Asalu Movie OTT Release date: అసలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?-ravi babu asalu ott release date when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Asalu Movie Ott Release Date: అసలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Asalu Movie OTT Release date: అసలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Apr 09, 2023 10:11 AM IST

Asalu Movie OTT Release date: రవిబాబు పోలీసు పాత్రలో నటించిన సరికొత్త చిత్రం అసలు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 13 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూర్ణ కీలక పాత్ర పోషించింది.

అసలు ఓటీటీ రిలీజ్ డేట్
అసలు ఓటీటీ రిలీజ్ డేట్

Asalu Movie OTT Release date: నటుడిగా చిత్రసీమలోకి అరంగేట్రం చేసి ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. ఆయన తెరకెక్కించే సినిమాలు రెగ్యూలర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటాయి. మూవీస్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన ఆకట్టుకుంటున్నారు. తాజాగా రవిబాబు ప్రధాన పాత్రలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఆ సినిమానే ‘అసలు’. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను రవిబాబు నటించి, నిర్మించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

ఈనాడు గ్రూపుకు చెందిన ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా అసలు మూవీ విడుదల కానుంది. ఏప్రిల్ 13 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. రవిబాబు ఇందులో పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.

ఓ ప్రొఫెసర్ మర్డర్ కేసులో నలుగురు వ్యక్తులను రవిబాబు విచారించడం ట్రైలర్‌లో చూడవచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించడంలో సిద్ధహస్తుడైన రవిబాబు.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీలో పూర్ణ, సూర్యకుమార్, సత్యకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ పతాకంపై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 13 నుంచి ఈటీవీ విన్ యాప్ ద్వారా అసలు మూవీని చూడవచ్చు.

రవిబాబు దర్శకత్వంలో పూర్ణ ఇంతకుముందు అవును, అవును2, లడ్డుబాబు లాంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆయన నిర్మించిన అసలు చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది.

IPL_Entry_Point