Nude Scene In NTR Movie: ఒక్క న్యూడ్ సీన్ కోసం మూడేళ్లు కోర్టు చుట్టు తిరిగిన సీనియర్ ఎన్టీఆర్
Senior NTR Sri Madvirat Veerabrahmendra Swamy Charitra: ఒక్క న్యూడ్ సీన్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు కోర్టు పర్మిషన్ కోసం సీనియర్ ఎన్టీఆర్ తిరిగారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది.శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మూవీలో ఓ న్యూడ్ సీన్ కోసం ఎన్టీఆర్ పోరాడినట్లు తెలుస్తోంది.
Senior NTR Fight With Court For Nude Scene: నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) నటనా కౌశల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పౌరాణిక ఇతిహాసాల నుంచి లవ్ స్టోరీల వరకు ఎన్నో విభిన్నపాత్రల్లో నటించి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్.
వివాదాలు, చిక్కులు
కృష్ణుడిగా, రాముడిగా, కర్ణుడిగా, ధుర్యోదనుడిగా విలక్షణమైన ఇతిహాస పాత్రల్లో ఒదిగిపోయిన సీనియర్ ఎన్టీఆర్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాలు సైతం చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే, ఎప్పుడు విభిన్న ప్రయోగాలు చేసిన సీనియర్ ఎన్టీఆర్ పలు వివాదాలు, చిక్కులు సైతం ఎదుర్కొన్నారు.
తాతమ్మ కల సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని 50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్‌కు గురైంది. తర్వాత కొన్ని మార్పులతో ఆ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేశారు. ఇక, ఓ న్యూడ్ సీన్ కోసం ఏకంగా మూడేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగారట సీనియర్ ఎన్టీఆర్.
నాలుగు పాత్రల్లో ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమాల్లో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒకటి. 1984లో విడుదలైన ఈ సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో గౌతమ బుద్ధుడు, వేమన, రామానుజులు, ఆదిశంకరుల పాత్రలను పోషించారు సీనియర్ ఎన్టీఆర్.
అంతేకాకుండా ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఓ పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ 1981 నాటికి పూర్తయింది. కానీ, కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ కోరింది. దానికి అంగీకరించని సీనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్‌ను కోట్లు మెట్లు ఎక్కేలా చేసింది అందులోని న్యూడ్ సీన్.
న్యూడ్ సీన్ ఎడిట్ చేయాల్సిందిగా
సినిమాలోని యోగి వేమన క్యారెక్టర్ తన వదినను నగ్నంగా చూసే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్‌ను ఎడిట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ కోరింది. అయితే, యోగి వేమన.. అలా యోగి వేమనగా ఎలా మారడు అనేదానికి ఆ సీనే ప్రధాన కారణమని, తనేం శృంగారం కోసం, డబ్బుల కోసం పెట్టలేదని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారట. అయినా సెన్సార్ బోర్డ్ వినకపోవడంతో.. బోర్డ్‌పై కేసు వేసి కోర్టుకెక్కారు ఎన్టీఆర్.
అలా మూడేళ్లు రిలీజ్ ఆపి సెన్సార్ బోర్డ్‌పై గెలిచి వంద ప్రింట్లతో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మూవీని విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సీనియర్ ఎన్టీఆర్. అయితే, రూ. 30 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ముందుగా 15 ప్రింట్లతో రిలీజ్ చేసి, హిట్ అయితే ప్రింట్స్ పెంచుదామని అనుకున్నారట ఎన్టీఆర్.
రూ. 6.6 కోట్ల కలెక్షన్స్
కానీ, సెన్సార్ బోర్డ్ కారణంగా రిలీజ్ మూడేళ్లు ఆలస్యం కావడంతో అప్పుడున్న బిజినెస్‌ను బట్టి వంద ప్రింట్లతో సినిమాను రిలీజ్ చేశారట సీనియర్ ఎన్టీఆర్. కాగా ఈ సినిమాలో కమర్షియల్ డైలాగ్స్, సాంగ్స్, మాస్ డైలాగ్స్ ఉండకుండా పూర్తి డివోషనల్‌గానే ఉంటుంది. అయినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రూ. 6.6 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.