తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Amarnath : రజనీకాంత్ కు మేమెందుకు సారీ చెప్పాలి, రాజకీయాల్లో కౌంటర్ ఫేస్ చేయాల్సిందే - మంత్రి అమర్నాథ్

Minister Amarnath : రజనీకాంత్ కు మేమెందుకు సారీ చెప్పాలి, రాజకీయాల్లో కౌంటర్ ఫేస్ చేయాల్సిందే - మంత్రి అమర్నాథ్

02 May 2023, 22:41 IST

    • Minister Amarnath On Rajinikanth :సినిమాల్లాగా ఏమైనా అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయాలని రజనీకాంత్ గుర్తించాలని మంత్రి అమర్నాథ్ అన్నారు. రాజకీయాలు గురించి అర్థం చేసుకునే రజనీ పార్టీ పెట్టలేదన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్
మంత్రి గుడివాడ అమర్నాథ్ (Twitter )

మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Amarnath On Rajinikanth : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు విజనరీపై మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు రజనీకాంత్ పై విరుచుపడుతున్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే వరుసగా రజనీకాంత్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సూపర్ స్టార్ పై సెటైర్లు వేశారు. రాజకీయాలంటే సినిమా కాదని ఎద్దేవా చేశారు. రజనీకాంత్ కు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రజనీకాంత్ కు మేమెందుకు సారీ చెప్పాలని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలను వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు. సినిమాల్లో మాదిరిగా ఏమైనా అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయాలన్నారు. దొంగ, హంతకుడు పెట్టిన సభకు హాజరైన రజనీకాంత్ చంద్రబాబుపై పొగడ్తలు కురిపిస్తే ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే సూపర్ స్టార్ అని, ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదని మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు వేశారు. రాజకీయాలు గురించి అర్థం చేసుకునే పార్టీ విషయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి

టీడీపీ ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మార్చిందని విమర్శించారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర పర్యటన వివరాలను మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో భాగంగా మూలపేట పోర్టు మంజూరు చేశామన్నారు. మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోతుందన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు

2025 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అవుతుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే సమయానికి విశాఖ-భోగాపురం మధ్య 6500 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తాపీమెస్త్రీ, శిలాఫలకాలు ఉంటే చంద్రబాబు ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా కట్టేయగలరని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులన్నీ తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

రజనీ ఫ్యాన్స్ ఫైర్

వైసీపీ నేతల విమర్శలపై ఇటు టీడీపీ, అటు రజనీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడే రజనీకాంత్ పై ఇంత తీవ్రంగా మాట్లాడడం సరికాదంటున్నారు. రజనీ కాంత్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడుతున్నారు. తమిళ సినిమాల్లో నటించిన రోజా కూడా రజనీకాంత్ పై విమర్శలు చేయడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు.

తదుపరి వ్యాసం