(1 / 7)
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో దగ్గుబాటి రానా విడుదల చేస్తున్నడు. అక్టోబర్ 11న థియేటర్లలో జిగ్రా మూవీ రిలీజ్ కానుంది.
(2 / 7)
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 8న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, మాటల మాంత్రికుడు, డైరెక్టర్ తివిక్రమ్, దగ్గుబాటి రానా, రాహుల్ రవీంద్రన్ హాజరు అయ్యారు.
(3 / 7)
జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది" అని అలియా చెప్పింది.
(4 / 7)
"ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం" అని అలియా భట్ వెల్లడించింది.
(5 / 7)
"జిగ్రా కోసం వాసన్ బాలాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఇంకా చాలా గొప్ప చిత్రాలను చేయాలి. అందులో నాతో కొన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. వేదాంగ్ ఈ మూవీతో స్టార్ అయిపోతాడు. రియల్ లైఫ్‌లోనూ నా బ్రదర్, ఫ్రెండ్‌లా అయిపోయాడు" అని అలియా భట్ తెలిపింది.
(6 / 7)
"రాహుల్ ఈ చిత్రంలో ఓ కీ రోల్‌ను పోషించాడు. రాహుల్‌కు సినిమా అంటే పిచ్చి. రాహుల్, వాసన్ ఇద్దరూ సెట్స్‌లో సినిమా గురించే మాట్లాడుకునేవారు. మా సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న రానాకి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రానుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్న ఓ ఇంటెన్స్ సినిమా. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను" అని అలియా భట్ తన స్పీచ్ ముగించింది.
ఇతర గ్యాలరీలు