Bigg Boss Telugu 8: నీ కుట్ర నువ్ పన్నావ్.. కుండ బద్ధలు కొట్టిన నాగార్జున.. అందరి లెక్కలు తేల్చిన హోస్ట్ (వీడియో)-bigg boss telugu 8 nagarjuna review on eight week nominations bigg boss 8 telugu october 26 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: నీ కుట్ర నువ్ పన్నావ్.. కుండ బద్ధలు కొట్టిన నాగార్జున.. అందరి లెక్కలు తేల్చిన హోస్ట్ (వీడియో)

Bigg Boss Telugu 8: నీ కుట్ర నువ్ పన్నావ్.. కుండ బద్ధలు కొట్టిన నాగార్జున.. అందరి లెక్కలు తేల్చిన హోస్ట్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Oct 26, 2024 12:16 PM IST

Bigg Boss Telugu 8 October 26 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల అందరి లెక్కలు తేల్చాడు. కుండ బద్ధలు కొట్టి మరి అందరి గేమ్‌పై రివ్యూ ఇస్తూ మండిపడ్డాడు. దానికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు.

నీ కుట్ర నువ్ పన్నావ్.. కుండ బద్ధలు కొట్టిన నాగార్జున.. అందరి లెక్కలు తేల్చిన హోస్ట్ (వీడియో)
నీ కుట్ర నువ్ పన్నావ్.. కుండ బద్ధలు కొట్టిన నాగార్జున.. అందరి లెక్కలు తేల్చిన హోస్ట్ (వీడియో)

Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. సీరియస్ ఫేస్‌తో రాడ్ పట్టుకుని నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, స్టేజీపైన బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌కు ఉపయోగించిన దిష్టిబొమ్మ కుండలు ఉన్నాయి. ప్రతి కంటెస్టెంట్ ఫొటోతో కుండలు ఉన్నాయి.

బాడీ షేమింగ్ చేస్తున్నా

రాగానే పృథ్వీ కుండ బద్ధలు కొట్టిన నాగార్జున అతన్ని పైనుంచి కిందకు ఎగాదిగా చూసాడు. దాంతో కాస్తా సిగ్గుపడినట్లు నవ్వుతూ తలొంచాడు పృథ్వీ. "కింద నుంచి పైకి చూస్తేనే నీకు ఆలోచన వచ్చింది కదా" అని నాగార్జున అంటే.. "నా ఇంటెన్షన్ అది కాదు సర్" అని పృథ్వీ అన్నాడు. "నా ఇంటెన్షన్ కూడా ఏం అనుకుంటున్నావ్. నిన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాను అనా. చేయట్లేదు" అని నాగ్ టోన్ పెంచాడు.

"పృథ్వీ గురించి మాట్లాడగానే నిఖిల్ గురించి మాట్లాడక తప్పదు అని సంచాలక్‌గా నీ డెసిషియన్స్ కరెక్టో రాంగో నాకే కాదు రాయల్ టీమ్‌కు కూడా అర్థం కావట్లేదు" నాగార్జున అన్నాడు. "తేజ సంచాలక్‌గా నిఖిల్ క్విజ్‌లో కరెక్టా కాదా" అని అడిగాడు నాగార్జున. దానికి "కరెక్ట్ కాదని నా అభిప్రాయం. క్వశ్చన్ అయిన తర్వాతే బజర్ నొక్కాలని రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాడు" అని టేస్టీ తేజ బదులిచ్చాడు.

పూర్తయ్యాకే బజర్ నొక్కారా

"మీ రాయల్స్ అందరూ క్వశ్చన్ పూర్తయ్యాకే బజర్ నొక్కారా" అని తిరిగి ప్రశ్నించాడు నాగార్జున. దాంతో తేజ సైలెంట్ అయిపోయాడు. "బజర్ నొక్కినందుకు క్వశ్చన్ రిపీట్ చేయొద్దన్నారు. నేను చేయలేదు కూడా. తేజ రైట్ అయితే తేజ రైట్. ప్రేరణ కరెక్ట్ అయితే ప్రేరణ రైట్" అని నిఖిల్ అన్నాడు. దాంతో "తేజా.. నీ కుట్ర నువ్ పన్నావ్ అన్నమాట" అని టేస్టీ తేజను నాగార్జున అన్నాడు.

తర్వాత విష్ణుప్రియను ఎందుకు నామినేట్ చేశావని యష్మీని అడిగాడు నాగ్. "ఏడు వారాల్లో తన సొంత గేమ్ ఎక్కడ కనిపించలేదని చేశాను సర్" అని యష్మీ బదులిచ్చింది. దానికి "మరి నువ్వేం చేస్తున్నావ్" అని నాగ్ అడిగాడు. అంటే యష్మీ కూడా విష్ణుప్రియలా గేమ్ ఆడకుండా నిఖిల్‌తో లవ్ ట్రాక్ నడిపించేందుకు ట్రై చేసింది. దీనిపైనే నాగ్ అలా అన్నట్లు తెలుస్తోంది.

ప్రైజ్ మనీ తగ్గినా పర్వాలేదు

తర్వాత హరితేజ కుండ బద్ధలుకొట్టిన నాగార్జన నబీల్‌ను పిలిచాడు. "50 వేలు పోతాయని తెలిసి కూడా హరితేజను నామినేట్ చేశావ్ కదా" అని నాగార్జున అంటే "నా దగ్గర పాయింట్స్ ఉన్నవాళ్లనే నామినేట్ చేద్దామని చేశా" అని నబీల్ చెప్పుకొచ్చాడు. "నీ దగ్గర కొన్ని వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. వాటికోసం ప్రైజ్ మనీ తగ్గిన పర్వాలేదు" అని నాగార్జున అన్నాడు. దాంతో నబీల్ సైలెంట్ అయ్యాడు.

"హరితేజ నువ్వు నయని ఏ క్లాన్‌లో ఉన్నారు" అని క్వశ్చన్ చేశాడు నాగ్. దాంతో బిత్తరపోయిన హరితేజ.. "డ్యామ్ ష్యూర్ సర్ తేజ, మెహబూబ్, అవినాష్, గంగవ్వ కలిసికట్టుగా రోహిణిని సెలెక్ట్ చేస్తారని నాకు తెలుసు సర్" అని చెప్పింది. తర్వాత గౌతమ్‌న లేపిన హోస్ట్ నాగార్జున "నువ్ మెగా చీఫ్ కాగానే వుమెన్స్ వీకెండ్ చేస్తున్నావ్. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి" అని యష్మీపై అరవడంపై అడిగాడు.

ఒక్కో మాట

"షార్ట్ టెంపర్ వచ్చేసింది" అని గౌతమ్ బదులిచ్చాడు." కోపంలో ఓ మాట, షార్ట్ టెంపర్‌లో ఓ మాట, కోపం తగ్గాక ఓ మాట, ఇష్టముంటే ఓ మాట, ఇష్టంలేకపోతే ఓ మాట, వీకెండ్‌లో ఒక మాట" అని నాగార్జున అన్నాడు. దాంతో గౌతమ్ షాక్ అయి చూశాడు. ఇలా కుండలు బద్ధలు కొట్టి ఒక్కో కంటెస్టెంట్ గేమ్‌పై రివ్యూ ఇస్తూ అందరి లెక్కలు తేల్చాడు హోస్ట్ నాగార్జున.

Whats_app_banner