Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్
Panchayat Season 3 OTT Release: పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ గురించి అప్‍డేట్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఓ వీడియో రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ సిరీస్ వచ్చేస్తోందంటూ చెప్పింది. ఆ వివరాలివే..

Panchayat Season 3 OTT: పంచాయత్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఓటీటీలో ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ వెబ్ సిరీస్‍లో వచ్చిన రెండు సీజన్లు భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. విలేజ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పంచాయత్ సీజన్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూడో సీజన్ గురించి తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అప్‍డేట్ ఇచ్చింది. నేడు (ఏప్రిల్ 29) ఓ వీడియో రిలీజ్ చేసింది.
త్వరలో స్ట్రీమింగ్ డేట్
పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‍ను అతి త్వరలో ప్రకటిస్తామంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు ఓ వీడియో తీసుకొచ్చింది. “ఓపెన్ చేయొద్దండి.. లోపల పంచాయత్ సీజన్ 3 డేట్ ఉంది!” అనే పేపర్ ఓ రిఫ్రిజిరేటర్‌కు అంటించి ఉంది. అయితే, ఆ డోర్ ఓపెన్ చేయగా లోపల అన్నీ సొరకాయలు ఉన్నట్టు వీడియోలో ఉంది. "ట్రై చేశారుగా.. అంత సింపుల్ కాదు.. స్టే ట్యూన్డ్” అంటూ టీజ్ చేసింది. అయితే, అతిత్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చింది.
“మీరు కాస్త నిరీక్షిస్తే పంచాయత్ కొత్త సీజన్ డేట్ దొరుకుతుంది” అంటూ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. ఎట్టకేలకు మూడో సీజన్‍పై అప్‍డేట్ రావడంతో ఈ సిరీస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చు?
పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి చాలా ముఖ్యమైనదిగా ఉంది. దీనికి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఐపీఎల్ 2024 సీజన్ తర్వాతే ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ఆ ప్లాట్‍ఫామ్ అనుకుంటోందని బజ్ ఉంది. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. దీంతో మే చివర్లో లేకపోతే జూన్ మొదట్లో పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి, ప్రైమ్ వీడియో ఓ డేట్‍ను ఖరారు చేస్తుందో చూడాలి. తేదీపై త్వరలోనే ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటన చేయనుంది.
పంచాయత్ వెబ్ సిరీస్‍లో జితేంద్ర కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామపంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మూడో సీజన్‍లో జితేంద్రతో పాటు నీనా గుప్తా, సన్విక, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ కీలకపాత్రలు పోషించారు.
పంచాయత్ వెబ్ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. చందన్ కుమార్ రచయితగా ఉన్నారు. ది వైరల్ ఫీవర్ పతాకంపై అర్ణబ్ కుమార్, శ్రేయాన్శ్, పాండే, విజయ్ కోషీ ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు.
పంచాయత్ ఫస్ట్ సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2020 ఏప్రిల్ 3వ తేదీన వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కథ, కథనం, సామాజిక అంశాలు, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సిరీస్ చాలా పాపులర్ అయింది. 2022 మే 20వ తేదీన రెండో సీజన్ అడుగుపెట్టింది. రెండో సీజన్ కూడా అదే రేంజ్‍లో సక్సెస్ అయింది. దీంతో మూడో సీజన్‍పై అంచనాలు భారీగా ఉన్నాయి.
టాపిక్