Krishna Mukunda Murari May 19th Episode: కృష్ణ‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన మురారి - ముకుంద‌తో మురారి ఛాలెంజ్‌-krishna mukunda murari may 19th episode murari love proposed to krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 19th Episode Murari Love Proposed To Krishna

Krishna Mukunda Murari May 19th Episode: కృష్ణ‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన మురారి - ముకుంద‌తో మురారి ఛాలెంజ్‌

HT Telugu Desk HT Telugu
May 19, 2023 09:23 AM IST

Krishna Mukunda Murari May 19th Episode: కృష్ణ‌కు రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇచ్చి ప్ర‌పోజ్ చేస్తాడు మురారి. అది చూసి ముకుంద క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ముకుంద‌, మురారి మ‌ధ్య ప్రేమ ఉంద‌న్న ర‌హ‌స్యం మ‌ధుక‌ర్‌కు తెలుస్తుంది.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 19th Episode: మురారి ఆఫీస్ ప‌నుల‌తో బిజీగా ఉంటాడు. దాంతో అత‌డికి తానే ద‌గ్గ‌రుండి టిఫిన్ తినిపిస్తుంది కృష్ణ‌. మురారిపై కృష్ణ చూపిస్తున్న అనురాగాన్ని మ‌ధుక‌ర్ వీడియో తీస్తాడు. అంతే కాకుండా కృష్ణ‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌మ‌ని మురారికి ఓ రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇస్తాడు. ఆ ల‌వ్ ప్ర‌పోజ్ వీడియోను రీల్ చేస్తాన‌ని అంటాడు.

కృష్ణ‌కు ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌ని మురారి డిసైడ్ అవుతాడు. మొకాళ్ల‌పై కూర్చొని ఎన్నాళ్లుగానో నీతో చెప్పాల‌ని అనుకుంటున్నా. కానీ నువ్వు కాదంటావ‌ని నా ప్రేమ‌ను మ‌న‌సులోనే దాచుకుంటూ వ‌స్తున్నా అని రోజ్ ఫ్ల‌వ‌ర్ కృష్ణ ఇచ్చి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తాడు.

ఎక్క‌డ న‌న్ను వ‌దిలిపెట్టి వెళ్లిపోతావో అని ఇన్నాళ్లు భ‌య‌ప‌డ్డాన‌ని, ఇప్పుడు కూడా చెప్ప‌క‌పోతే ఎప్ప‌టికీ ఈ మాట చెప్పే అవ‌కాశం రాద‌ని ఈ మాట చెబుతున్నా...ఐ ల‌వ్ యూ కృష్ణ అని త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. కృష్ణ కూడా ఐ ల‌వ్ యూ టూ ఏసీపీ సార్ అంటూ మురారికి తిరిగి ప్ర‌పోజ్ చేస్తుంది. కృష్ణ‌, మురారి ఒక‌రికొక‌రు ప్ర‌పోజ్ చేయ‌డం చూసిన ముకుంద క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

మందు కోసం తిప్ప‌లు...

భ‌వానీ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఇంట్లో అంద‌రూ స్వాతంత్రం వ‌చ్చిన‌ట్లుగా ఫీల‌వుతారు. మందు తాగేందుకు ప్ర‌సాద్‌, మ‌ధు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు భ‌వానీ దాచిన విస్కీ బాటిల్ కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. వారు మందు కోసం అల్లాడుతుంటే రేవ‌తితో పాటు ఇంట్లోని ఆడ‌వాళ్లంద‌రూ న‌వ్వుకుంటారు.

మురారిని ప్రేమిస్తున్నాన‌ని చెప్పిన ముకుంద‌...

త‌న బాస్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు మురారి. ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన ముకుంద ఫోన్‌ను లాక్కోని క‌ట్ చేస్తుంది. మ‌న ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎందుకు తీసేసావంటూ మురారిపై సీరియ‌స్ అవుతుంది. అంత‌టితో ఆగ‌కుండా మురారికి ఐ ల‌వ్ యూ చెబుతుంది. అనుకోకుండా అటువైపు వ‌చ్చిన మ‌ధుక‌ర్ వారి మాట‌లు విని షాక్ అవుతాడు.

మురారి మాత్రం నేను నిన్ను ల‌వ్ చేయ‌డం మానేశాను అని ముకుంద‌తో అంటాడు. కానీ నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాన‌ని ముకుంద బ‌దులిస్తుంది. నువ్వు న‌న్ను జీవితంలో సొంతం చేసుకోవాలేవ‌ని మురారి తిరిగి చెబుతాడు. నాతో స‌వాల్ చేస్తే ఎంత‌దూర‌మైన వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని ముకుంద..మురారికి ఛాలెంజ్ విసురుతుంది. నువ్వే అంత దూరం వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డితే నేను అంత‌కంటే దూరం వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని రివ‌ర్స్ ఛాలెంజ్ చేస్తాడు మురారి.

జీవితాంతం ఒంట‌రిగానే ఉంటాన‌ని చెప్పిన మురారి...

తాను మ‌రో పెళ్లంటూ చేసుకుంటే అది నిన్నే శ‌ప‌థం చేస్తుంది ముకుంద‌. కృష్ణ త‌న‌ను విడిచిపెట్టివెళ్లిపోయినా తాను ఒంట‌రిగానే బ‌తుకుతాన‌ని కానీ నిన్ను మాత్రం పెళ్లిచేసుకోన‌ని మురారి అంటాడు. కృష్ణ వెళ్లే వ‌ర‌కు ఆగి మ‌న ప్రేమ విష‌యం మొత్తం బ‌య‌ట‌పెడ‌తాన‌ని భ‌య‌పెడుతుంది.

నిజం నీకు నువ్వే చెబితే నాకు సాయం చేసిన దానికి అవుతావు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ మురారి కూడా తెగిస్తాడు. ముకుంద మాట‌ల‌కు మురారి అస‌లు భ‌య‌ప‌డ‌డు. ఇన్నాళ్లు మురారి, ముకుంద‌ల‌పై డౌట్ ఉన్న మ‌ధుక‌ర్‌కు వారి మాట‌ల‌తో ఫుల్ క్లారిటీ వ‌స్తుంది. ఆ విష‌యాన్ని రేవ‌తితో చెప్పి అక్క‌డికి తీసుకొస్తాడు. మ‌ధుక‌ర్ ద్వారా వారి ప్రేమ విష‌యం అంద‌రికీ తెలిసిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ప‌సిగ‌ట్టిన రేవ‌తి ఈ విష‌యాన్ని ఎవ‌రికి చెప్ప‌ద్ద‌ని అత‌డికి వార్నింగ్ ఇస్తుంది.

మురారికి కృష్ణ స‌ర్‌ప్రైజ్‌

ముకుంద తో చేసిన‌ ఛాలెంజ్ గురించి మురారి ఆలోచ‌న‌లో మునిగిపోతాడు. ఇంత‌లోనే అత‌డి క‌ళ్ల‌ను వెన‌క‌నుండి మూసి దాగుడుమూత‌లు ఆడుతుంది కృష్ణ‌. ఒక అద్భుత‌మైన సౌంద‌ర్యాన్ని చూపిస్తాన‌ని అంటుంది. అత‌డిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళుతుంది. రూమ్‌ను ఇద్ద‌రి ఫొటోల‌తో అందంగా అలంక‌రిస్తుంది. అవి చూసి మురారి ఆనందంలో మునిగిపోతాడు.

IPL_Entry_Point