Udal Review: ఉడల్ రివ్యూ.. పది నిమిషాలకో ట్విస్ట్.. మతిపోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?-malayalam movie udal review in telugu ott movies malayalam udal explained in telugu durga krishna indrans udal ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Udal Review: ఉడల్ రివ్యూ.. పది నిమిషాలకో ట్విస్ట్.. మతిపోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Udal Review: ఉడల్ రివ్యూ.. పది నిమిషాలకో ట్విస్ట్.. మతిపోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 11, 2024 09:48 AM IST

Udal Movie Review In Telugu: ప్రతి పది నిమిషాలోకు అదిరిపోయే ట్విస్ట్‌తో మతి పోగొట్టే మలయాళ సినిమా ఉడల్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఎఫైర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందో ఉడల్ రివ్యూలో తెలుసుకుందాం.

ఉడల్ రివ్యూ.. పది నిమిషాలకో ట్విస్ట్.. మతిపోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?
ఉడల్ రివ్యూ.. పది నిమిషాలకో ట్విస్ట్.. మతిపోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: ఉడల్

నటీనటులు: దుర్గ కృష్ణ, ధ్యాన్ శ్రీనివాసనన్, ఇంద్రన్స్, అంజన అప్పుకుట్టన్, జూడ్ ఆంటోనీ జోసెఫ్, మాస్టర్ కన్నన్ తదితరులు

కథ, దర్శకత్వం: రతీష్ రేఘునందన్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పిల్లై

సంగీతం: విలియమ్ ఫ్రాన్సిస్

నిర్మాత: గోకులమ్ గోపాలన్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

Udal Review In Telugu: మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ప్రతి పది నిమిషాలకు ఊహించనివిధంగా అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమానే ఉడల్. బోల్డ్ అండ్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఉడల్ మూవీలో దుర్గ కృష్ణ, ధ్యాన్ శ్రీనివాసనన్, ఇంద్రన్స్ ప్రధాన పాత్రలు పోషించారు.

అక్రమ సంబంధం, ఫ్యామిలీ రిలేషన్స్‌ను టచ్ చేస్తూ మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉడల్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ రతీష్ రేఘునందన్. ఉడల్ మూవీ 2022 మే 20న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఉడల్ మూవీకి ఐఎమ్‌డీబీ 6.3 రేటింగ్ ఇచ్చింది. మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఉడల్ రివ్యూ తెలుసుకుందాం.

కథ:

షైనీ (దుర్గ కృష్ణ) ఒక గృహిణి. ఆమె భర్త రెజీ (జూడ్ ఆంటోనీ జోసెఫ్) ఫారెన్‌లో దూరంగా వర్క్‌తో బిజీగా ఉంటాడు. ఇంట్లో తన పదేళ్ల కొడుకు, అత్త, మామ కుట్టిచయాన్ (ఇంద్రన్స్) లతో కలిసి జీవిస్తుంటుంది. అయితే తన అత్తకు ఆరోగ్యం బాలేకపోవడంతో మంచానికే పరిమితం అవుతుంది. దాంతో అత్తకు షైనీ సపర్యలు చేయాల్సి వస్తుంది. మరోవైపు కాలేజీలో తన జూనియర్ అయిన కిరణ్ (ధ్యాన్ శ్రీనివాసన్)‌తో ఎఫైర్ కొనసాగిస్తుంది.

హైలెట్స్

ఈ క్రమంలోనే ఓరోజు తన కొడుకు లేని సమయంలో కిరణ్‌ను ఇంటికి పిలుస్తుంది షైనీ. ఎవరకీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా షైనీ దగ్గరికి వస్తాడు కిరణ్. ఆ తర్వాత ఆ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటీ? ఎఫైర్ మాత్రమే కాకుండా షైనీ, కిరణ్ చేసిన నేరం ఏంటీ? వారిపై సుమారు 60 ఏళ్ల వయసున్న షైనీ మామ కుట్టిచయాన్ ఎలా రివేంజ్ తీసుకున్నాడు? మరుసటి రోజు ఉదయం అయ్యే వరకు ఆ ఇంట్లో ఏం జరిగింది? వంటి థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఉడల్ మూవీ కచ్చితంగా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఉడల్ మూవీ ఒక బోల్డ్ అండ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్నా టేకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే ఉంటే మంచి విజయం సాధిస్తాయి. ఆ విషయంలో ఉడల్ మూవీని చూపించడంలో డైరెక్టర్ చాలా బాగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. కుట్టిచయాన్ ఇల్లు చూపిస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత పాత్రలు, వారి రిలేషన్‌ను పరిచయం చేస్తారు.

మొదటి పది నిమిషాల్లోనే

మొదటి పది నిమిషాల్లోనే పదేళ్ల కొడుకు ఉన్న కుట్టిచయాన్ కోడలు షైనీ తన జూనియర్ కిరణ్‌తో ఎఫైర్ సాగిస్తుందనే విషయం రివీల్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత షైనీ అత్త ఆరోగ్యం, ఆమె నుంచి వచ్చే దుర్వాసన ఇల్లంత రావడం, షైనీ చిరాకు పడటం వంటి సీన్స్‌తో సాగుతుంది. ఇక సెక్స్ కోసం షైనీ ఇంటికి కిరణ్ రావడంతో అసలు కథ మొదలు అవుతుంది.

సెక్స్ సీన్స్ తర్వాత పెద్ద ట్విస్ట్

అర్థరాత్రి ఇంటికి వచ్చిన కిరణ్‌తో షైనీ ఏం ప్లాన్ చేసింది, ఇద్దరు కలిసి ఏ నేరం చేశారనే ట్విస్ట్ షాక్ ఇస్తుంది. అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిన సంతోషంలో వచ్చే శృంగార సీన్స్ అలరిస్తాయి. ఆ తర్వాత కిరణ్‌ను పంపిచేద్దామనుకునే సమయంలో ఇల్లంతా తాళాలు వేసి ఉండటంతో ఇద్దరూ షాక్‌కు గురి అవుతారు. దీని తర్వాత నుంచి వచ్చే సీన్స్ అదిరిపోతాయి.

ఎంగేజింగ్‌గా సీన్స్

కుట్టిచయాన్ వర్సెస్ షైనీ, కిరణ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ సూపర్బ్‌గా ఉంటుంది. ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నించే ప్లాన్స్ ఆసక్తిగా ఉంటాయి. సెకండాఫ్ అంతా ఇలాగే చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఇక క్లైమాక్స్‌కు 15 నిమిషాల ముందు వచ్చే ట్విస్ట్ ఏమాత్రం ఊహించనివిధంగా మైండ్ బ్లాక్ చేస్తుంది. చివరిగా ఆ ఇంటి నుంచి ఎవరు బతికి బయట బడ్డారు అనే సస్పెన్స్‌తో సినిమా పూర్తి అవుతుంది.

అదిరిపోయిన బీజీఎమ్

సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాల్సింది విలియమ్ ఫ్రాన్సిస్ అందించిన బీజీఎమ్. ఒక్కో సీన్‌కు ఒక్కో తరహా బీజీఎమ్ అందించారు. అది మాములుగా లేదు. సీన్‌లోని డెప్త్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. అలాగే కొన్నిచోట్ల హారర్ టచ్ ఇస్తూ భయపెట్టేలా ఉంటుంది. అలాగే ఎంగేజింగ్ సీన్స్, స్క్రీన్ ప్లే కూడా మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక కుట్టచయాన్‌గా నటించిన ఇంద్రన్స్ యాక్టింగ్ వేరే లెవెల్.

స్టార్ హీరో రేంజ్‌లో ఎలివేషన్

భార్యపై తనకున్న ప్రేమతో పాటు రివేంజ్ తీసుకునే సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంది. రెండు సీన్లలో బీడీ కాలుస్తూ కుట్టచయాన్‌కు ఇచ్చే ఎలివేషన్ మాములుగా ఉండదు. స్టార్ హీరో రేంజ్‌లో ఆ ఎలివేషన్, దానికి తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ మంచి హై ఫీల్ ఇస్తుంది. ఇక షైనీగా దుర్గ కృష్ణ సైతం చాలా బాగా మెప్పించింది. సెక్స్ కోరికలు తీర్చుకోడానికి ఎలాంటి పనికి అయిన సిద్ధపడే గృహిణిగా ఆకట్టుకుంది.

కిడ్స్‌కు దూరంగా

ధ్యాన్ శ్రీనివాసన్ యాక్టింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే రెండు గంటల నిడివి ఉన్న ఉడల్ మూవీ మొదటి గంట కాస్తా స్లోగా సాగిన.. ఆ తర్వాతి గంట చాలా బాగా ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లింగ్ సీన్స్‌తో సాగే ఈ సినిమాలో కాస్తా అడల్ట్ కంటెంట్, రక్తపాతం ఉండటంతో చిన్న పిల్లలు, ఫ్యామిలీతో చూడలేం. ఒంటరిగా చూస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే ఉడల్ మూవీ బెస్ట్ ఆప్షన్.

WhatsApp channel