తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya Reached Fourth Place In Highest Collection Movies In Telugu States

Chiranjeevi Breaks Mahesh Record: మ‌హేష్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన చిరు - టాప్ ఫోర్‌లోకి వాల్తేర్ వీర‌య్య మూవీ

15 February 2023, 7:36 IST

  • Chiranjeevi Breaks Mahesh Record: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చి నెల రోజులు దాటింది. అయినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా జోరు త‌గ్గ‌లేదు. తాజాగా క‌లెక్ష‌న్స్ ప‌రంగా వాల్తేర్ వీర‌య్య‌ మ‌రో రికార్డ్‌ను బ్రేక్ చేసింది

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Chiranjeevi Breaks Mahesh Record: వాల్తేర్ వీర‌య్య‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. (Chiranjeevi) ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల్ని త‌ల‌క్రిందులు చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద వాల్తేర్ వీర‌య్య క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 250 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

Heeramandi OTT Release Date: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

Brahmamudi April 30th Episode: కావ్య విశ్వ‌రూపం - అనామిక త‌ల్లిదండ్రుల‌కు మాస్ వార్నింగ్ - దుగ్గిరాల ఇంట్లో క‌న‌కం ర‌చ్చ

తెలుగు స్టేట్స్‌లో 32 రోజుల్లో ఈ సినిమా 190 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన టాలీవుడ్ సినిమాల్లో నాలుగు స్థానంలో వాల్తేర్ వీర‌య్య నిలిచింది. ఈ జాబితాలో 400 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా బాహుబ‌లి -2 , అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు త‌ర్వాతి స్థానంలో నిలిచాయి. ఈ మూడు సినిమాల త‌ర్వాత వాల్తేర్ వీర‌య్య కు ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఇన్ని రోజులు 180 కోట్ల‌తో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు ఫోర్త్ ప్లేస్‌లో ఉండ‌గా ఆ రికార్డ్‌ను చిరంజీవి వాల్తేర్ వీర‌య్య బ్రేక్ చేసింది. చిరు దెబ్బ‌కు మ‌హేష్ సినిమా ఐదో స్థానానికి ప‌డిపోయింది. వాల్తేర్ వీర‌య్య సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వితేజ (Raviteja) మ‌రో హీరోగా న‌టించాడు.

త‌న త‌మ్ముడి మ‌ర‌ణంపై ఓ అన్న‌య్య ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వాల్తేర్ వీర‌య్య సినిమా రూపొందింది. ఇందులో చిరంజీవి, ర‌వితేజ కామెడీ టైమింగ్, ఎలివేష‌న్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఇందులో చిరంజీవికి జోడిగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 27న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.