తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్.. ఇంట్రెస్టింగా ఛాంగురే బంగారురాజా టీజర్

Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్.. ఇంట్రెస్టింగా ఛాంగురే బంగారురాజా టీజర్

Hari Prasad S HT Telugu

26 April 2023, 18:04 IST

    • Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఓ కుక్క.. ముగ్గురు వ్యక్తులు, ఓ హత్య చుట్టూ తిరిగే కథ ఇది.
ఛాంగురే బంగారురాజా టీజర్ లో కార్తీక్ రత్నం, సత్య
ఛాంగురే బంగారురాజా టీజర్ లో కార్తీక్ రత్నం, సత్య

ఛాంగురే బంగారురాజా టీజర్ లో కార్తీక్ రత్నం, సత్య

Changure Bangaru Raja Teaser: ఓ కుక్క.. ముగ్గురు వ్యక్తులు.. ఓ హత్య.. వీటి చుట్టూ తిరిగే సరదా కథే ఛాంగురే బంగారురాజా మూవీ. తాజాగా బుధవారం (ఏప్రిల్ 26) ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా రవితేజ ఈ టీజర్ లాంచ్ చేశాడు. ఇక ఇందులో కుక్కకు కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్ అయిన సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు కథలోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల పాత్రలు పోషించారు. ఈ మూవీకి కథను అందించడంతోపాటు దర్శకత్వం వహించాడు సతీశ్ వర్మ. ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఆసక్తికరంగా మొదలువుతుంది. ఓ కుక్క తనను తాను పరిచయం చేసుకుంటుంది. తన పేరు వీరబొబ్బిలి అని.. ముగ్గురు వ్యక్తుల వల్ల తన జీవితం తలకిందులైందని చెబుతుంది.

ఆ కుక్కకే సునీల్ తనదైన స్టైల్లో వాయిస్ ఓవర్ అందించాడు. ఈ మూవీలో బంగార్రాజుగా కార్తీక్ రత్నం, తాతారావ్ గా సత్య, గాటీలుగా రవిబాబు నటించారు. టీజర్ మొదట్లో ఫన్నీగా సాగుతుంది. అయితే ఓ మర్డర్ కేసులో ఈ ముగ్గురే ప్రధాన అనుమానితులుగా ఉండటంతో వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఆ హత్య చేసిందెవరో తనకు మాత్రమే తెలుసని వీరబొబ్బిలి ప్రత్యక్షమవుతుంది.

సరదాగా సాగిపోయే సీన్స్ తోపాటు హత్య ట్విస్టులో ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. దీనిని బట్టి సినిమా కూడా రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ఈ మూవీకి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించాడు. రవితేజ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.