Krishna Mukunda Murari Today Episode : మురారి జీవితం నుంచి కృష్ణ వెళ్లిపోతుందా?-krishna mukunda murari today episode krishna mukunda murari serial may 27th episode mukunda in distress ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Today Episode Krishna Mukunda Murari Serial May 27th Episode Mukunda In Distress

Krishna Mukunda Murari Today Episode : మురారి జీవితం నుంచి కృష్ణ వెళ్లిపోతుందా?

HT Telugu Desk HT Telugu
May 27, 2023 10:39 AM IST

Krishna Mukunda Murari Today May 27th Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజురోజుకు ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. మురారీని కృష్ణ ప్రేమించడంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

ముకుంద తన మనసులో ఉన్న ప్రేమను చెప్పకనే చెబుతుంది. నేరుగా చెప్పకుండా ఇండైరైక్ట్ గా చెబుతుంది. కానీ మురారి ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. మరోవైపు కృష్ణ, మురారి మీద తీసిన వీడియోను మధుకర్ ఇంట్లో టీవీలో వేస్తాడు. అది చూసి కృష్ణ ఎమోషనల్ కాగా.. ముకుంద బాధపడిపోతూ ఉంటుంది. నా మనసులోని ప్రేమను మురారికి చెప్పాలని అనుకున్నా.. కానీ ఇలా జరుగుతుందేంటి అని ముకుంద ఆలోచనల్లో పడుతుంది.

తన భావాలను కృష్ణ ఇంత అందంగా ప్రేమగా చెబుతుందేంటని అర్థంకాని పరిస్థితిలో ఉంటుంది ముకుంద. ఇలాంటి ఊహించని పరిస్థితులలో ఏం చేయలో తోచదు. కృష్ణ మనసులోని ప్రేమను బయటపెట్టే రోజు వస్తుందని అనుకోలేదని.. మనసులో అనుకుంటాడు మురారి. మధుకర్ కు థ్యాంక్స్ చెప్పుకుంటాడు. సమయం వచ్చింది గనుక మీ మీద నాకు ఉన్న ఫీలింగ్స్ బయటపడ్డాయి. ఇది మీకు అర్థం అవుతుందో లేదోనని కృష్ణ అనుకుంటుంది. సందర్భాన్ని ఉపయోగించుకుని.. కృష్ణ తన మనసులో భావాన్ని చెప్పేసినట్టుగా ఉంది.. తన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కృష్ణ మురారి ప్రేమలో పడిపోయిందా అని భయంలో ఉంటుంది ముకుంద.

ఆ వీడియోను చూసిన అందరూ చాలా బాగ చేశారని మెచ్చుకుంటారు. తన మనసులోని మాటలు అంత బాగా చెప్పినా.. ఆయనలో ఎలాంటి స్పందన లేదని కృష్ణ బాధపడుతుంది. తాను వెళ్లిపోతానని అనుకుంటున్నారా? అని ఆలోచనలో పడుతుంది. ఇదే సమయంలో ముకుంద వచ్చి.. ప్రేమ గురించి బాగా చెప్పావని అంటుంది. ఆ స్క్రిప్ట్ మధుకర్ రాశాడంటే.. నమ్మకంగా లేదని లేనిపోని విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. మురారికి గనక లవర్ ఉంటే.. ఎలా చెప్పెదో అలా చెప్పావని అంటుంది.

కొన్ని రోజుల తర్వాత వెళ్లిపోయే మనిషికి ఈ ఎమోషన్స్ ఏంటి? కృష్ణ మురారితో ప్రేమలో పడిందా? అని ఆలోచిస్తుంది ముకుంద. ఇక కలిసి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మరో కాన్సెప్ట్ చెప్తాడు మధుకర్. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. అబ్బాయికి డైరీ రాసే అలవాటు ఉంది.., తన ప్రేమ గురించి అందులో రాస్తాడు. భార్య ఆ డైరీ చూసి.. వేరే వాళ్లది చదవడం ఎందుకని అల్మారాలో పెట్టేందుకు రెడీ అవుతుంటే.. అక్షరాలు ప్రేయసి గురించి ఉంటాయి. ఇది చూసి భార్య షాక్ అవుతుందని మధుకర్ చెబుతూ ఉండగా.. మురారి, ముకుంద ముఖాలు చూసుకుంటారు.

ఈ విషయాన్ని రేవతి గమనిస్తూనే ఉంటుంది. కంగారుగా మురారి వెంటనే గదిలోకి వెళ్తాడు. ఎందుకింత కంగారుగా వెళ్తున్నాడని కృష్ణ ఆలోచిస్తుంది. ముకుంద ప్రేమలో ఉన్నప్పుడు రాసిన డైరీని తీస్తాడు మురారి. ఇది గనక కృష్ణ చూస్తే.. తనకు దూరమైపోతుందని దాచి పెడతాడు. బయటకు తీసుకెళ్లి.. కాల్చేయాలని అనుకుంటాడు. అందరూ హాలులో ఉంటారు. ఈ సమయంలో ఎక్కడకు వెళ్తున్నావని రేవతి ప్రశ్నిస్తుంది. చిన్న పని ఉందని మురారి టెన్షన్ పడుతాడు. కానీ ఆ డైరీ కష్ణ చూస్తుంది. అందులో రాసి ఉన్నది కూడా చదువుతుంది. దీంతో ఈరోడు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point