తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ ఇదే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే

Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ ఇదే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే

Hari Prasad S HT Telugu

04 May 2023, 18:45 IST

    • Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్తను మేకర్స్ గురువారం (మే 4) అందించారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జైలర్ మూవీలో రజనీకాంత్
జైలర్ మూవీలో రజనీకాంత్

జైలర్ మూవీలో రజనీకాంత్

Jailer Release Date: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ గురువారం (మే 4) రివీల్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ రిలీజ్ విషయాన్ని సన్ పిక్చర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎంతో బజ్ క్రియేట్ చేస్తోంది. జైలర్ మూవీలో రజనీతోపాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియాలోని మూడు భాషల స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో జైలర్ మూవీకి మరింత హైప్ వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా నటించారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మూవీలోని ప్రధాన క్యారెక్టర్లను ఇందులో చూపించారు. మొదట్లో ఫాస్ట్ ఫాస్ట్ గా జైలర్ మూవీలోని క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేయగా.. చివర్లో సూపర్ స్టార్ ఎంట్రీ సీన్ అదిరిపోయేలా చూపించారు. రజనీ తనదైన స్టైల్లో కాలితో కారు డోరు తెరిసి, బయటకు దిగి ఓ స్మైల్ ఇచ్చాడు.

ఈ గ్లింప్స్ లో రజనీకాంత్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మూవీ కోసం అతడి మేకోవర్ చాలా బాగుంది. ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే హాలీడేతో కలిపి లాంగ్ వీకెండ్ రావడంతో మేకర్స్ ఆగస్ట్ 10ని రిలీజ్ డేట్ గా ఎంచుకున్నారు. దీంతో మూవీకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. జైలర్ లో తమన్నా, రమ్యక్రిష్ణ కూడా నటిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ జైలర్ మూవీతో సూపర్ స్టార్ మళ్లీ గాడిలో పడతాడేమో చూడాలి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.