Ravibabu on Poorna: పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది: డైరెక్టర్ రవిబాబు-ravibabu on poorna says he has love affair with her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravibabu On Poorna: పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది: డైరెక్టర్ రవిబాబు

Ravibabu on Poorna: పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది: డైరెక్టర్ రవిబాబు

Hari Prasad S HT Telugu

Ravibabu on Poorna: పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది అంటూ డైరెక్టర్ రవిబాబు సంచలన కామెంట్స్ చేశాడు. అతడి సినిమాల్లో పదే పదే ఆమెకే అవకాశం ఇవ్వడంపై ఎప్పటి నుంచో ఈ పుకార్లు ఉన్న విషయం తెలిసిందే.

రవిబాబు, పూర్ణ

Ravibabu on Poorna: టాలీవుడ్ లో విలక్షణ డైరెక్టర్లలో ఒకడు రవిబాబు. అతడి సినిమాలు మొదటి నుంచీ రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఆ సినిమాల్లో చాలా వరకూ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే ఫీల్ అయితే కల్పించాయి. మొదటి సినిమా అల్లరి కామెడీ జానర్ లో వచ్చినా.. తర్వాత అవును, అనసూయలాంటి హారర్ మూవీలు తీశాడు.

ఇక ఇప్పుడు అసలు మూవీతో మరోసారి అతడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమ్ అవనుంది. ఈటీవీ విన్ లో ఈ మూవీ చూడొచ్చు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో రవిబాబు బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ఈ మూవీలోనూ అతడు నటి పూర్ణకే అవకాశం ఇవ్వడంతో మరోసారి వీళ్ల ఎఫైర్ పుకార్లు తెరపైకి వచ్చాయి.

అయితే ఈసారి రవిబాబే తనకు పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందంటూ చెప్పి షాక్ కు గురి చేశాడు. రవిబాబు తీసిన అవును మూవీతో పూర్ణ టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లడ్డూ బాబులోనూ ఆమెకే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అసలు మూవీలోనూ పూర్ణనే కనిపించనుంది. దీనిపై రవిబాబు స్పందించాడు. పూర్ణతో ఎఫైర్ ఉన్నదని, అయితే అది మీరనుకుంటున్న ఎఫైర్ కాదని అతడు అన్నాడు.

"పూర్ణతో ఈ లవ్ ఎఫైర్ నాకు ఉంది. అయితే అది మీరు అనుకుంటున్నది కాదు. మనం అనుకుంటున్నదాని కంటే 200 శాతం మెరుగైన ఔట్‌పుట్ ఇచ్చే నటులను డైరెక్టర్లు ఇష్టపడతారు. పూర్ణ కూడా అలాంటి నటే" అని రవిబాబు అన్నాడు. ఈ అసలు మూవీ ఓ మర్డర్ మిస్టరీ. ఓ వ్యక్తి ఈ హత్యలు చేస్తున్నారని తెలిసినా.. తన చుట్టూ ఉన్న వాళ్లు దీనిని నిరూపించలేరు.

ఈ సినిమాకు కథను రవిబాబు అందించాడు. అయితే డైరెక్షన్ బాధ్యతలు మాత్రం అతడు తీసుకోలేదు. తన అసిస్టెంట్లు ఉదయ్, సురేశ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో రవిబాబు నటనకే పరిమితం అయ్యాడు. గురువారం (ఏప్రిల్ 13) నుంచే ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

సంబంధిత కథనం