Telugu News  /  Entertainment  /  Mahesh Babu Praises On Writer Padmabhushan Movie
రైటర్ పద్మభూషణ్ టీమ్‌తో మ‌హేష్‌బాబు
రైటర్ పద్మభూషణ్ టీమ్‌తో మ‌హేష్‌బాబు

Mahesh babu -Writer Padmabhushan: మ‌స్ట్ వాచ్ ఫిల్మ్ - రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌కు అండ‌గా మ‌హేష్‌బాబు

06 February 2023, 12:10 ISTNelki Naresh Kumar
06 February 2023, 12:10 IST

Mahesh babu -Writer Padmabhushan: సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాపై మ‌హేష్‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. ఫ్యామిలీస్ అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా ఇద‌ని మ‌హేష్ పేర్కొన్నాడు.

Mahesh babu -Writer Padmabhushan: సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాను మ‌హేష్‌బాబు ప్ర‌త్యేకంగా వీక్షించారు. చిన్న సినిమాపై అత‌డు ప్ర‌శంస‌లు కురిపించాడు. రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఫ్యామిలీస్ అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా అని మ‌హేష్‌బాబు పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మ‌న‌సుల్ని క‌దిలించే మంచి సినిమా ఇద‌ని తెలిపాడు. క్లైమాక్స్ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ద‌ని చెప్పాడు. సినిమాను తాను ఎంజాయ్ చేశాన‌ని, సుహాన్ న‌ట‌న బాగుంద‌ని మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

హీరో సుహాస్‌తో పాటు చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో క‌లిసి దిగిన ఫొటోను మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రెండు రోజుల్లోనే మూడు కోట్ల అర‌వై ల‌క్ష‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

ర‌చ‌యిత కావాల‌ని త‌పించే ఓ యువ‌కుడి క‌థ‌తో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ఈ సినిమానుతెర‌కెక్కించారు. అంత‌ర్లీనంగా మ‌హిళ‌ల ఇష్టాల్ని గుర్తించి ప్రోత్స‌హించాల‌నే చ‌క్క‌టి సందేశాన్ని ఈ సినిమాకు జోడించారు. టీనా శిల్పారాజ్ హీరోయిన్‌గా న‌టించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.