(5 / 7)
"నేను ఈ ప్రపంచంలో అందమైన స్త్రీని కాకపోవచ్చు. నాలో ఓ మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కానీ మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. మీరు నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నా పనిని ప్రోత్సహిస్తున్నారు. నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ రోజు మన కుటుంబ పెద్దలు, బంధువుల మధ్య నేను నీతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా." అని పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చారు.