Jabardasth Anchor: షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ యాంకర్.. డైరెక్టర్ తప్పు వల్ల వచ్చిన ఛాన్స్!
Jabardasth Anchor Siri Hanumanth In Jawan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ షో యాంకర్ సిరి హన్మంతు నటించే అవకాశం దక్కించుకుంది. అయితే, అది ఇప్పుడు కాదు. ఇదివరకే షారుక్ ఖాన్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జవాన్ మూవీలో సిరి హన్మంతు నటించింది. ఆమెకు ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?
(1 / 7)
ప్రస్తుతం జబర్దస్త్ షోకి యాంకర్‌గా అలరిస్తోంది సిరి హన్మంతు. షోలో అదిరిపోయే స్టెప్పులు వేయడంతోపాటు గ్లామర్ ట్రీట్ అందిస్తోంది ఈ ముద్దుగుమ్మ. (All Photos @Instagram)
(2 / 7)
అయితే, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీలో నటించింది సిరి హన్మంతు. ఇందులో ఓ లేడి కానిస్టేబుల్‌గా షారుక్ ఖాన్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకుని మంచి ఛాన్స్ కొట్టేసింది.
(3 / 7)
జవాన్ ఆఫర్ తనకు డైరెక్టర్ అట్లీ ద్వారా వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో సిరి హన్మంతు తెలిపింది. ఇన్‌స్టా గ్రామ్‌లో తన ఫొటోలు చూసి తాను నార్త్ అమ్మాయి అనుకుని జవాన్ మూవీకి సెలెక్ట్ చేశారట డైరెక్టర్ అట్లీ.
(4 / 7)
అలా సిరి హన్మంతు నార్త్ యువతి అని డైరెక్టర్ అట్లీ తప్పుగా అనుకోవడం వల్ల ఈ జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సిరికి షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం కలిగింది.
(5 / 7)
ఇదిలా ఉంటే, యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా ముద్దుగుమ్మ సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు పొందింది.
(6 / 7)
న్యూస్ రీడర్‌గా చేసిన అనంతరం అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది గ్లామర్ భామ సిరి హన్మంతు.
ఇతర గ్యాలరీలు