Sunil Look In Jailer: రజనీకాంత్ జైలర్‌లో సునీల్ - ఫస్ట్ లుక్ రిలీజ్
18 January 2023, 10:00 IST
Sunil Look In Jailer: టాలీవుడ్ కమెడియన్ సునీల్ అగ్ర హీరో రజనీకాంత్‌తో కలిసి ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమా ఏదంటే...
సునీల్
Sunil Look In Jailer: టాలీవుడ్ కమెడియన్ సునీల్ కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ అందుకున్నాడు. రజనీకాంత్ జైలర్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. సునీల్ లుక్‌ను మంగళవారం సన్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. ఇందులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ ధరించే దుస్తుల్లో సునీల్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. అతడి లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన సీరియస్ రోల్‌లో సునీల్ కనిపించబోతున్నట్లు సమాచారం.
జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో రజనీకాంత్‌తో పాటు కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సునీల్ కూడా ఈ సినిమాలో భాగం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జైలర్ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నరసింహా తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జైలర్ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ మొత్తం ఒకే నైట్‌లో సాగుతుందని చెబుతున్నారు.
ఇందులో ముత్తువేల్ పాండ్యన్ అనే పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. బీస్ట్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ జైలర్ సినిమాను నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం సునీల్ కోలీవుడ్‌తో జైలర్‌తో పాటు కార్తి జపాన్, శివకార్తికేయన్ మావీరన్ సినిమాల్లో నటిస్తోన్నాడు.