Karthika deepam september 13th episode: దీపను సపోర్ట్ చేస్తూ జ్యోత్స్న గాలి తీసేసిన కాంచన- స్వప్న కోడలిగా ఒకేనన్న దాసు
13 September 2024, 7:20 IST
- Karthika deepam 2 serial today september 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఎందుకు జ్యోత్స్న ఇంట్లో పనికి సాయంగా ఉంటుందని పారిజాతం అంటుంది. తనకు స్టవ్ వెలిగించడమే రాదు ఇంక వంట ఏం చేస్తుందని పని తెలిసిన దీప ఉండాలని కాంచన అంటుంది.
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్
Karthika deepam 2 serial today september 13th episode: కార్తీక్ దగ్గరకు ఎందుకు వచ్చావని దీపను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. సాయం చేయడానికి ఒక మనిషిగా వచ్చానని దీప చెప్తుంది. ఏంటి నువ్వు చేసే సాయమని పారిజాతం అంటుంది. ఒంట్లో మనిషికి బాగోకపోతే ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చానని చెప్తుంది. కాబోయే కోడలిగా జ్యోత్స్న ఆ మాత్రం ఇంటి పనులు చేయలేదా ఏంటని అంటుంది.
దీప వచ్చి నా బాధ తీర్చింది
అన్నీ పనులు జ్యోత్స్న చేస్తుంది దీపను ఇంటికి పంపించేయమని పారిజాతం కాంచనకు చెప్తుంది. మంచి మాట అన్నారని శ్రీధర్ సపోర్ట్ చేస్తాడు. నా మేనకోడలికి వంట వచ్చా? కనీసం కాఫీ పెట్టడమైన వచ్చా? దీనికి స్టవ్ వెలిగించడం కూడా రాదు. నిజానికి దీప వచ్చి నా బాధ తీర్చింది.
ఇంతకముందు డాక్టర్ ఫుడ్ విషయంలో జాగ్రత్త చెప్పారు. నా వల్ల కాదు ఇలాంటి టైమ్ లో మన అనుకున్న మనిషి సాయంగా ఉండాలని అంటుంది. జ్యోత్స్నకు సాయంగా నేను ఉంటానులే అని పారిజాతం అనేసరికి సరే కాఫీ పెట్టి బాత్ రూమ్ లో చీరలు ఉన్నాయి ఉతికి ఆరేయమని చెప్తుంది.
పారిజాతం బిత్తరపోతుంది. కాంచన బాగా గట్టిగా ఇస్తుంది. కార్తీక్ కి ఇప్పుడు రెస్ట్ అవసరం. వాడి చుట్టూ చేతులతో పని చేసే వాళ్ళు ఉండాలి నోటితో పని చేసే వాళ్ళు కాదని అంటుంది. శౌర్య కార్తీక్ కి ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది.
పారిజాతానికి షాకిచ్చిన కాంచన
జ్యోత్స్న గదికి వచ్చేసరికి కార్తీక్ శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో దీప ఉంది, ఫోన్లో కూతురు ఉంది. మరి నేను ఎక్కడ ఉండాలని జ్యోత్స్న తిట్టుకుంటుంది. తనను చూడటానికి అమ్మతో పాటు ఎందుకు రాలేదని అడుగుతాడు. అమ్మ నాకు చెప్పలేదని అంటుంది.
అమ్మకు ఫోన్ ఇవ్వమని శౌర్య అంటే కార్తీక్ జ్యోత్స్నకు చెప్తాడు. దీపను పిలవమని అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకుని పిలుస్తానని వెళ్తుంది. శ్రీధర్ ఆఫీసుకి వెళ్తున్నానని అంటే పర్లేదు దీప తోడుగా ఉందని అంటుంది. పారిజాతం కాంచన కాపురం గురించి అడిగితే రివర్స్ లో నాన్న మిమ్మల్ని ఏదో అన్నారట కదా అనేసరికి దెబ్బకు నోరు మూస్తుంది.
దీప, కార్తీక్ మాట్లాడుకోవడం చూసి జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాశీ తన ప్రేమ గురించి దాసుకు చెప్తాడు. స్వప్న అనే అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి కాబోయే మహాలక్ష్మి వచ్చిందని దాసు సంతోషంగా స్వప్న దగ్గరకు వస్తాడు.
స్వప్న, కాశీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్
కాశీ, స్వప్న పెళ్ళికి దాసు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. మీ పెళ్ళికి ఏ అభ్యంతరం లేదని అంటాడు. ఇంట్లో చెప్పారా అంటే లేదు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో లేరని స్వప్న చెప్తుంది. మీరే ఒప్పించుకోండి అలా ఒప్పుకుంటేనే మీ పెళ్లి జరుగుతుందని అంటాడు. కాశీ నా కోడలు నాకు బాగా నచ్చింది.
వీళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒకే అంటే చెప్పు వెళ్ళి మాట్లాడదామని చెప్తాడు. ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారని స్వప్న, కాశీ అనుకుంటారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. దీపను కావాలని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావని పారిజాతం జ్యోత్స్నను తిడుతుంది.
ఎవరినీ ఇంటికి రావొద్దని అన్నాడు దీపను మాత్రం రానిచ్చాడు. దీప రావడానికే మనల్ని రావొద్దు అన్నారు. మళ్ళీ జ్యోత్స్న మనసులో రకరకాల అనుమానాలు వేస్తుంది. మీ బావకు దగ్గరగా ఉండు. దీప వస్తే మనం వెళ్ళడం కాదు మనం ఉంటే దీప వెళ్లిపోవాలి.
నరసింహకు డబ్బులిచ్చిన జ్యోత్స్న
నువ్వు ఎవరో గుర్తు పెట్టుకో. మూడు ముల్లు పడితే అసలైన వారసురాలు వచ్చినా ఏం జరగదని అంటుంది. పారిజాతం వెళ్లిపోగానే నరసింహ జ్యోత్స్న దగ్గరకు వస్తాడు. నీ మాజీ భార్యను పొడుస్తానని చెప్పి మా బావను పొడుస్తావా అని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది.
నన్ను పోలీసులు పట్టుకుంటే మీరు ఇరుక్కుంటారని అంటాడు. నువ్వు చేసిన పనికి మా పెళ్లి ఆగిపోయిందని అంటుంది. నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, వాళ్ళకు దొరికే లోపు అనుకున్నది చేసేయ్. ఈసారి ఎవరు అడ్డురారని చెప్తుంది. ఖర్చులకు డబ్బులు ఇవ్వమని అడిగితే ఇస్తాడు.
ఈసారి నువ్వు మిస్ అయితే నేనే నిన్ను పొడిచేస్తానని అంటుంది. దీప కార్తీక్ కోసం ప్రత్యేకంగా వంటలు చేసి తీసుకొస్తుంది. దీపను మన రెస్టారెంట్ లో చెఫ్ గా తీసుకుందామని అనుకుంటున్నట్టు కార్తీక్ అంటాడు. కానీ దీప మాత్రం ఒప్పుకోదు. మీ రెస్టారెంట్ లో పని చేస్తున్నానని తెలిస్తే నరసింహ అసలు ఊరుకొడు. ఇప్పటికే జరిగిన దానికి చాలా బాధగా ఉందని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్