Best Murder Mystery Web Series: సోనీలివ్ ఓటీటీలోని బెస్ట్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇవే
Best Murder Mystery Web Series: ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన సోనీలివ్ లో ఎన్నో వెబ్ సిరీస్ ఉన్నాయి. అయితే అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. వాటిలో బెస్ట్ ఏవో మీరే చూడండి.
Best Murder Mystery Web Series: మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగా సాగుతాయి. స్టోరీలో ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. ప్రముఖ ఓటీటీ సోనీలివ్ (Sonyliv)లోనూ అలాంటి వెబ్ సిరీస్ కొన్ని ఉన్నాయి. ఈ సిరీస్ అన్నీ మొదటి నుంచి చివరి వరకూ ఎంతో ఉత్కంఠ రేపుతాయి. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో మీరూ చూడండి.
సోనీలివ్ ఓటీటీలో బెస్ట్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్
జెహానాబాద్
క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ స్టోరీలు అనగానే చాలా మంది రైటర్ల కన్ను బీహార్ పైనే పడుతుంది. జెహానాబాద్ కూడా అక్కడ జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీసే. జైలు నుంచి తమ నాయకుడిని విడిపించేందుకు నక్సల్స్ వేసే భారీ ప్లాన్, దానికి సాయపడే ఓ కాలేజీ ప్రొఫెసర్, ఆ ప్రొఫెసర్ తో ప్రేమలో పడే స్టూడెంట్.. ఇలా స్టోరీ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈ జెహానాబాద్ చాలా బాగా నచ్చుతుంది.
ఛార్లీ చోప్రా
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఛార్లీ చోప్రా. 1931లో వచ్చిన బ్రిటీష్ నవల ది స్టాఫోర్డ్ మిస్టరీని సిరీస్ గా తెరకెక్కించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, సొలాంగ్ లోయలో జరిగే ఓ ఆర్మీ బ్రిగేడియర్ హత్య, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి రంగంలోకి దిగే డిటెక్టివ్ ఛార్లీ చోప్రా (వామికా గబ్బి) చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.
అన్‌దేఖీ
సోనీలివ్ ఓటీటీలో అన్‌దేఖీ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. బాగా డబ్బున్న పంజాబీ ఫ్యామిలీ వెడ్డింగ్ లో జరిగే రెండు హత్యల చుట్టూ తిరిగే స్టోరీ ఈ అన్‌దేఖీ (Undekhi). దిబ్యేందు భట్టాచార్య డీఎస్పీగా నటించిన ఈ సిరీస్ ఆకట్టుకునేలా ఉంది.
తనావ్
కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు, స్పెషల్ టాస్క్ గ్రూప్ మధ్య జరిగే యుద్ధమే ఈ తనావ్. ఇజ్రాయెల్ టీవీ సిరీస్ ఫౌదాకు రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సుధీర్ మిశ్రా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.
టబ్బర్
టబ్బర్ అంటే పంజాబీ భాషలో కుటుంబం అని అర్థం. ఓ బలమైన రాజకీయ నాయకుడి నుంచి ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సాహసం చేశాడన్నది ఈ టబ్బర్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
కఫస్
బాలీవుడ్ నటుడు షర్మాన్ జోషి నటించిన వెబ్ సిరీస్ కఫస్. ఓ స్టార్ నటుడు 15 ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు న్యాయం కోసం చేసే పోరాటమే ఈ కఫస్ వెబ్ సిరీస్. బ్రిటీష్ డ్రామా డార్క్ మనీ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు.
యువర్ హానర్
మరో ఇజ్రాయెల్ టీవీ సిరీస్ క్వోడో ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ యువర్ హానర్. ఓ హిట్ అండ్ రన్ కేసులో తన కొడుకును కాపాడుకోవడం కోసం ఓ నీతిమంతుడైన జడ్జి (జిమ్మీ షెర్గిల్) తన నైతికతను ఎలా వదులుకుంటాడు? ఆ తర్వాత అతడు ఎదుర్కొనే పరిణామాలు ఏంటన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.