Ravi Teja and Harish Movie: మిరపకాయ్ కాంబో రిపీట్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్-ravi teja and harish shankar confirms a period drama coming soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja And Harish Shankar Confirms A Period Drama Coming Soon

Ravi Teja and Harish Movie: మిరపకాయ్ కాంబో రిపీట్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్

Maragani Govardhan HT Telugu
Apr 05, 2023 07:42 AM IST

Ravi Teja and Harish Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరెకెక్కించిన మిరపకాయ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తాజాగా ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరూ కలిసి ఓ పీరియడ్ డ్రామా చేయబోతున్నారు.

హరీష్ శంకర్-రవితేజ
హరీష్ శంకర్-రవితేజ

Ravi Teja and Harish Movie: హిట్ కాంబినేషన్‌ల కోసం అభిమానులే సగటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. హిట్ ఇచ్చిన దర్శకుడితో తమ అభిమాన హీరో మరోసారి పనిచేయాలని, గత చిత్రపు రికార్డులను బద్దలుకొట్టాలని ఆశపడుతుంటారు. ఇలా టాలీవుడ్‌లో ఎన్నో హిట్ కాంబినేషన్లు ఉన్నాయి. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్, రాజమౌళి-ఎన్టీఆర్, సుకుమార్-అల్లు అర్జున్ ఇలా చాలా కాంబోలు ఉన్నాయి. ఈ జాబితాలో హరీష్ శంకర్-రవితేజ కూడా కాంబో కూడా ఉంది. వీరిద్దరూ గతంలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలు చేశారు. దీంతో మరోసారి అభిమానులు ఈ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆశపడుతోంది. తాజాగా వీరిద్దరూ ఇందుకు సంబంధించిన అప్డేట్ అనధికారికంగా ఇచ్చేశారు.

ప్రస్తుతం రావణాసుర చిత్ర ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్న మన మాస్ మహారాజా రవితేజ.. అభిమానులతో ట్విటర్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ అభిమాని హరీశ్ శంకర్‌తో మళ్లీ మూవీ ఎప్పుడు ప్రశ్నించాడు. మిరపకాయ్ కాంబోను మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ప్రశ్నను హరీష్ శంకర్‌కు ట్యాగ్ చేస్తూ రవితేజ ఆ డైరెక్టర్‌ను అడిగారు.

"ఏమ్మా హరీష్ శంకర్ ఏదో అడుగుతున్నారు నిన్నే.." అంటూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా మిరపకాయ్ దర్శకుడికి ట్యాగ్ చేశాడు. ఇందుకు సదరు డైరెక్టర్ కూడా రిప్లయి ఇచ్చాడు. "హా హా హా హా అన్నయ్యతో ఎల్లప్పుడూ సినిమాకు రెడీనే. వాస్తవానికి ఓ పీరియడ్ డ్రామాపై పనిచేస్తున్నాం. త్వరలోనే మేము చరిత్రను తిరగరాస్తాం. థ్యాంక్యూ రవితేజ అన్నయ్య." అంటూ హరీష్ రిప్లయి ఇచ్చాడు.

దీంతో రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ఖరారైంది. దీంతో మాస్ మహారాజా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్‌తో రవితేజ సినిమా అనగానే.. అంచనాలు పెంచేసుకుంటున్నారు. అందులోనూ ఎప్పుడూ రొటీన్ కామెడీ, మాస్ యాక్షన్ కాకుండా పీరియడ్ డ్రామా అనడంతో ఈ కాంబో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ నటించిన రావణాసుర ఈ నెల 7న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. . హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రలో మెరిశారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కింది.

IPL_Entry_Point

టాపిక్