తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Jr NTR: తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

29 October 2024, 15:15 IST

google News
  • Jr NTR About His Bank Balance Video Viral: జూనియర్ ఎన్టీఆర్ తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బుందో చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతోపాటు నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్
తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Jr NTR About His Bank Balance Video Viral: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నిను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చుకున్నాడు.

త్రిపాత్రాభినయంతో

స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలతో నటనలో తాతకు తగ్గ మనవడిగా ప్రశంసలు అందుకున్నాడు. సినీ కెరీర్‌లో ఎన్నో హిట్స్ చూసిన ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతోనే కాదు త్రిపాత్రాభినయంతో సైతం ప్రేక్షకులను మెప్పిస్తే ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇటీవల దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మరో హిట్ అందుకున్నాడు. టాక్ పరంగా దేవర ఎలా ఉన్న బాక్సాఫీస్ వద్ద లాభాలు గడించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమానే కాకుండా బాలీవుడ్‌లో వార్ 2 మూవీతో విలన్‌గా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు తారక్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.

ఇతర స్లాంగ్స్‌తో హైలెట్

అయితే, ఎన్టీఆర్ ఒక్క నటనలోనే కాకుండా ఇతర భాషలను చాలా స్పష్టంగా మాట్లాడగల టాలెంట్ ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ఇతర స్లాంగ్‌లో మాట్లాడిన వీడియోలు నెట్టింట్లో తెగ గింగిరాలు తిరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వాటిపై మీమ్స్ కూడా కుప్పులు తెప్పలుగా వచ్చాయి. మీమ్స్ లాంగ్వెజ్‌ను కూడా వాడి ఇంటర్వ్యూల్లో అట్రాక్షన్‌గా నిలిచాడు తారక్.

ఇవే కాకుండా బుల్లితెరపై హోస్ట్‌గా కూడా తన బెస్ట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. 2017లో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా హోస్ట్ బాధ్యతలు చేపట్టిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్. 2017 జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 1 సీజన్‌కు ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్‌ను ఎవరు అంతా ఈజీగా మర్చిపోలేరు.

బిగ్ బాస్ హోస్ట్‌గా ఎన్టీఆర్

ప్రస్తుత బిగ్ బాస్ తెలుగు 8 హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ హోస్ట్ నేచురల్ స్టార్ నాని కంటే బెటర్ హోస్ట్ ఎన్టీఆర్ అనే చాలా మంది అభిప్రాయం. ఇక ఈ షోలో వ్యాఖ్యతగా ఎన్టీఆర్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఒక సమయంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో సరదాగా మాట్లాడిన తారక్ వారు చేసిన వంట సైతం రుచి చూశాడు.

ఈ క్రమంలోనే తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మనీ ఉందో సరదాగా చెప్పాడు ఎన్టీఆర్. ఆళ్లేదో తినమంటున్నారు. "బ్యాంక్‌లో నా బ్యాలెన్స్ రెండు రూపాయల 30 పైసలు ఉంది. అది మా ఆవిడకు ఇవ్వండి" అని చిరంజీవి ‘చంటబ్బాయ్’ మూవీలోని డైలాగ్‌ను చెప్పాడు. ఫుడ్ తిన్న తర్వాత కూడా అదే సినిమాలోని సీన్‌ను రీ క్రియేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పాడు ఎన్టీఆర్.

కూతురు రుద్రమదేవి

"ఎవరక్కడ.. నా ఏనుగును ఇక్కడకు తీసుకురండి. మేము ఆ రిక్షామీది ఏనుగునెక్కి టిప్పు సుల్తాన్ గారితో యుద్ధానికి వెళ్లాలి. మా కొడుకు ఔరంగజేబు, కూతురు రాణి రుద్రమదేవి ఎక్కడున్నారు. బహుశ రింగ రింగ రోజెస్ ఆడుకోడానికి వెళ్లుంటారు" అని ఎన్టీఆర్ చాలా ఫన్ క్రియేట్ చేశాడు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ఆ కామెంట్స్, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 నడుస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 1 సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ను పొగుడుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్స్. "తారక్ కామెడీని ఉపయోగించుకుని ఒక రోమ్-కామ్ తీయండయ్యా ఎవరైనా" అని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. అలా ఎన్టీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతనేది ఫన్నీగా చెప్పాడు యంగ్ టైగర్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం