తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upcoming Web Series In May 2024: మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు

Upcoming Web Series in May 2024: మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu

01 May 2024, 9:14 IST

    • Upcoming Web Series in May 2024: మే నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీటిలో రెండు మాత్రం అస్సలు మిస్ కావద్దు. మరి ఆ సిరీస్ ఏవో ఒకసారి చూసేయండి.
మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు
మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు

మే నెలలో రానున్న అదిరిపోయే వెబ్ సిరీస్‌ ఇవే.. ఈ రెండూ మిస్ కావద్దు

Upcoming Web Series in May 2024: మే 2024 లో హీరామండి, ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2, బ్రిడ్జర్టన్ సీజన్ 3, ది మిడ్‌నైట్ రొమాన్స్ ఎట్ హగ్వాన్ సహా అనేక వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీల్లో రానున్నాయి. వీటిలో బిగ్ సిగార్, డార్క్ మ్యాటర్, అకాపుల్కో, క్రాష్ వంటి షోల కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీల్లోకి రాబోతున్న ఆ వెబ్ సిరీస్ ఏవో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

Yakshini OTT: బాహుబలి మేకర్స్ నుంచి యక్షిణి వెబ్ సిరీస్.. వేదిక ఫస్ట్ లుక్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

హీరామండి: ది డైమండ్ బజార్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. హీరామండి అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి వస్తున్నాడు. 1940ల నాటి భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో సాగే ఈ సిరీస్.. ప్రేమ, అధికారం, ప్రతీకారం, స్వేచ్ఛ కలగలిసిన ఇతిహాస గాథ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి వాళ్లు నటించారు. ఈ వెబ్ సిరీస్ బుధవారం (మే 1) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ కానుంది.

ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2

ఇప్పటికే సీజన్ 1తో వచ్చిన బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రాబోయే థ్రిల్లర్ సిరీస్ కు వినయ్ వైకుల్ దర్శకత్వం వహించాడు. ఈ బ్రోకెన్ న్యూస్ సిరీస్ న్యూస్ రిపోర్టింగ్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. కొత్త సీజన్లో సోనాలి బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గావ్కర్ నటించారు. మే 3 నుంచి జీ5లో బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.

బ్రిడ్జర్టన్ సీజన్ 3

ఇప్పటికే రెండు సీజన్లతో ఓటీటీ ప్రేక్షకుల ఆదరణ పొందిన బ్రిడ్జర్టన్ సీజన్ 3తో రాబోతోంది. ఈ కొత్త సీజన్ పార్ట్ 1న మే 13 నుంచి, పార్ట్ 2 జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

పంచాయత్ సీజన్ 3

ఎన్నాళ్లుగానో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఈ నెలలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ వీడియో ప్రతి రోజూ కొత్త సీజన్ రిలీజ్ డేట్ పై టీజ్ చేస్తూ వస్తోంది. మే మూడో వారం లేదంటే చివరి వారంలో ఈ సీజన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అన్‌దేఖీ సీజన్ 3

సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న అన్‌దేఖీ హిందీ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పంజాబీ వెడ్డింగ్, అందులో జరిగే రెండు హత్యల చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడో సీజన్ మే 10 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ లతోపాటు మంజుమ్మల్ బాయ్స్, సైతాన్, కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ లాంటి మోస్ట్ అవేటెడ్ మూవీస్ కూడా మే నెలలోనే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఆ లెక్కన సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ టైంపాస్ గ్యారెంటీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం