OTT Bold Web Series: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ సీన్స్‌తో రివేంజ్ థ్రిల్లర్‌గా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-bahishkarana ott streaming on zee5 ott telugu web series bahishkarana trailer released by nagarjuna ott news anjali ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Web Series: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ సీన్స్‌తో రివేంజ్ థ్రిల్లర్‌గా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Bold Web Series: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ సీన్స్‌తో రివేంజ్ థ్రిల్లర్‌గా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

OTT Telugu Web Series Bahishkarana Trailer Nagarjuna: ఓటీటీలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బహిష్కరణ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. బోల్డ్ సీన్సుతో ఉన్న ఈ విలేజ్ రివేంజ్ డ్రామా బహిష్కరణ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ సీన్స్‌తో రివేంజ్ థ్రిల్లర్‌గా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bahishkarana OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే, తాజాగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ. దీనికి కింగ్ నాగార్జున మద్దతు తెలిపారు.

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేసి టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.

బహిష్కరణ ట్రైల‌ర్‌ విషయానికొస్తే.. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు. అలాంటి ప‌ల్లెటూరుకు పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది.

పుష్ప వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌హిష్క‌ర‌ణ వెబ్ సిరీస్.

ఇక ఇందులో అంజ‌లి పాత్ర‌ను గ‌మనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోతుంటుంది. ఆమె పాత్ర‌ను చూస్తుంటే పాత్రలోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను చూడొచ్చు.

ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలతో ఆసక్తిగా బహిష్కరణ వెబ్ సిరీస్ మలిచినట్లుగా తెలుస్తోంది. ట్రైల‌ర్‌లో ప్ర‌తి విజువ‌ల్‌, ప్ర‌తి మాటా సీరీస్ గురించి లోతుగా ఏదో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా, బోల్డ్ సీన్స్ తో ట్రైలర్‌ను క‌ట్ చేశారు.

ఇక బహిష్కరణ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 19 నుంచి బహిష్కరణ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. బహిష్కరణ వెబ్ సిరీస్‌ను ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై నిర్మించారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.

ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూర్చారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే, భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మంలో ఒకటిగా జీ5 నిలిచింది. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని అందిస్తోంది. ఇదే క్ర‌మంలో బహిష్కరణ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది. ఇప్పటికే పోస్టర్స్‌తో పాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉండటంతో బహిష్కరణపై అంచనాలు పెరిగాయి.