపీకి కృష్ణ దూరం కానుందా?

Krishna Mukunda Murari May 29th Episode: మురారి డైరీ సీక్రెట్స్‌ తెలుసుకున్న కృష్ణ - ఏసీపీకి కృష్ణ దూరం కానుందా?

HT Telugu Desk HT Telugu

29 May 2023, 9:37 IST

  • Krishna Mukunda Murari May 29th Episode: ముకుంద‌తో ప్రేమ‌లోఉన్న‌ప్పుడు రాసిన డైరీ కృష్ణ కంట‌ప‌డ‌కుండా దాచేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు మురారి. అనుకోకుండా ఆ డైరీ కృష్ణ కంట ప‌డుతుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 29th Episode: ముకుంద‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు తాను రాసిన డైరీ కృష్ణ కంట‌ప‌డ‌కుండా దాచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు మురారి. ఎక్క‌డ దాయాలో తెలియ‌క కంగారు ప‌డుతోంటాడు. అత‌డి కంగారును కృష్ణ‌తో పాటు రేవ‌తి గ్ర‌హిస్తారు. డైరీ ష‌ర్ట్‌లో దాచేసి బ‌య‌ట‌ప‌డేయాల‌ని అనుకుంటాడు. నైట్ టైమ్‌లో బ‌య‌ట‌కు వెళ్తోండ‌గా మ‌ధుక‌ర్‌, శ్రీనివాస్ అత‌డి వెంట వ‌స్తాన‌ని అంటారు.

ట్రెండింగ్ వార్తలు

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

దాంతో త‌న ప్లాన్ మార్చిన మురారి తిరిగి రూమ్‌కు వ‌స్తాడు. రూమ్ డోర్ లాక్ చేసిన త‌న‌ బ‌ట్ట‌ల‌లో డైరీని దాచేస్తాడు. ఆ త‌ర్వాత వేరే ఎక్క‌డైనా ఆ డైరీని దాచిపెట్టాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఒక‌వేళ కృష్ణ త‌న‌ను ప్రేమిస్తే ఈ డైరీ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని ఆలోచిస్తుంటాడు. కృష్ణ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని నిశ్చ‌యించుకుంటాడు.

మురారి నాట‌కం...

మురారి కంగారు ప‌డ‌టానికి కార‌ణం ఏమిటోన‌ని కృష్ణ ఆలోచిస్తుంటాడు. నైట్‌టైమ్‌లో బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మైన అత‌డు త‌న నిర్ణ‌యాన్ని ఎందుకు మార్చుకున్నాడో అని అనుకుంటుంది. అత‌డు కంగారు ప‌డ‌టం వెనుక ఏదో పెద్ద కార‌ణం ఉంటుంద‌ని కృష్ణ అనుకుంటుంది. ఆ కారణం ఏమిటో క‌నిపెట్టాల‌ని డిసైడ్ అవుతుంది. భార్య‌తో క‌లిసి ఓ ఫ‌న్నీ రీల్ చేయ‌బోయి ఆమె చేతిలో చావు దెబ్బ‌లు తింటాడు మ‌ధుక‌ర్‌. మ‌రోవైపు మురారి కోసం కృష్ణ‌ పాలు తీసుకొని రూమ్‌లోకి వ‌చ్చేస‌రికి అత‌డు నిద్ర‌పోయిన‌ట్లు న‌టిస్తూ క‌నిపిస్తుంటాడు.

ఏసీపీ సార్ నాటకం…

మురారి నిద్ర‌పోయాడ‌నుకొని అత‌డి బ‌ట్ట‌లు స‌ర్ధ‌డం మొద‌లుపెడుతుంది కృష్ణ‌. అత‌డి డ్రెస్‌లు ఉన్న రాక్ ఓపెన్ చేస్తుంది. ఆ డైరీని అదే రాక్‌లో ఉండ‌టంతో అది ఎక్క‌డ కృష్ణ కంట ప‌డుతుందో అని మురారి కంగారు ప‌డ‌తాడు. ఇంత‌లోనే నిద్ర‌లో నుంచి లేచిన‌ట్లుగా నాట‌కం ఆడుతాడు.

క‌ల‌లో కూడా డ్యూటీ చేసిన‌ట్లు అనిపించింద‌ని, అందుకే నిద్ర‌లో నుంచి ఉలిక్కిప‌డి లేచాన‌ని అంటాడు. బ‌ట్ట‌లు తానే స‌ర్ధుకుంటాన‌ని, ఆమెను త‌న ద‌గ్గ‌ర నుంచి వెళ్ల‌మ‌ని కంగారుగా చెబుతాడు. కృష్ణ స్నానం చేయ‌డానికి బాత్‌రూమ్‌కు వెళుతుంది. ట‌వ‌ల్ మ‌ర్చిపోయి వెన‌క్కి రావ‌డంతో ఆమెను చూసి ఉలిక్కిప‌డ‌తాడు. అత‌డి ఎందుకు అలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో కృష్ణకు అర్థం కాదు. కృష్ణ బాత్‌రూమ్‌లోకి వెళ్ల‌గానే త‌న బ‌ట్ట‌ల్లో ఉన్న డైరీని తీసి బెడ్ కింద దాచేస్తాడు మురారి.

మురారి ర‌హ‌స్యం తెలుసుకున్న కృష్ణ‌...

త‌ర్వాత రోజు ఉద‌యం బెడ్ స‌ర్ధుతుంటుంది కృష్ణ‌. అనుకోకుండా ఆ డైరీ కృష్ణ కంట‌ప‌డుతుంది. ఆ డైరీ ఓపెన్ చేసి చ‌ద‌వ‌డం మొద‌లుపెడుతుంది కృష్ణ‌. ఆ డైరీలోని అక్ష‌రాలు చ‌దివి మురారి మ‌న‌సులో ఇంకో అమ్మాయి ఉంద‌నే నిజం కృష్ణ‌కు తెలుస్తుంది. ఆ డైరీ చ‌దువుతూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇంత‌లోనే కృష్ణ రూమ్‌లోకి వ‌స్తూ క‌నిపిస్తాడు.అత‌డిని చూసి గ‌బా గ‌బా ఆ డైరీ దాచేస్తుంది. కృష్ణ క‌న్నీళ్ల‌ను చూసి మురారి కంగారు ప‌డ‌తాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఓ ట‌వ‌ల్ ప‌డిపోతుంది. దానిని తీసుకోవ‌డానికి ఇద్ద‌రు ప్ర‌య‌త్నిస్తారు. ఎప్ప‌టికీ మీతోనే ఉండిపోవాల‌ని అనుకున్నాన‌ని, కానీ మీ మ‌న‌సులో ఇంకో అమ్మాయి ఉంద‌నే నిజం తెలిసిన త‌ర్వాత చిన్న ట‌వ‌ల్ కూడా అడ్డుగోడ‌గా మారింద‌ని మ‌న‌సులోనే బాధ‌ప‌డుతుంది కృష్ణ‌.

భర్తను దొంగ అన్న కృష్ణ‌...

క‌న్నీళ్ల‌తో మురారి ద‌గ్గ‌ర‌ నుంచి వెళ్లిపోతుంది కృష్ణ‌. ఆమె క‌న్నీళ్ల‌కు కార‌ణం ఏమిటో మురారికి అర్థం కాదు. జీవితంలో మొట్ట‌మొద‌ట‌సారి నా మ‌న‌సులో ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ‌కు ఆయుష్షు లేద‌ని ఏడుస్తుంటుంది కృష్ణ‌. వ‌ర్షంలో త‌డుస్తోన్న ఆమె ద‌గ్గ‌ర‌కు ఎమైంద‌ని అడుగుతూ మురారి వ‌స్తాడు అందుకు మీరు పోలీస్ కాదు పెద్ద దొంగ అని కృష్ణ అన‌డంతో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.