Vishwambhara Teaser: చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్.. దసరాకు మెగా ట్రీట్.. అవతార్, హనుమాన్ టైపులో సీన్స్!-chiranjeevi vishwambhara movie teaser released on the occasion of dussehra 2025 megastar entry on white horse ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara Teaser: చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్.. దసరాకు మెగా ట్రీట్.. అవతార్, హనుమాన్ టైపులో సీన్స్!

Vishwambhara Teaser: చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్.. దసరాకు మెగా ట్రీట్.. అవతార్, హనుమాన్ టైపులో సీన్స్!

Sanjiv Kumar HT Telugu

Chiranjeevi Vishwambhara Teaser Released: మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దసరా పండుగ కానుకగా మెగా అభిమానులకు మెగా ట్రీట్ అందించారు. విశ్వంభర టీజర్‌లో చిరంజీవి యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అలాగే, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది.

చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్.. దసరాకు మెగా ట్రీట్.. అవతార్, హనుమాన్ టైపులో సీన్స్!

Chiranjeevi Vishwambhara Teaser Released: మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ సినిమా విశ్వంభర కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, సంక్రాంతికి వస్తుందనుకున్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ మారిపోయింది. దీన్ని భర్తీ చేసేందుకు మెగా అభిమానులకు మెగా ట్రీట్ అందించారు.

చేపలాగ ఉన్న పక్షులు

దసరా పండుగ కానుకగా విశ్వంభర మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఒక విశ్వాన్ని చూపించి.. చేపలాగా ఉన్న పక్షకులు గాల్లో ఎగరడం చూపించారు. ఇతర జంతువులను చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. విజువల్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ చాలా వరకు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

కాలమే సమాధానం ఇస్తుంది

"విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి.. విస్తరిస్తున్నంత మాత్రానా వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది, విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది" అని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. "మిత్ర యుద్ధం వస్తుందని అన్నావ్‌గా. ఆ యుద్ధం ఎలా ఉంటుంది" అని ఓ పాప చెప్పే డైలాగ్‌తో చిరంజీవి ఎంట్రీ ఉంది.

రాక్షసులతో ఫైట్

అనంతరం తెల్లటి గుర్రంపై చిరంజీవి ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. ఇందులో చిరంజీవి మరింత యంగ్‌గా కనిపించారు. తర్వాత రాక్షసులతో చిరంజీవి ఫైట్ సీక్వెన్స్ సూపర్బ్‌గా ఉంది. కట్ చేస్తే భారీ హనుమాన్ విగ్రహం దగ్గర విలన్స్‌ను చితక్కొట్టే సీన్, హనుమంతుడిలాగే గద పట్టుకుని చిరంజీవి ఇచ్చిన స్టిల్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నిమిషం 32 సెకన్ల నడివి ఉన్న విశ్వంభర టీజర్ అదిరిపోయింది.

హనుమాన్‌లో ఉన్నట్లుగా

అయితే, విశ్వంభరలో కాస్తా అవతార్ సినిమాలోని పాత్రల రూపురేఖలు కనిపిస్తున్నాయి. అందులో ఉన్నట్లుగానే ఓ పాప క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. అలాగే, హనుమాన్ సినిమాలో ఉన్నట్లుగానే ఇందులో కూడా భారీ హనుమాన్ విగ్రహం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విశ్వంభర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

విశ్వంభర హీరోయిన్స్

కాగా, విశ్వంభర సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. విశ్వంభర చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.

మరింత స్పెషల్‌గా

ఇక సినిమా టీజర్‌లో చోటా కె నాయుడు ఉత్కంఠభరితమైన సినిమాటోగ్రఫీ బాగుంది. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎమ్ఎమ్ కీరవాణి అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌కు మరింత స్పెషల్ అట్రాక్షన్ వచ్చినట్లు అయింది. సినిమా నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. విక్రమ్‌రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకు సుస్మిత కొణిదెల స్టైలిస్ట్‌గా చేస్తున్నారు.