తెలుగు న్యూస్  /  Entertainment  /  Gaslight Trailer Released As Wheel Chair Bound Sara Ali Khan Tries To Find Her Missing Father

Gaslight Trailer: వీల్‌చెయిర్‌లో సారా.. తన తండ్రిని మర్డర్ చేసిన వాళ్లను పట్టుకుంటుందా.. గ్యాస్‌లైట్ ట్రైలర్

Hari Prasad S HT Telugu

14 March 2023, 21:57 IST

    • Gaslight Trailer: వీల్‌చెయిర్‌లో సారా అలీ ఖాన్.. తన తండ్రిని మర్డర్ చేసిన వాళ్లను పట్టుకుంటుందా.. తీవ్ర ఉత్కంఠ రేపేలా గ్యాస్‌లైట్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతోంది.
గ్యాస్‌లైట్ మూవీలో సారా అలీ ఖాన్
గ్యాస్‌లైట్ మూవీలో సారా అలీ ఖాన్

గ్యాస్‌లైట్ మూవీలో సారా అలీ ఖాన్

Gaslight Trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రాబోతోంది. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ నటించిన గ్యాస్‌లైట్ మూవీ ట్రైలర్ మంగళవారం (మార్చి 14) రిలీజైంది. సారాతోపాటు చిత్రాంగదా సింగ్, విక్రాంగ్ మస్సీ నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీలో మిషా అనే నడవలేని అమ్మాయి పాత్రలో సారా నటించింది.

ట్రెండింగ్ వార్తలు

Mammootty Telugu Movies: రిలీజ్‌కు నోచుకోని స్టార్‌ డైరెక్టర్‌తో మ‌మ్ముట్టి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే!

Upcoming Web Series in May 2024: మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు

Guppedantha Manasu Serial: మ‌ను కోసం మ‌హేంద్ర త్యాగం - రిషి రీఎంట్రీపై స‌స్పెన్స్ - బాబాయ్‌పై శైలేంద్ర రివేంజ్‌

Krishna mukunda murari serial may 1st: కోడలికి ఘనంగా సీమంతం చేసిన భవానీ.. కృష్ణని ఇంట్లో నుంచి గెంటేసేందుకు మీరా స్కెచ్

వీల్ చెయిర్ కే పరిమితమైన మిషా.. కనిపించకుండా పోయిన తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ల ప్రవర్తన తనను ఆశ్చర్యానికి, భయానికి గురి చేస్తుంది. తన తండ్రి తనకు కనిపిస్తున్నాడని చెప్పినా ఎవరూ నమ్మరు. ఒక రోజు తన తండ్రి హత్యకు గురయ్యాడని, అతని శవాన్ని కారులో చూశాననీ చెబుతుంది.

అసలు ఆమె తండ్రిది హత్యేనా? ఇంకా ఏదైనా జరిగిందా? హత్య అయితే ఎవరు చేశారు? ఈ మిస్టరీని మిషా ఎలా చేజ్ చేసింది అన్నదే గ్యాస్‌లైట్ మూవీ. ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఒకరకంగా దీనిని థ్రిల్లర్ కమ్ హారర్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాలో మిషా పాత్ర పోషించిన సారాకు తన తండ్రి అసిస్టెంట్ గా నటించిన కపిల్ (విక్రాంత్ మస్సీ) సాయం చేస్తుంటాడు.

తండ్రి హత్యకు గురయ్యాడని తెలిసిన తర్వాత ఎవరిని చూసిన అనుమానాస్పదంగా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ కలిసి హంతకులను ఎలా పట్టుకుంటారన్నదే ఈ మూవీ కథ. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దీనిని తెరకెక్కించింది. ఈ మూవీ ట్రైలర్ ను సారా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

"అనుమానం మరింత బలపడుతూ వెళ్తోంది.. ఇంతకీ ఎవరు హంతకుడు? ట్రైలర్ ఇప్పుడే చూడండి" అనే క్యాప్షన్ తో సారా ఈ ట్రైలర్ ను పోస్ట్ చేసింది. పవన్ క్రిప్లానీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రమేష్ తురానీ ప్రొడ్యూసర్. ఈ సినిమా మార్చి 31న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.