తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Remembers Harikrishna: హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

Jr NTR Remembers Harikrishna: హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

Hari Prasad S HT Telugu

02 September 2022, 13:36 IST

    • Jr NTR Remembers Harikrishna: హరికృష్ణ జయంతి సందర్భంగా అతన్ని గుర్తు చేసుకున్నారు తనయులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌. ట్విటర్‌లో హృదయాన్ని తాకే సందేశాన్ని పోస్ట్‌ చేశారు.
తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో)
తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో) (Twitter)

తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో)

Jr NTR Remembers Harikrishna: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా అతని తనయులు, టాలీవుడ్‌ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ఘనంగా నివాళులర్పించారు. ట్విటర్‌లో ఇద్దరూ ఒకే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. మీ 66వ జయంతి రోజున మిమ్మల్ని స్మరించుకుంటూ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ ఫొటోని ట్వీట్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

అందులో హరికృష్ణకు నివాళి అర్పిస్తూ ఓ హృద్యమైన సందేశం ఉంది. "ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే. నందమూరి కల్యాణ్‌రామ్‌, నందమూరి తారక రామారావు" అని ఆ నివాళిలో రాశారు. జూనియర్‌ ఈ ట్వీట్‌ను శుక్రవారం (సెప్టెంబర్‌ 2) ఉదయం 9 గంటలకు చేశాడు.

ఆ కాసేపటికే కల్యాణ్‌ రామ్‌ కూడా ఇదే ఫొటోతో ట్వీట్ చేశాడు. తమ తండ్రిని స్మరించుకుంటూ ఈ అన్నదమ్ములు చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. వాళ్లు కూడా తమ అభిమాని నటుడికి అశ్రు నివాళి అర్పించారు. హరికృష్ణ 2018 ఆగస్ట్‌ 29న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన నడిపిస్తున్న వాహనం బోల్తా పడటంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతకు కొన్నాళ్ల ముందు ఇదే ప్రాంతంలో హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జయరామ్‌ కూడా ఇలా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. 1964లో బాలనటుడిగా హరికృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్యలాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.