తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా సోనియా పర్సనల్ అటాక్.. బట్టలు సరిగ్గా వేసుకోవు, ఫ్యామిలీ లేదంటూ!

Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా సోనియా పర్సనల్ అటాక్.. బట్టలు సరిగ్గా వేసుకోవు, ఫ్యామిలీ లేదంటూ!

Sanjiv Kumar HT Telugu

10 September 2024, 6:30 IST

google News
  • Bigg Boss Telugu 8 September 9th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా చాలా హాట్ హాట్‌గా సాగాయి. ముఖ్యంగా ఈ నామినేషన్స్‌లో సోనియా వర్సెస్ కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ అన్నట్లుగా సాగింది. అయితే, విష్ణుప్రియపై సోనియా దారుణంగా పర్సనల్ అటాక్ చేసింది.

యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా సోనియా పర్సనల్ అటాక్.. బట్టలు సరిగ్గా వేసుకోవు, ఫ్యామిలీ లేదంటూ!
యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా సోనియా పర్సనల్ అటాక్.. బట్టలు సరిగ్గా వేసుకోవు, ఫ్యామిలీ లేదంటూ!

యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా సోనియా పర్సనల్ అటాక్.. బట్టలు సరిగ్గా వేసుకోవు, ఫ్యామిలీ లేదంటూ!

Bigg Boss Telugu 8 Day 8 Highlights: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ కూడా చాలా వాడి వేడిగా సాగాయి. మొదటి వారం నామినేషన్స్‌లో కాస్తా సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ సైతం సెకండ్ వీక్ నామినేషన్స్‌లో మాత్రం ఇచ్చిపడేశారు. ముఖ్యంగా వారిలో కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ తమ అపోనెంట్‌కు ధీటుగా సమాధానాలు ఇచ్చారు.

రోడ్డుపైన పడేయంపై

బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్ హైలెట్స్‌లోకి వెళితే.. బేబక్క ఎలిమినేషన్‌తో కిర్రాక్ సీత, నైనిక బాధపడుతూ, ఏడుస్తూ కనిపించారు. మంచికి వాల్యూ లేదని, తప్పు చేసినవాళ్లనే సపోర్ట్ చేస్తున్నారని, ఇక నుంచి నేను చెడుపై పోరాటం చేస్తానని సీత బాధపడుతూనే చెప్పింది. బేబక్క వెళ్తూ తమను రోడ్డుపై పడేసిన విషయం గురించి కామెడీ చేసుకున్నారు పృథ్వీ, నిఖిల్, సోనియా.

వీరితోపాటు అభయ్ కూడా చేరి నవ్వాడు. మరుసటి రోజు మధ్యాహ్నాం బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నామినేషన్స్‌లో బాగానే గొడవలు జరిగాయి. కానీ, ఆర్జీవీ హీరోయిన్ సోనియా వర్సెస్ కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ గొడవ మాత్రం చాలా హైలెట్ అయింది. సోనియా ప్రశ్నలకు చాలా ధీటుగా, గట్టిగా సమాధానాలు చెప్పింది సీత.

తగ్గాఫర్ ఇచ్చిన సీత

మొన్నటివరకు ఆర్గ్యుమెంట్‌లో తను చాలా స్ట్రాంగ్, తనకంటే తోపు ఎవరు లేరని బాగా ఫీల్ అయ్యే సోనియాకు ఇచ్చిపడేసింది సీత. ప్రతి ఒక్క మాటకు వివరణ ఇస్తూ మరి క్లారిటీ ఇచ్చింది. ఒక్కో సందర్భంలో సీత మాటలకు సోనియా స్ట్రక్ అయిపోయింది. అడ్డదిడ్డంగా వాదించడం, అనవసరపు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ, సీత మాత్రం తగ్గాఫర్ ఇచ్చిపడేసింది.

ఆ తర్వాత కొద్దిసేపటికి నామినేట్ చేసే అవకాశం యాంకర్ విష్ణుప్రియకు వచ్చింది. ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేసింది విష్ణు. తన గురించి తెలుసుకోడానికే క్లోజ్‌గా మూవ్ అవడం మోసం చేసినట్లు అనిపించిందని చెప్పిన విష్ణు పాయింట్‌ను మణికంఠ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత సోనియాను నామినేట్ చేసింది విష్ణుప్రియ.

తాను చేసింది అడల్ట్ రేటెడ్ జోక్ అని చెప్పింది తనకు నచ్చలేదని, తాను క్యాజువల్‌గా జోక్ చేశానని, అందుకు సారీ కూడా చెప్పాను అని, కానీ, మీరు అంతపెద్ద ట్యాగ్ ఇచ్చి దానికి వివరణ కూడా ఇవ్వలేదు, సారీ కూడా చెప్పలేదు అని యాంకర్ విష్ణుప్రియ చెప్పింది. దానికి అది నీకు కామెడీ ఏమో నాకు కాదు. మనిద్దరి మధ్య అంత ర్యాపో లేదు. దూరంగా ఉంటున్నాను అది అర్థం చేసుకోవాల్సింది అని సోనియా వాదించింది.

బట్టలు సరిగ్గా వేసుకోని

అసలు మీ దృష్టిలో అడల్ట్రీ అంటే ఏంటీ.. నేనేం అంతగా 18 ప్లస్ జోక్ వేశా. మీ మైండ్‌లో అలాగే ఉంటుంది. అందుకే మీకు అలా అనిపిస్తుంది అని విష్ణు అంటే.. నువ్ చేసేదంతా అదే, అందుకే నా మైండ్‌లో అదే ఉంది, నీకు ర్యాపో ఉన్నవాళ్లతోనే మాత్రం కామెడీ చేయవు, అటు ఇటు తిరుగుతూ అందరితో అలాగే ఉంటావ్. బట్టలు సరిగ్గా వేసుకోని.. మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలియదు. ఆయనకు ఒకవైపు డిస్‌కంఫర్ట్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చోని చేసిందంతా ఏంటీ.. నీ మాటలు, చేతలు హౌజ్‌లో అలానే అనిపిస్తాయి అని సోనియా పర్సనల్ అటాక్ చేసింది.

అసలు అలా ఎవరు ఫీల్ అయ్యారు. వాళ్లు ఫీల్ అయితే వాళ్లు చెబుతారు. మీరెందుకు వాళ్ల గురించి చెప్పడం, ఏదో పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారు అని విష్ణుప్రియ అంది. కానీ, తన మాటలు, చేతలు అంతా అడల్ట్రీగానే ఉంటాయని దారుణంగా పర్సనల్ అటాక్ చేసింది సోనియా. అయితే, ఇదంతా సోమవారం ఎపిసోడ్‌లో చూపించారు.

ఏడ్చేసిన విష్ణుప్రియ

కానీ, ఇదే కాకుండా విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని, నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదని, తనను అంటే మాత్రం తన కుటుంబం చూస్తుందని, విష్ణుని అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారని, తనను మాత్రం అలాంటివి చేయడానికి పిలవలేదని, ఇంతకుముందు అడల్ట్ కామెడీ షోలో చేశావు కాబట్టే విష్ణుని పిలిచారని సోనియా దారుణంగా అవమానించింది. దాంతో విష్ణుప్రియ ఏడ్చేసింది. ఇదంతా లైవ్‌లో జరిగినట్లు సోషల్ మీడియాలో రివ్యూవర్స్ చెబుతున్నారు. కానీ, దీన్ని ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ చేయకపోవడం గమనార్హం.

తదుపరి వ్యాసం