Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్.. కొంపముంచిన కమ్యూనిటీ చర్చ.. 3 వారాల్లో ఎంత సంపాదించాడంటే?
Bigg Boss Telugu 8 Mehaboob Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది. మరి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌజ్‌లో 3 వారాల పాటు ఉన్నాడు. కాబట్టి, 21 రోజుల్లో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా మెహబూబ్ ఎంత సంపాదించాడనే లెక్కల్లోకి వెళితే!

Bigg Boss 8 Telugu Mehaboob Dil Se Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి మరో వికెట్ పడిపోయింది. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు ఎనిమిదో వారం మరొకరు ఎలిమినేట్ అయి ఇంటికి చేరినట్లు సమాచారం అందింది. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ ఇవాళ (అక్టోబర్ 27) ప్రసారం చేయనున్నారు.
నామినేషన్స్‌లో ఆరుగురు
కానీ, బిగ్ బాస్ 8 తెలుగు 8వ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ శనివారం (అక్టోబర్ 26) నాడే పూర్తి అయిపోయింది. దాంతో ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే.
దాంతో బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. వీరిలో నామినేషన్స్ పూర్తయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్‌లో ఉంటూ కొనసాగింది. అత్యధిక ఓట్లతో ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో ఉంటే నిఖిల్ రెండో స్థానం, విష్ణుప్రియ మూడో ప్లేసులో నిలిచింది.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
ఇక నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటే.. ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న మెహబూబ్, నయని స్థానాలు మారుతూ వచ్చాయి. ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని కొన్ని వర్గాలు అంటే.. మరికొంతమంది నయని పావని ఎలిమినేట్ అయిందని టాక్ నడిచింది.
కానీ, ఈ కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ శనివారం రాత్రి షూటింగ్ పూర్తి అయిన తర్వాత మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి సమచారం అందింది. బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఎలిమినేన్ ప్రక్రియ మెహబూబ్, నయని మధ్య పడింది. అతి తక్కువ ఓటింగ్ కారణంగా బిగ్ బాస్ 8 తెలుగు 8వ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు.
కమ్యూనిటీపై చర్చ
అయితే, అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌజ్‌లోకి వచ్చిన రెండు రోజులకు నబీల్‌తో కమ్యూనటీపై చర్చ పెట్టాడు. తమ కమ్యూనిటీ వాళ్లంతా వారిద్దరికే ఓట్లు వేస్తారు అని, ఇద్దరిలో ఏ ఒక్కరు నామినేషన్స్‌లో ఉన్న ఓట్లు గుద్దుతారని, ఇద్దరు నామినేట్ కాకుండా చూసుకోవాలని మెహబూబ్ చెప్పాడు. దానికి ఉ.. ఉ.. అంటూ తలూపాడు నబీల్ అఫ్రిది.
అయితే, ఇది సెన్సిటివిటీ విషయం కావడంతో వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున స్ట్రాంగ్‌గా అడగకుండా, పేర్లు తీయకుండా ఎలాంటి సెన్సిబుల్ విషయాలపై మాట్లాడకూడదని నైస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రైమ్ టైమ్ అయిన రాత్రి తొమ్మిది గంటల సమయంలో కమ్యునిటీపై ఎలాంటి చర్చ పెట్టిన పలు వివాదాలకు దారి తీస్తుందని అలా చెప్పిచెప్పినట్లు నాగార్జునతో వార్నింగ్ ఇప్పించారు బీబీ టీమ్ అండ్ స్టార్ మా.
3 వారాల రెమ్యునరేషన్
కానీ, మెహబూబ్, నబీల్ మాట్లాడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో మెహబూబ్‌పై తీవ్రమైన నెగెటివిటీ ఎర్పడింది. అందుకే ఆ తర్వాతి వారమే నామినేషన్స్‌లోకి వచ్చిన మెహబూబ్‌కు ఓట్లు పడలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ 3 వారాల (21 రోజుల) పాటు గేమ్స్ ఆడాడు.
బిగ్ బాస్ తెలుగు 8 కోసం మెహబూబ్ దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42,857 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.
టాపిక్